BRS Party (@BRSparty) header
BRS Party (@BRSparty) profile picture

Official Twitter handle of Bharat Rashtra Samithi. BRS Party, formerly known as TRS Party, is an Indian political party founded by Sri KCR.

Hyderabad, Telangana
Joined March 2014
Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)
వరంగల్‌లోని కేడీసీ గ్రౌండ్‌లో జరిగిన జన చైతన్య సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న ఏకశిలా విద్యాసంస్థల అధినేత గౌరు తిరుపతి రెడ్డి, ఆయన అనుచరులు, వివిధ రంగాలకు చెందిన మేధావులు. ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ.. 🔹 కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది.. ఇంకా 500 రోజులే మిగిలి ఉన్నాయి. 🔹 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం. 🔹 కాంగ్రెస్ పాలనలో అవినీతి ఎన్నో తలలతో విజృంభిస్తోంది. 🔹 కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల వరకు వసూళ్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. 🔹 పనులు జరగాలంటే 20 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని మరో ఎమ్మెల్యే చెబుతున్నారు. 🔹 పారిశ్రామికవేత్తల తలపై తుపాకీ పెట్టి రేవంత్ సోదరులు వందల కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని మాజీ మంత్రి కొండా సురేఖ కూతురే స్వయంగా చెప్పింది. 🔹 ప్రజాపాలన కంటే పర్సంటేజీల పాలనే ఎక్కువగా కనిపిస్తోంది. 🔹 హామీలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా రేవంత్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. 🔹 రేవంత్ రెడ్డి, పొంగులేటి కుటుంబాల ప్రైవేట్ విద్యా వ్యాపారాల కోసమే ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దు కుట్ర. 🔹 మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో వరంగల్‌లో సంక్షేమం సున్నా.. అభివృద్ధి గుండుసున్నా. 🔹 ఒక్క కొత్త ఐటీ కంపెనీని, ఒక్క కొత్త టెక్స్‌టైల్ పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారు.. ఉన్న పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయి. 🔹 90 శాతం పూర్తయిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మిగిలిన 10 శాతం పనులను మూడేళ్లలో పూర్తి చేయలేకపోయారు. 🔹 పేదల ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి చేయకుండా రేవంత్ తన సొంత మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 🔹 ఫ్యూచర్ సిటీపై కాదు.. ఫ్యూచర్ ఉన్న సిటీ వరంగల్‌పై దృష్టి పెట్టండి. 🔹 ఫార్మా సిటీ పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అని ప్రచారం చేసుకోవడం అభివృద్ధి కాదు. 🔹 వరంగల్‌ను భవిష్యత్తులో ప్రధాన ఐటీ, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, టి. రాజయ్య, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, బాల్క సుమన్, రెడ్యానాయక్, గండ్ర వెంకటరమణ రెడ్డి, ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి, సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి, పెద్ది స్వప్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
17
68
2,295
భవిష్యత్తులో వరంగల్ నగరాన్ని 'ఫ్యూచర్ సిటీ'గా తీర్చిదిద్దే బాధ్యత నేనే తీసుకుంటా! ✊ - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
2
35
132
2,875
తెలంగాణ ఉద్యమ సమయంలో సరిగ్గా 17 ఏళ్ల కిందట నవంబర్ 29 నాడు తాను అరెస్ట్ అయ్యి వరంగల్ సెంట్రల్ జైల్లో ఒక ఖైదీగా గడిపిన రోజులను యాది చేసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఉద్యమం నుంచి రజతోత్సవ సభ దాకా అన్నిటికీ మొదటి నుంచి అండగా ఉన్నది ఓరుగల్లు. మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా మళ్ళీ భవిష్యత్తులో ఉంటది. తప్పకుండా 2028వ సంవత్సరంలో కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారు.
