ఆనంద ఉత్సాహాలతో దీపావళి పండుగ జరుపుకోవాలని జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ మను చౌదరి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల జీవితాల్లో ఈ దీపావళి పండుగ వెలుగులతో నిండాలని టపాసులు కాల్చుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా పండుగను జరుపుకోవాలని కోరారు.
1
79
ఈ నెల 30న ఘట్కేసర్ మండలం పోచారంలోని ఇన్ఫోసిస్ నూతన భవన ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మను చౌదరి.
1
2
64
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) లో భాగంగా ఇంటింటికి వెళ్లి ధృవపత్రాలను స్వీకరించి వెంటనే ఆన్ లైన్ అప్ లోడింగ్ చేయాలని, అందులో ఏలాంటి తప్పులు జరుగకుండా పటిష్టంగా, వేగవంతంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అదేశించారు.
107
Special Intensive Revision (SIR) of Electoral Rolls – Enumeration Form Verification Process- English
Special Intensive Revision (SIR) of Electoral Rolls – Enumeration Form Verification Process - Telugu
2
184
ఉపాధ్యాయులు పుస్తకంలోని పాఠాలు చెప్పడమే కాకుండా, విద్యార్థుల ఆలోచన సరళిని సరైన మార్గంలో ఉండేలా, విద్యార్థులను నైతికంగా, బాధ్యతయుతంగా, సామాజిక విలువలను అర్థం చేసుకునేలా తీర్చిదిద్దాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఉపాధ్యాయులకు బోధించారు.
శుక్రవారం కూకట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవితో కలిసి జిల్లా కలెక్టర్ హాజరైనారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం చాలా మంచి విషయమన్నారు. మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయులు కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవ్వాలని, విద్యారంగంలో వస్తున్న సాంకేతికతను మీరు నేర్చుకొని, పిల్లలకు కూడా నేర్పించాలన్నారు.దేశ పౌరులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉంటుందన్నారు. ఈరోజు హిందీ పండితులకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు కాబట్టి మీ విద్యార్థులు ఎంతమంది హిందీలో మాట్లాడగలుగుతారో గమనించి వారిలో భాష పరిజ్ఞానం పెంచేలా చొరవ చూపాలన్నారు. విద్యార్థులు తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరిచే సామర్థ్యాన్ని పెంపొందించాలని వారిలోని బిడియాన్ని, భయాన్ని తొలగించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ఒక అంశం గురించి స్టేజ్ పైన మాట్లాడేవిధంగా పిల్లల ఆలోచనలు ఉండేలా వారికి తెలియజేలన్నారు. స్వచ్ఛందంగా ముందుకురాని విద్యార్థులను ప్రొత్సహిస్తూ వారికి అవకాశం కల్పించాలన్నారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంచుతూ వారిలోని ఆలోచనలను అందరి ముందు వ్యక్తపరిచే విధంగా తయారు చేయాలన్నారు. మీరు విద్యార్థులలో తెలుసుకోవాలనే, నేర్చుకోవాలనే జిజ్ఞాసను, ఉత్సుకతను ప్రేరేపించగలిగితే ఉపాధ్యాయుడిగా మీ పని పరిపూర్ణంగా చేసారని భావిస్తానన్నారు. ఇంతేకాకుండా మీ మీ పాఠశాలలో మౌళిక సదుపాయాలు ఏవైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా నా దృష్టికి గాని, డిఈఓ దృష్టికి గాని తీసుకువస్తే ఖచ్చితంగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అంతే కాకుండా విద్యార్థుల నైపుణ్యతను మెరుగుపరిచేందుకు వొకాబులరి, లర్నింగ్ సాప్ట్ వేర్ వంటివి అవసరమైతే తప్పకుండా అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ఎంఆర్ఓ ఆశోక్, ప్రధానోపాధ్యాయుడు రవీందర్ రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
121
గురువారం అల్వాల్ మండలంలోని కౌకూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్థులతో కలిసి కలెక్టర్ అల్పాహారం చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు తమ దినచర్యలో భాగంగా న్యూస్ పేపర్ చదవాలని, అదొక అలవాటుగా చేసుకోవాలని బోధించారు. విద్యార్థులు స్టేజ్ ఫియర్ లేకుండా మీకొచ్చిన భాషలోనే స్టేజ్ పై మాట్లాడాలని తద్వారా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. పాఠశాలలో మొత్తం ఎంత మంది విద్యార్థులు ఉన్నారని, సౌకర్యాలు సరిగా ఉన్నాయా అని హెడ్ మాస్టర్ మురళీ కృష్ణ మూర్తిని కలెక్టర్ అడుగగా, అదనపు తరగతి గదులు అవసరమని కలెక్టర్ కు తెలిపారు. అవసరమైన మౌళిక వసతులైన టాయిలెట్లు, తరగతి గదులు వంటి వాటి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలోని సైన్స్ ల్యాబ్, లైబ్రరీ తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు కోరిన స్పోర్ట్స్ సమాగ్రిని అందిస్తానని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఈఓ రేణుకా దేవి, అల్వాల్ ఎంఆర్ఓ రాములు, హెడ్ మాస్టర్, టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
109
గురువారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా ప్రత్యేక అధికారి వికాస్ రాజ్ ఐఎఎస్ , (ట్రాన్స్పోర్ట్, రోడ్స్ & బిల్డింగ్స్: స్పెషల్ చీఫ్ సెక్రటరీ,) జిల్లా కలెక్టర్ మను చౌదరి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోటిరెడ్డి లతో కలిసి సమీక్షించారు, నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ మానవీయ కోణంలో పరిష్కరిస్తూ అర్హులైన వారందరికి రాష్ట్ర ప్రభుత్వం అందించే అభివృద్ది, సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి వికాస్ రాజ్ ఐఎఎస్ అన్నారు.
