మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజమహేంద్రవరం వాసులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. దాంతో లబ్ధిదారులు ప్రధాని మోదీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
#BJP4Andhra #RajamahendravaramDevelopment #PMVishwakarma #PMAY #PoshanAbhiyaan
దేశ స్వాతంత్య్రం, గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం అణచివేతకు ఎదురొడ్డి పోరాడిన ఎందరో గిరిజన వీరుల త్యాగాలు చిరస్మరణీయం.
నీలాంబర్–పీతాంబర్, జోరియా పరమేశ్వర్, కొమురం భీమ్, హేలెన్ లెప్పా వంటి మహనీయుల పోరాట స్ఫూర్తి, ధైర్యసాహసాలు తరతరాలకు ఆదర్శం.
గిరిజన వీరుల చరిత్రను భావితరాలకు పరిచయం చేస్తూ, వారి త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత.
గిరిజన వీరులకు ఘన నివాళులు! వారి పోరాట స్ఫూర్తికి శతకోటి వందనాలు!
#AdivasiPride #TribalHeroes #TribalFreedomFighters #JanjatiyaGaurav #BJP4Andhra #BJP4India
ఎన్‌డీఏ ప్రభుత్వ నాయకత్వం, మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి కృషితో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యరంగం అగ్రగామిగా నిలుస్తోంది. 6.28 లక్షల మంది ప్రజల భాగస్వామ్యంతో 50,080 కార్యక్రమాలు నిర్వహించి, ‘బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో’ ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తన సత్తా చాటింది.
#NDA4Andhra #BRICS2026
#SatyaKumarYadav
మోదీ ప్రభుత్వ సహకారంతో కావలి అభివృద్ధికి బాటలు!
పేదలకు పక్కా ఇళ్లు, యువతకు నైపుణ్యాభివృద్ధి–ఉపాధి అవకాశాలు, చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత, తాగునీటి సౌకర్యాలు, సౌర విద్యుత్,.. ఇలా సంక్షేమం నుంచి మౌలిక వసతుల వరకు కావలి సమగ్ర అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు, పట్టణ ప్రగతికి బాటలు వేస్తోంది.
#BJP4Andhra #NDA4APDevelopment #NDA4KavaliDevelopment
మన బాపట్లలో తాగునీటి నుంచి ఉపాధి, పర్యాటక, విద్య, వైద్య రంగాల వరకు సమగ్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. బాపట్ల మరింత అభివృద్ధి చెందడానికి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి మన బీజేపీ చైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ కుమార్ గారిని గెలిపిద్దాం!
#BJP4Andhra #NDA4APDevelopment #NDA4BapatlaDevelopment
మోదీ ప్రభుత్వ సహకారంతో రాజమహేంద్రవరం కార్పొరేషన్ అభివృద్ధికి బాటలు!
పేదలకు పక్కా ఇళ్లు, యువతకు ఉపాధి, చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత, సౌర విద్యుత్, రైల్వేల విస్తరణ.. ఇలా సంక్షేమం నుంచి మౌలిక వసతుల వరకు రాజమహేంద్రవరం కార్పొరేషన్ సమగ్ర అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు, నగర ప్రగతికి బాటలు వేస్తోంది.
#BJP4Andhra #NDA4APDevelopment
#NDA4Rajamahendravaram
విశాఖపట్నం ప్రజా రవాణాలో మరో ముందడుగు!
పీఎం ఈ-బస్ సేవా పథకం కింద 30 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభంతో నగరంలో పర్యావరణహిత ప్రజా రవాణాకు మరింత ప్రోత్సాహం లభిస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు, కాలుష్య నియంత్రణ, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ప్రజా సంక్షేమం - పర్యావరణ పరిరక్షణ - అభివృద్ధి!
#PMEBusSewa #Visakhapatnam #BJP4Andhra
నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గత 12 ఏళ్లలో భారత్ ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా ఎదగడమే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పిస్తూ స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. యువశక్తికి ప్రాధాన్యతనిస్తూ వికసిత భారత్ లక్ష్యంగా దేశం పురోగమిస్తోంది.
– శ్రీ @AmitShah గారు
#12YearsOfModi #ViksitBharat #YouthEmpowerment #EmploymentGeneration #EconomicGrowth
12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో దేశంలో ఒక చారిత్రాత్మక మార్పు ఆవిష్కృతమైంది. సుమారు 50 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడి, మెరుగైన జీవన ప్రమాణాలను అందుకున్నారు. పేదల సంక్షేమం, సాధికారత, సమ్మిళిత అభివృద్ధికి మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇదే నిదర్శనం.
– శ్రీ @AmitShah గారు
#12YearsOfModiGovernment #GaribKalyan #ModiGovernment #ViksitBharat #SabkaSaathSabkaVikas
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గణాంకాలను సమగ్రంగా విశ్లేషించిన తర్వాత పూర్తి విశ్వాసంతో చెబుతున్నాను… రాబోయే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అగ్రస్థానానికి చేరుకుంటుంది.