1
36
1
116
4,361
కొత్తగా ఇచ్చిన పింఛన్ల కంటే.. కాంగ్రెస్ తొలగించిన పింఛన్లే ఎక్కువ! ​మూడేళ్లలో 4.71 లక్షల పింఛన్లను తొలగించిన కాంగ్రెస్ సర్కార్.. కొత్తగా ఇచ్చింది కేవలం 4.63 లక్షల పింఛన్లే! పింఛన్లలో కోత పెట్టి లబ్ధిదారులను మోసం చేసిన రేవంత్ రూ. 4 వేల పింఛన్ ఇస్తామన్నా హామీని కూడా కాంగ్రెస్ మరిచిపోయింది. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
1
32
63
3,357
రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS దమ్మున్న సవాల్ 🔥 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసుడు దేవుడెరుగు.. నెలకు ₹2,500 హామీ కింద 1.67 కోట్ల మంది ఆడబిడ్డలకు ₹1.50 లక్షల చొప్పున వారి ఖాతాలో వెయ్!
36
1
104
4,553
వరంగల్ గడ్డపై పేద ప్రజల కోసం కేసీఆర్ గారు 24అంతస్తుల్లో 2,250 పడకలతో భారత దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తే 90 శాతం పూర్తయిన ఈ ఆసుపత్రిని మిగిలిన 10శాతం పనులు పూర్తి చేయకుండా.. తమ కుటుంబం కార్పొరేట్ ఆసుపత్రులు తెరవడంలో బిజీగా ఉన్నడు రేవంత్ రెడ్డి జనగామ, మహబూబాబాద్ ఆసుపత్రులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారిది అలాగే వరంగల్‌లో ఎల్‌అండ్‌టీ మైండ్‌ట్రీ, సైయంట్,టెక్ మహీంద్రా, క్వాడ్రంట్ వంటి ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఐటీ పార్కును మేము అభివృద్ధి చేసినం కానీ మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో కొత్త ఐటీ కంపెనీ ఒక్కటైనా వచ్చిందా? ఉన్న కంపెనీలే వెళ్లిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
1
42
2
104
4,160
ట్రక్ పార్క్ భూములు అమ్మొద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న స్థానికులు @BRSparty @KTRBRS @BRSHarish
5
25
491
పోరాటాల ఖిల్లా ఓరుగల్లు గడ్డపై మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే! 🔥✊ ​బీఆర్ఎస్ జన చైతన్య సభ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షంలో పార్టీలో చేరిన ఏకశిలా విద్యాసంస్థల అధినేత గౌరు తిరుపతి రెడ్డి గారు, ఆయన అనుచరులు మరియు పలువురు మేధావులు.
1
35
137
4,310
LIVE: జన చైతన్య సభ 📍 హనుమకొండ nitter.gq/i/broadcasts/2dKkjoelO…
45
1
122
4,649
తెలంగాణ విద్యార్థుల స్థానికత హక్కులను కాలరాయొద్దని, స్వార్థపూరిత ఇంటర్మీడియట్ రద్దు నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ఎమ్మెల్సీ @sravandasoju ♦️ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి 9 నుండి 12వ తరగతి వరకు ఒకే బడిగా మారిస్తే తెలంగాణ విద్యార్థుల స్థానికతపై రేవంత్ ప్రభుత్వం దాడి చేసినట్లే ♦️నాలుగేళ్ల కార్పొరేట్ హాస్టల్ ప్యాకేజీ కొంటే ఇతర రాష్ట్రాల విద్యార్థులు సైతం చట్టబద్ధంగా 'తెలంగాణ లోకల్' అయిపోయి, మన బిడ్డల మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు తన్నుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ♦️లోకల్ హోదా పుట్టుకతో కాకుండా ప్రవేశ పరీక్షకు ముందు వరుసగా 4 ఏళ్లు ఎక్కడ చదివారనే దానిపైనే ఆధారపడి ఉంటుందని లేఖలో స్పష్టం చేశారు. ♦️తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును శాశ్వతంగా దెబ్బతీసే ఈ చట్టపరమైన ఇంటర్మీడియట్ రద్దు ప్రమాదాన్ని నివారించాలని శ్రవణ్ కుమార్ కోరారు. ♦️ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులతో కనీస చర్చ లేకుండా తీసుకున్న ఇంటర్మీడియట్ రద్దు నిర్ణయం వెనుక కార్పొరేట్ కాలేజీల ప్రయోజనాలున్నాయని ఆరోపించారు. ♦️నవంబర్ 13న రాసిన తాను బహిరంగ లేఖపై వారం గడిచినా ప్రభుత్వం నుండి ఒక్క సమాధానం కూడా రాలేదని, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే ఇంటర్మీడియట్ రద్దు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
23
1
75
3,640
వేలాది మంది విద్యార్థుల ఐఐటీ, నీట్ విజయాలకు పునాది వేసిన ఇంటర్మీడియట్ వ్యవస్థను కూల్చాలని చూడటం ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అవివేకానికి నిదర్శనం. విద్యకు 15% బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి కేవలం 8% మాత్రమే కేటాయించి, 20 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేస్తున్న రేవంత్. ఎన్‌ఈపీని సోనియా గాంధీ మరియు కర్ణాటక తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని అమలు చేస్తాననడం రేవంత్ రాజకీయ ద్వంద్వ నీతికి నిదర్శనం! కేబీఆర్ పార్క్ నిర్ణయం తరహాలోనే ఇంటర్మీడియట్ విషయంలోనూ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటూ, తరతరాల విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న రేవంత్ రెడ్డి. ప్రజాస్వామికంగా విస్తృత చర్చ జరపకుండా, తెలంగాణను రేవంత్ రెడ్డి తన సొంత ప్రైవేట్ జాగీరులా భావించి ఇష్టారీతిన విధానాలను రుద్దడం సరికాదు. - ఎమ్మెల్సీ @sravandasoju
19
71
2,668
దశాబ్దాలుగా నిర్మించుకున్న బ్రాండ్ హైదరాబాద్‌ను మూడేళ్లలోనే మంటగలుపుతున్న రేవంత్ రెడ్డి! ఒకవైపు కరువు ఉన్నా సరే.. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహించి, పెట్టుబడులు తెస్తామని బిల్డప్‌లు కొడుతున్న కాంగ్రెస్ సర్కార్.. మరోవైపు, తమ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువజన విభాగం గూండాలతో ఏకంగా హైదరాబాద్‌లోని అంతర్జాతీయ సంస్థ Meta క్యాంపస్‌పైనే దాడులు చేయిస్తున్నది. ఉన్న కంపెనీలకే రక్షణ కల్పించలేని కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్త పెట్టుబడులు ఎలా తెస్తుంది? ఇలాంటి చిల్లర పనులు చేస్తే కొత్త పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయా? మెటా లాంటి అంతర్జాతీయ సంస్థపై దాడికి కార్యకర్తలను పంపడానికి రాహుల్ గాంధీకి సిగ్గుందా? శాంతిభద్రతలను గాలికొదిలేసిన రేవంత్ రెడ్డి సమాధానం చెబుతారా? #CongressFailedTelangana
27
75
2,502