3
133
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 2002 ఓటరు జాబితాను 2025 ఓటరు జాబితాకు అనుగుణంగా సవరించే మ్యాపింగ్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా 90 శాతం పూర్తి చేయాలని ఎఆర్ఓలు, ఈఆర్ఓలకు సూచించారు.
2
140
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్, స్కూల్స్ లోని 14 to 15 సంవత్సరాల వయసు గల బాలికలకు అందరికి HPV వ్యాక్సినేషన్ ను అందించేలా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు.
168
సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
158
జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల నిర్వహాణను పరిశీలించిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు మను చౌదరి.
115
జాతీయ మహిళా కమీషన్ కు దేశ నలుమూలల నుండి ఎన్నో ఫిర్యాదులు అందుతాయని, వారందరు ఢిల్లీ వరకు రాలేరని, ఈ మహిళ జన్ సున్వాయ్ కార్యక్రమం ద్వారా మహిళల సమస్యలను పరిష్కరించడానికి జాతీయ మహిళా కమీషన్ మీ చెంతకే వచ్చిందని జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ విజయ రహత్కర్ అన్నారు.
1
1
136
మున్సిపాలిటిలు, మున్సిపల్ కార్పొరేషన్ ల సాధారణ ఎన్నికల 2026లో భాగంగా ఓటింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని అత్యంత సమస్యాత్మక మరియు సున్నితమైన పోలింగ్ కేంద
2
162
మున్సిపాలిటిలు, మున్సిపల్ కార్పొరేషన్ ల సాధారణ ఎన్నికల 2026లో భాగంగా జిల్లాలోని మూడుచింతలపల్లి, ఆలియాబాదు, ఎల్లంపేట్ మున్సిపాలిటీ లలోని పోలింగ్ బూతులలో జరుగుతున్న పోలీంగ్ ప్రక్రియను ను సాధారణ ఎన్నికల పరిశీలకులు నిర్మల కాంతి వెస్లీ తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
130
మున్సిపాలిటిలు, మున్సిపల్ కార్పొరేషన్ ల సాధారణ ఎన్నికల 2026లో భాగంగా మూడుచింతలపల్లి, ఆలియాబాదు, ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఎన్నికల సందర్బంగా పోలింగ్ నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని,విధులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా సాధారణ పరిశీలకులు కొర్ర లక్ష్మి తెలిపారు.
1
119
మున్సిపాలిటిలు, మున్సిపల్ కార్పొరేషన్ ల సాధారణ ఎన్నికల 2026లో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, ఆలియాబాదు, ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఎన్నికల సందర్బంగా ఎన్నికల విధులు నిర్వహించుటకు గాను పిఒ, ఎపిఓలను రాండమైజేషన్ ద్వారా పారదర్శకంగా ఎంపిక జరిగింది.
103
తెలంగాణ వ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలకు సాధారణ ఎన్నికలు-2026 లో భాగంగా ప్రిసైడింగ్ అధికారి , అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల నిర్వహాణ విధులలో ఏవేని సందేహాలున్న హ్యాండ్ బుక్ ద్వారా, జోనల్ ఆఫీసర్లతో నివృత్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు.
97
































