- శ్రీ @AmitShah గారు
#ViksitAndhraPradesh #ViksitBharat #Development #DoubleEngineSarkar #BJP4Andhra
నక్సలిజంపై పోరాటంలో భారత్ చారిత్రాత్మక విజయం!
గతంలో ఏటా 2,000కు పైగా నక్సలైట్ దాడులతో అట్టుడికిన దేశంలో, నేడు ఒక్క నక్సలైట్ దాడి కూడా లేని పరిస్థితి నెలకొనడం భద్రతా వ్యవస్థల సమష్టి కృషికి నిదర్శనం. నక్సలిజం నిర్మూలన దిశగా సాధించిన ఈ విజయం యావత్ దేశ ప్రజల విజయం.
- శ్రీ @AmitShah గారు
#AmitShah #NaxalMuktBharat
సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రస్థానం… దేశ ప్రధానిగా ఎదిగిన అసాధారణ నాయకత్వం!
ఒకప్పుడు బీజేపీ కార్యాలయంలో దీపావళి మిలన్ కార్యక్రమానికి కుర్చీలు ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ గారు, నేడు 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచారు.
పదవులు కాదు… పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావమే నాయకత్వానికి అసలైన చిరునామా!
@narendramodi @narendra
#NarendraModi #PMModi #BJP #Sangathan #Leadership #Seva
🤖 Made with AI
నల్లమల అడవుల మీదుగా శ్రీశైలం–పెద్ద దోర్నాల మధ్య 43 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి తొలి అడుగు!
ప్రతిపాదిత ప్రాజెక్టుపై NHAI గ్రౌండ్ సర్వే ప్రారంభించడం ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ, పర్యాటక రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.
#NHAI #Srisailam #Nallamala #InfrastructureDevelopment #AndhraPradesh
🤖 Made with AI
విదేశీయులతో భారత ప్రజాస్వామ్యంపై విమర్శలు చేయిస్తూ చప్పట్లు కొట్టడమేనా రాహుల్ గాంధీ దేశభక్తి?
భారతీయుల తీర్పును అంగీకరించలేక, ఇప్పుడు విదేశీ రాజకీయ నాయకులతో రాజకీయ ప్రచారం చేయిస్తున్న రాహుల్ గాంధీ వైఖరి సిగ్గుచేటు!
#RahulExposed #CongressExposed
ఎన్‌డీఏ పాలనలో బాపట్ల అభివృద్ధికి కొత్త దిశ!
రైల్వే స్టేషన్ ఆధునీకరణ నుంచి సూర్యలంక బీచ్ అభివృద్ధి వరకు, వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పన నుంచి పట్టణ ప్రగతి వరకు.. బాపట్ల రూపురేఖలు మారుతున్నాయి. ఈ అభివృద్ధి వేగం మరింత పెరిగేందుకు మున్సిపాలిటీలోనూ ఎన్‌డీఏకు అండగా నిలవాలి. బాపట్ల మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి ఇస్కా సునీల్ కుమార్ గారిని గెలిపించి, అభివృద్ధికి పట్టం కడదాం!
#BapatlaDevelopment #NDA4APDevelopment #APMunicipalElections2026
ప్రధాని @narendramodi గారి నాయకత్వంలో వికసిత భారత్ దిశగా భారత ఆర్థిక ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది!
అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన సత్తా చాటుతోంది. అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ 2026-27 రెండో త్రైమాసికంలో 7.7% జీడీపీ వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఎకనామిక్ టైమ్స్ సర్వే వెల్లడించింది.
#ViksitBharat #IndianEconomy #PMModi
యువతలో ఆశలు, ఆకాంక్షలు నింపాల్సిన నాయకత్వం.. వారి మనసుల్లో విషాన్ని నింపి, ఉద్యమాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడమే తన రాజకీయంగా మార్చుకుంది. బంగ్లాదేశ్ ఉద్యమాన్ని ఆదర్శంగా చూపిస్తూ, భారతదేశంలోనూ ప్రభుత్వ మార్పు జరగాలంటూ విదేశీ వేదికలపై పిలుపునివ్వడం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలపై ప్రజలు ఆలోచించాలి.
యువత భవిష్యత్తుకు బాటలు వేయడం కాదు.. యువతలో విషం నింపి దేశంలో అశాంతిని రగిలించడమేనా మీ రాజకీయ వ్యూహం?
#PoisoningYoungMinds #AntiIndiaPolitics
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి తరఫున బరిలో నిలుస్తున్న బీజేపీ అభ్యర్థి శ్రీమతి @SriRelangi గారి నామినేషన్ ర్యాలీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు @MadhavBJP గారు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు @kanduladurgesh గారు, ఎమ్మెల్సీ @somuveerraju గారు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే @GORANTLA_BC గారు, అనపర్తి ఎమ్మెల్యే @MeeNallamilli గారు పాల్గొన్నారు.
ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నామినేషన్ ర్యాలీని నిర్వహించారు.
#LocalBodyElections #BJPAndhraPradesh #NDA #Rajamahendravaram



