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం nitter.gq/i/broadcasts/2VNlozjQA…
7
44
2,315
నేడే బీఆర్ఎస్ జన చైతన్య సభ 💥 మూడేళ్ల కాంగ్రెస్ మోసాలు, వైఫల్యాలను.. పోరాటాల గడ్డ ఓరుగల్లు వేదికగా ఎండగట్టనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥✊ 🗓️ నవంబర్ 22, 2026 (ఆదివారం) ⏰ సాయంత్రం 5 గంటలకు 📍 కేడీసీ మైదానం, హనుమకొండ
1
28
1
88
3,204
అష్టదిగ్బంధనాలను రైతులే ఛేదించాలి రాజకీయ పార్టీలు రైతులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని, వారి మౌలిక ప్రయోజనాలను విస్మరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అన్నదాతలే రాజకీయంగా చైతన్యవంతమై ఆలోచించాల్సిన చారిత్రాత్మక అవసరం ఏర్పడింది. నేడు వ్యవసాయం ఎందుకు ఇంతటి సంక్షోభంలో కూరుకుపోయింది? రైతు చుట్టూ ఎందుకు ‘అష్టదిగ్బంధనాలు’ అల్లుకున్నాయి? అనే విషయంపై లోతైన చర్చ జరుగాలి. నేడు ఒక సామాన్య రైతు సాగు చేయాలంటే ఎనిమిది రకాల సవాళ్లు, నియంత్రణలను దాటుకోవాల్సి వస్తున్నది. కరెంట్‌, సాగు నీళ్లు, విత్తనాలు, ఎరువులు (క్రిమిసంహారక మందులను ఇంకా ఆధార్‌కు లింక్‌ చేయలేదు), బ్యాంకు రుణాలు, పంటల బీమా, మార్కెటింగ్‌, రెవెన్యూ వ్యవస్థ. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎనిమిది అంశాల్లో రైతులు ఏ మేరకు నిశ్చింతగా ఉన్నారో ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ఎనిమిది అంశాల్లో ఏడింటిని నేరుగా ‘ఆధార్‌’తో ముడిపెట్టి, ప్రతి అడుగులోనూ రైతన్నను అనుమానించే ధోరణి విపరీతంగా పెరిగింది. దేశానికి అన్నం పెట్టే ఒక వృత్తిని ఇన్ని నిర్బంధాలకు ఎందుకు గురిచేస్తున్నారు? రైతులపై ప్రభుత్వాలకు ఎందుకంత అపనమ్మకం? రైతు క్షేమం విషయంలో అన్ని పార్టీలు ఒకే అభిప్రాయంతో రాజకీయాలు పక్కనపెట్టి కృషి చేయడం పలు రాష్ర్టాల్లో ఉన్నది. ఈ విషయాన్ని తెలంగాణ రైతులు లోతుగా గుర్తించాలి. ఇప్పటికైనా అందరూ కలిసి ప్రతి పల్లెలోనూ సాగునీటి ప్రాజెక్టులు, రైతుకు ఎదురవుతున్న అష్ట దిగ్బంధనాలపై ప్రధానంగా చర్చించాలి. ఇప్పటికైనా తెలంగాణ రైతుల దృక్పథంలో మార్పు రావాలి. కులమతాలకు అతీతంగా ‘రైతు’ అనే ఒకే ఒక్క ఐక్య శక్తిగా ఎదిగి, తమ సాగునీటి ప్రాజెక్టులను కాపాడుకుంటూ, తమ చుట్టూ అల్లుకున్న అష్టదిగ్బంధనాలను ఛేదించుకున్నప్పుడే రైతుకు నిజమైన స్వాతంత్య్రం లభిస్తుంది. తెలంగాణ రైతులు అటు ఆంధ్ర, ఇటు మహారాష్ట్ర ప్రాంతాల్లోని సంఘటిత రైతు శక్తిని గమనించి, రాజకీయ పార్టీల ఎజెండాలను ప్రభావితం చేసే విధంగా చైతన్యవంతులు కావాలి. మనం పోలవరం విషయంలో చూసినా, పోతిరెడ్డిపాడు విషయంలో చూసినా అక్కడి రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్‌ కోసం పోటీ ఉంటుందే తప్ప, ప్రాజెక్టులనే రద్దు చేయాలన్న లేదా నిర్వీర్యం చేయాలన్న ధోరణి ఉండదు. రైతు క్షేమం విషయంలో అన్ని పార్టీలదీ ఒకే అభిప్రాయం; రాజకీయాలు పక్కనపెట్టి కృషి చేయడం అక్కడి సంస్కృతి. ఈ విషయాన్ని తెలంగాణ రైతులు లోతుగా