BigTV APP (@BigtvApp) header
BigTV APP (@BigtvApp) profile picture

BIG TV Telugu | Bold New Avatar Voice of the People | Without Fear or Favour Asia's largest immersive news intelligence centre

Hyderabad
Joined February 2022
#CctvFootage మేడిపల్లిలో భారీ చోరీ.. రూ.కోటి విలువైన వజ్రాభరణాలు అపహరణ! మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యారెట్‌ లేన్‌ టాటా ప్రొడక్ట్‌ జువెలరీలో జరిగిన భారీ చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజీ బయటకొచ్చింది. తెల్లవారుజామున 4గంటలకు ఏడుగురు దుండగులు షాపు వద్దకు చేరుకొని మెట్లపై కాసేపు ఉన్నారు. అనంతరం పెద్ద వస్త్రాన్ని అడ్డుపెట్టి షట్టర్‌ను బద్దలుకొట్టి లోపలికి చొరబడ్డారు. నిమిషాల వ్యవధిలోనే దాదాపు రూ.2కోట్ల విలువైన గోల్డ్, వజ్రాభరణాలను దోచుకొని పరారయ్యారు.
3
1,362
కీసరగుట్ట ఆలయాన్ని దర్శించుకున్న గవర్నర్‌ సతీమణి HYD: మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామిని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా సతీమణి జానకి శుక్లా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదపండితుల ఆశీర్వచనాలు, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
5
1,082
'ఐదు నిమిషాల్లో 2కోట్ల ఆభరణాల చోరీ చేశారు' HYD: మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌‌ పరిధిలోని 'క్యారెట్‌ లేన్‌' జ్యువెలరీ షాప్‌లో జరిగిన భారీ చోరీపై ఉప్పల్‌ డీసీపీ సురేశ్‌ కుమార్‌ వివరాలు వెల్లడించారు. ఏడుగురు దుండగులు రాగా, ఒకరు షాప్‌లోకి చొరబడి కేవలం 5 నిమిషాల్లో రూ.2 కోట్ల విలువైన 450 బంగారు, వజ్రాభరణాలను కొల్లగొట్టినట్లు ఆయన తెలిపారు.
4
1,388
ఇది శాంతి సమయం..: పవన్ AP: ప్రొద్దుటూరు సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గొడవలు, కక్షల కంటే అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇది శాంతియుతంగా అభివృద్ధిని చూసే సమయమని, అందుకే రాయలసీమ పౌరుషానికి తగినట్లుగా మాట్లాడట్లేదని తెలిపారు. ఎన్నికల సమయంలో తన శైలి వేరుగా ఉంటుందని, ప్రత్యర్థులు హద్దులు దాటితే మాత్రం స్పందన మారుతుందని ఆయన హెచ్చరించారు.
4
946
చిరంజీవి, బాలకృష్ణతో మల్టీస్టారర్ చేస్తా: బోయపాటి
1
771
ఓట్ల చోరీ.. జేబుల చోరీ: సీపీఐ నారాయణ NDA సర్కార్ ఒకవైపు ఓట్ల దొంగతనానికి పాల్పడుతూ, మరోవైపు యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వేసి సామాన్యుల జేబులు గుల్ల చేస్తోంది: సీపీఐ నేత కె.నారాయణ కార్పొరేట్లకు రూ.13లక్షల కోట్లు దోచిపెట్టిన కేంద్రం, బ్యాంకుల పేరుతో ప్రజలను మోసం చేస్తోంది జీఎస్టీ తరహాలోనే యూపీఐ భారం ప్రజలపైనే పడుతుంది
2
743
మూవీ ఎఫెక్ట్: కైంచీ ధామ్‌కు పోటెత్తిన భక్తులు 'హనుమాన్ అంశ్' సినిమా విజయంతో ఉత్తరాఖండ్‌లోని కైంచీ ధామ్‌కు భక్తులు భారీగా పోటెత్తడంతో తొక్కిసలాట వాతావరణం ఏర్పడింది. దీనిపై స్పందించిన డైరెక్టర్ విశాల్.. ప్రయాణానికి ముందే అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలని, వీలైతే బాబా స్వగ్రామం లేదా వ్రిందావన్‌ను సందర్శించాలని భక్తులకు సూచించారు.