గుర్తించాలి. ఇప్పటికైనా కుల, మతాలకు అతీతంగా ప్రతి పల్లెలోనూ సాగునీటి ప్రాజెక్టులు, రైతుకు ఎదురవుతున్న అష్టదిగ్బంధనాలపై ప్రధాన చర్చ జరుగాలి. నేడు రైతు ఎదుర్కొంటున్నది కేవలం ఆర్థిక లేదా నీటి సమస్య మాత్రమే కాదు; ఆత్మగౌరవ సమస్య! అక్రమ వలసలను నిరోధించడానికి, ప్రభుత్వ పథకాల్లో నకిలీ లబ్ధిదారులను అడ్డుకోవడానికి ఉద్దేశించిన ‘ఆధార్‌’ నిబంధనలను నిస్వార్థంగా దేశానికి అన్నం పెట్టే రైతు వ్యవసాయానికి ముడిపెట్టడం అత్యంత అసంబద్ధం, అనాగరికం. నాడు ‘జై జవాన్‌-జై కిసాన్‌’ అనే మహోన్నత నినాదంతో ప్రగతిపథంలో అడుగులు వేసిన స్వతంత్ర భారతదేశం, నేడు రైతును ‘ఆధార్‌’ అనుమానపు చట్రంలో బంధించే స్థాయికి దిగజారడం-సమకాలీన రాజకీయ పార్టీలకు రైతు పట్ల ఉన్న నిర్లిప్తతకు, చిన్నచూపునకు నిదర్శనం. ఈ అవమానకర స్థితి మారాలంటే-అన్నదాత తన ఓటు శక్తితో పాలకులకు కనువిప్పు కలిగించక తప్పదు! (వ్యాసకర్త: చంద్రి రాఘవరెడ్డి, ప్రొఫెసర్‌, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం)
19
64
2,534
ఆరుతడి పంటలు వేసుకోమంటున్నారు, ఆ పంటలకు నీళ్లు ఎక్కడి నుంచి ఇస్తారు? నీటి తడి లేకుండా ఏ గింజా మొలకెత్తదు, కూరగాయల సాగుకైనా నీళ్లు కావాలి.
24
110
1,316
అలుగునూర్ లో ఈనెల 29వ తేదీన నిర్వహించబోయే దీక్ష దివస్ బహిరంగ సభకు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు హాజరుకానున్న నేపథ్యంలో సభాస్థలిని పరిశీలించడం జరిగింది.
5
1
45
1,302
హద్దులు దాటిన సీఎం దూషణలు ప్రజాస్వామ్యంలో మాటలకు అపారమైన శక్తి ఉంటుంది. ఒక పాలకుడు వాడే ప్రతీ పదం కేవలం భావప్రకటనకు సాధనం మాత్రమే కాదు, అది ఆ సమాజ నైతిక స్థాయి, పాలనా సంస్కృతి, ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అధికారంలో ఉన్నవారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే తీరు యావత్తు రాష్ర్టానికీ దిశానిర్దేశం చేయాలి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రతిపక్ష నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా, సాధారణ ప్రజల్లోనూ చర్చకు దారితీస్తున్నాయి. నిన్నటివరకు తనను వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీ నాయకులను పైనే తిట్లు ప్రయోగించగా, తాజాగా జరిగిన సిద్దిపేట సభలో సొంత పార్టీ శాసనసభ్యులపై కూడా మాటలదాడి చేయడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ప్రజల జీవన ప్రమాణాలు, ఉద్యోగ కల్పన, రైతుల సంక్షేమం, విద్య, వైద్యం వంటి కీలక అంశాలపై జరుగాల్సిన చర్చ, ఎవరు ఎవరిని ఏ పదంతో తిట్టారు అనే అంశం వైపు మళ్లడం సమాజానికి ఏ రకంగానూ మేలు చేయదు. ముఖ్యమంత్రి పదవి కేవలం ఒక పార్టీకో, ఒక వర్గానికో పరిమితమైనది కాదు. అది రాజ్యాంగబద్ధమైన బాధ్యత. ఆ పదవిలో ఉన్నవారు తమ భాషను మరింత పరిణతి, సంయమనంతో తీర్చిదిద్దుకోవాలి. విమర్శలను ఎదుర్కోవడానికి బలమైన విధానాలు, స్పష్టమైన పాలనా ఫలితాలు ఉండాలి తప్ప, తిట్లు, దూషణలు సరికాదు. రాజకీయాలు ఉన్నతంగా, విలువలకు కట్టుబడి ఉన్నప్పుడే ప్రజలకు వాటిపై విశ్వాసం నిలుస్తుంది. మాటల తూటాలకు బదులుగా, ఆలోచనల పదునుతో, హుందాతనంతో ముందుకు సాగినప్పుడే ప్రజాస్వామ్యానికి, పాలకులకు గౌరవం దక్కుతుంది. (వ్యాసకర్త: సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నాయకురాలు) @BrsSabithaIndra
1
14
69
2,265
📣 రాష్ట్రంలోని కీలక ఇన్‌ఫ్రా ప్రాజెక్టులన్నీ కేఎల్‌ఎస్ఆర్‌కే❗ 🚨 రేవంత్ బినామీ కంపెనీ కావడమే కారణం 📢 🆘 దివాలా కంపెనీ.. రూ. 6వేల కోట్ల బినామీ వైభవం ⛔ తాజాగా ఎస్ఆర్ఎస్పీ స్టేజీ-2 పనులు కూడా అదే కంపెనీకి 🤑 అంచనా కన్నా ఎక్కువ కోట్ చేసినా కట్టబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ⚠️ మిగతా కంపెనీలు పోటీలో లేకపోవడంపై అనుమానాలు దివాలా అంచుకు చేరిన కంపెనీకి ఎవరైనా రూ.వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెడతారా? ఉద్యోగులకు కనీసం జీతం కూడా ఇవ్వలేని స్థితికి దిగజారిపోయిన కంపెనీ భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నదంటే ఎవరైనా నమ్ముతారా? ఆర్థిక అవకతవకలు, బ్యాంకులను మోసం చేసిందన్న ఆరోపణలు ఉన్నా.. ప్రభుత్వం పిలిచి మరీ పనులు అప్పగిస్తుందా? ఓ కేసులో తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలంటూ ఏకంగా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) న్యాయమూర్తిపై ఒత్తిళ్లు తెచ్చిన ఘన చరిత్ర ఉన్న కంపెనీకి పోటీ లేకుండా టెండర్లు కట్టబెడతారా? సాధారణంగా అయితే ఇవేమీ జరగవు. కానీ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం. పైపెచ్చు ఆ కంపెనీ రేవంత్ బినామీదంటూ వార్తలు ఉండనే ఉన్నాయి. ఇంకేమున్నది? ఈ రెండు ప్రధాన అర్హతలున్న ఆ కంపెనీకి ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు రూ.వేల కోట్ల టెండర్లు కట్టబెడుతున్నది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆ ఇన్‌ఫ్రా కంపెనీనే ‘కేఎల్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌’. ఒకానొక సందర్భంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక దివాలా అంచుకు చేరింది. కానీ 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే ఆ కంపెనీ దశ తిరిగిపోయింది. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆ కంపెనీకి.. ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 6 వేల కోట్ల పైచిలుకు విలువైన కాంట్రాక్టులు దక్కాయి. ఇందులో మెజార్టీ ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వమే కట్టబెట్టింది. తాజాగా సూర్యాపేట జిల్లా మోతె పరిధిలో చేపడుతున్న ఎస్సారెస్పీ స్టేజీ 2 పనుల కాంట్రాక్టు కూడా ఎలాంటి పోటీ లేకుండా ఆ కంపెనీకే దక్కింది. దివాలా తీసిన ఓ కంపెనీకి ఇలా ప్రాజెక్టులన్నీ గంపగుత్తగా, అదీ ఎలాంటి పోటీ లేకుండా ఎందుకు దక్కుతున్నాయి? ఆ కంపెనీపై కాంగ్రెస్‌ సర్కారుకు అంత ప్రేమ ఎందుకు?
35
1
103
4,975