4
1,752
శివలింగం ముందు నాగుపాములు! నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి గేటు వద్ద వెలసిన విశ్వనాథ స్వామి ఆలయంలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. తెల్లవారుజామున మూడు నాగుపాములు గర్భగుడిలోకి వచ్చి శివలింగం ఎదురుగా పడగవిప్పి నిల్చున్నాయి. కాసేపు అక్కడే ఉన్న ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
28
1,434
'రణబాలి' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు విజయ్ దేవరకొండ తన పెళ్లి ప్లాన్స్ గురించి సరదాగా పంచుకున్నారు. తాను సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకొని పెళ్లి చేసుకుందామనుకున్నాను. అయితే ఈ ఐడియా విన్న తన తల్లి కోపంతో రెండు కొట్టి, పెద్ద కొడుకువి ఇలా పెళ్లి చేసుకుంటావా? అని పది రోజులు ఏడ్చిందని తెలిపారు. అమ్మ కోసం, చివరికి కింగ్‌లా బంగారం వేసుకొని పెళ్లి చేసుకున్నానని ఆయన వెల్లడించారు.
1
17
7,538
మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు పక్కన ఉన్న రెండు ఫర్నీచర్ షాపుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే పక్క షాపులకూ మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
2
10
1,248
ప్రభుత్వమే జారీ చేసిన ఆధార్‌ కార్డు ఓటుకు ఎందుకు ప్రామాణికం కాదు: ప్రకాశ్‌రాజ్‌ పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలకు ముందు లక్షల ఓట్లు తీసివేసి ఎన్నికలు అయిపోయాక దరఖాస్తు చేసుకోవాలంటున్నారు.
6
933
మెట్రోలో తెలంగాణ మంత్రుల ప్రయాణం ఆర్టీసీ, మెట్రో రైలు ఉమ్మడి డేపాస్‌ ప్రారంభోత్సవంలో భాగంగా శనివారం పలువురు మంత్రులు మెట్రోలో ప్రత్యేక ప్రయాణం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు బేగంపేట నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు మెట్రోలో ప్రయాణించారు. జూబ్లీ చెక్‌పోస్టు నుంచి మంత్రులు సచివాలయానికి ఆర్టీసీ బస్సులో వెళ్లనున్నారు. నిన్న ఆర్టీసీ, మెట్రో రైలు ఉమ్మడి పాస్‌ను ఆవిష్కరించిన మంత్రులు రూ.400 డేపాస్‌తో ఒకరోజంతా ఆర్టీసీ, మెట్రోలో ప్రయాణించవచ్చని తెలియజేశారు.
697
అదుపు తప్పిన బస్సు.. నలుగురు మృతి వికారాబాద్‌లోని అనంతగిరి ఘాట్‌రోడ్డులో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 15 మందికి పైగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అనంతగిరి నుంచి తాండూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
9
938
హీరోయిన్ రచితా రామ్‌ బుగ్గలు గిల్లిన ఫ్యాన్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అభిమానులను కలిసిన కన్నడ నటి రచితా రామ్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. సెల్ఫీ దిగిన యువకుడు ఆమె బుగ్గ గిల్లడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రచితా రామ్‌ ఇటీవల రజినీకాంత్ ‘కూలీ’ చిత్రంలో నటించారు.
18
2,966
సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ రోడ్డులో యువకులు బైక్‌పై వెకిలిచేష్టలకు పాల్పడ్డారు. ఓ యువకుడిని పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చోబెట్టి మరొకరు బైక్ డ్రైవ్ చేస్తూ ప్రమాదకరంగా విన్యాసాలు చేశారు. నిత్యం ఇలాగే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్న వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ట్రాఫిక్ పోలీసులను కోరుతున్నారు.
2
3
1,438
ఇక నుండి ఆంధ్రా ముద్దు బిడ్డ అనంత్ అంబానీ: సీఎం చంద్ర‌బాబు
4
699
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ లంగర్ హౌస్‌లోని బాపూ ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించి, సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు.
2
673
కండక్టర్‌గా సీఎం విజయ్‌.. సర్‌ప్రైజ్‌ చేసిన అమ్మాయిలు! తమిళనాడు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసులకూ విస్తరించింది. ఈ సందర్భంగా చెన్నైలోని ఓ బస్సులో సీఎం విజయ్ కండక్టర్‌లా టికెట్లు అందిస్తూ ప్రయాణికులతో ముచ్చటించారు. కళాశాల విద్యార్థులు కొందరు ఆయనకు చాక్లెట్లు ఇవ్వగా.. ఆయన వాటిని జేబులో దాచుకున్నారు. ఉచిత బస్సు ప్రయణం వల్ల రోజుకు సుమారు 84 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది.
4
19
1,407