#ఖమ్మం నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో డిసెంబర్ 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఖేలో ఇండియా జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు.
సోమవారం #ఖమ్మంకలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి సంబంధిత అధికారులతో ఖేలో ఇండియా పోటీల నిర్వహణపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఖేలో ఇండియా జాతీయస్థాయి ఆర్చరీ పోటీల నిర్వహణపై ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాతీయస్థాయి పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు, సహాయక సిబ్బంది, సాంకేతిక నిపుణులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.
పోటీ కోసం మొత్తం 134 మంది జిల్లాకు వస్తున్నారని ఇందులో 64 మంది క్రీడాకారులు, 20 మంది సహాయక సిబ్బంది, 20 మంది సాంకేతిక సిబ్బంది, 24 మంది క్రీడా వాలంటీర్లు, ఇతరులు ఉంటారని తెలిపారు. వీరికి అవసరమైన వసతి సదుపాయాల కోసం చెక్‌లిస్ట్ ప్రకారం మొత్తం 74 గదులను ముందస్తుగా బుక్ చేయాలని ఆదేశించారు.
క్రీడాకారులు, సిబ్బంది రాకపోకలకు ఇబ్బందులు లేకుండా 22 వాహనాలను ఏర్పాటు చేయాలని, వాహనాలు, హోటళ్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.
స్టేడియంలో, ప్రతి హోటల్లో త్రాగునీరు, పారిశుధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి హోటల్‌కు ఒక లైజన్ అధికారిని నియమించి, సంబంధిత హోటల్ యాజమాన్యంతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు.
పోటీలు జరిగే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియానికి చేరుకునే రహదారులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, ఇతర మౌళిక సదుపాయాల పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. క్రీడా శాఖ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పోటీల నిర్వహణకు అవసరమైన అన్ని పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
పోటీల సమయంలో క్రీడాకారులకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, సమీప ఆసుపత్రుల్లో అవసరమైన పడకలను ముందుగానే రిజర్వ్ చేసి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది, అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
సోమవారం #ఖమ్మంకలెక్టరెట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు, వినతులను #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ స్వయంగా స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను శాఖల వారిగా ఎప్పటికప్పుడు త్వరితగతిన పరిశీలన చేస్తూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
మధిర నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి పాల్గొన్నారు.
ఎర్రుపాలెం మండలం బంజారలో రెడ్డి బోయిన నాగమణి-కృష్ణయ్య, పెద్ద గోపవరంలో మోదుగు సీతారాజ్యం-గోపి, మధిర మండలం దెందుకూరులో ముప్పసాని కృష్ణవేణి-రాంబాబు దంపతుల ఇళ్లల్లో, మల్లారంలో యంద్రాతి అచ్చారావు, బోనకల్ మండలం రాయణపేటలో పర్సగానీ గోపి, చింతకాని మండలం పొద్దుటూరులో రెళ్ళ రాసి-తిరుపతి రావు, ముదిగొండ మండలం వనం వారి కిష్టాపురంలో పి.గంగా భవాని-శ్రీహరి, ముదిగొండలో కె.శ్రీలత-రాజేష్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో స్థానిక ప్రజలతో కలిసి ఉప ముఖ్యమంత్రి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి ఆనందంగా పండుగ ఉప ముఖ్యమంత్రి జరుపుకున్నారు. ప్రజాప్రభుత్వంలో సొంతింటి కల నెరవేరడంతో ఆనందంగా దీపావళి జరుపుకుంటున్నామని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పర్యటనలో ఆయా గ్రామాల ప్రజలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉప ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో పేద ప్రజలకు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. నేడు గ్రామ నాయకుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో పాల్గొని పండుగను లబ్ధిదారులతో కలిసి ఘనంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని, తెలంగాణ ప్రజలందరూ ఆనందంగా దీపావళి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో పుట్టడం ఒక వరమని, పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్లు నిర్మించి అందిస్తోందని అన్నారు.
రాష్ట్రంలో మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. హైదరాబాద్ కోర్ ప్రాంతంలో మరో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు.
ఇప్పటివరకు మంజూరైన ఇళ్లలో 2.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 1.75 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోందని తెలిపారు. లబ్ధిదారులు ఎంత వేగంగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తే అంతే వేగంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని పేర్కొన్నారు. లబ్ధిదారులు నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకొని సొంతింటిలో గృహప్రవేశాలు చేసుకోవాలని సూచించారు.
ఇంటి నిర్మాణం కోసం ప్రతి లబ్ధిదారునికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని పారదర్శకంగా నేరుగా అందిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వం పేదలు, మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత, అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. కులం, మతం, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందిస్తున్నామని తెలిపారు.
పేదలకు మరింత భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రం లోని ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే దిశగా ఈ పథకం ఉపయోగ పడుతుందని అన్నారు.
రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా పథకం క్రింద 71 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల నిధులు అందిస్తున్నామని, ప్రజలకు నిత్యావసర వస్తువులను ఉచితంగా అందించడంలో భాగంగా బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం రూ.90 వరకు ఉన్నప్పటికీ, రేషన్ దుకాణాల ద్వారా ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం క్రింద వైద్య చికిత్స పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, అంతర్జాతీయ ప్రమాణాలతో 105 యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఇంటా ఆనందం, వెలుగులు నిండాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
✨ ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు! ✨🪔
పేదల సొంతింటి కల సాకారమైన వేళ, ఈ దీపావళి పండుగ శుభవేళ.. ఇందిరమ్మ ఇండ్లలో, లబ్ధిదారుల సొంతింటి సంతోషంలో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి నేను సైతం పాలుపంచుకున్నాను.
లబ్దిదారులు వారి సొంతింట్లో ఈసారి దీపావళి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కుటుంబంతో కలిసి వారి ఇందిరమ్మ ఇంటి ముందు దీపాలు వెలిగించి, ఆనందాన్ని మీరు కూడా ఇందిరమ్మ ఇండ్లు యాప్‌లో మీ కుటుంబంతో కలిసి ఫోటో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయండి!
@tghd.official @Indirammaindlu @telanganacmo
#Indirammaindlu #MaaIndirammaIntloDeepavali
Happy Diwali!
ఎస్ఐఆర్ ఓటరు జాబితాలో పేరు నమోదు కాని అర్హులకు మరో అవకాశం – నవంబర్ 21 వరకు ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు గడువు.....జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ఏఎస్డీ జాబితాలో ఉన్న అర్హులైన ఓటర్లు మరోసారి ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించుకోవచ్చు
పోలింగ్ కేంద్రాల నోటీసు బోర్డులపై ఏఎస్డీ జాబితాల ప్రదర్శన
బీఎల్ఓలు, బూత్ స్థాయి ఏజెంట్ల సమన్వయంతో అర్హులైన ఓటర్లకు ఫారాల పంపిణీ, ధృవీకరణ చేపట్టాలి.
ఓటు హక్కుకు అర్హత ఉన్న ఏ ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు లేకుండా ఉండకూడదు
------------------------------
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో పేరు నమోదు కాని అర్హులైన వారికి భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని, నవంబర్ 21వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించవచ్చని #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు.
గతంలో ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కుకు అర్హత ఉన్న ఏ ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు లేకుండా ఉండకూడదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయాలని స్పష్టం చేశారు.
#ఖమ్మంజిల్లా లో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు మొత్తం 12,43,781 మంది ఓటర్లు ఉండగా, పరిశీలనలో గైర్హాజరైన (Absent), చిరునామా మారిన (Shifted), మరణించిన (Dead), నకిలీ ఓటర్లు (Duplicate)కు సంబంధించి మొత్తం 1,57,854 మందితో కూడిన ఏఎస్డీ జాబితాను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎస్ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితాలో 10,85,927 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
భారత ఎన్నికల సంఘం తాజా సూచనల మేరకు ఏఎస్డీ జాబితాలో ఉన్న వారిలో అర్హులైన ఓటర్లు ఎవరైనా ఉంటే, వారు మరోసారి ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. నవంబర్ 21వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని, గతంలో ఫారం సమర్పించని అర్హులైన ఓటర్లు, ఏఎస్డీ జాబితాలో పొరపాటున చేరిన అర్హులైన వ్యక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
ఏఎస్డీ (Absent, Shifted, Death, Duplicate) జాబితాలో పేరు ఉన్నప్పటికీ ఓటరు అదే నివాసంలో కొనసాగుతున్నట్లయితే, వారి ఎన్యుమరేషన్ ఫారంతో పాటు Annexure-B సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తిచేసిన ఫారాన్ని సంబంధిత ఓటరు లేదా వారి కుటుంబ సభ్యులు తిరిగి సమర్పించవచ్చని పేర్కొన్నారు.
ఏఎస్డీ (Absent, Shifted, Death, Duplicate) జాబితాలో పేరు ఉండి, రాష్ట్ర పరిధిలోనే మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్న ఓటర్లు ప్రత్యేకంగా Form-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాంటి వారు తమ ఎన్యుమరేషన్ ఫారంతో పాటు Annexure-Cను పూర్తి చేసి, కొత్త నివాసానికి సంబంధించిన చిరునామా ధృవీకరణ పత్రాన్ని (Address Proof) కొత్త నివాస ప్రాంత పరిధిలోని సహాయ ఎన్నికల నమోదు అధికారి (AERO) లేదా ఎన్నికల నమోదు అధికారి (ERO)కి సమర్పించాలని సూచించారు.
అదేవిధంగా, ఏఎస్డీ జాబితాలో పేరు ఉండి, ఇప్పటికే Form-6 ద్వారా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఎన్యుమరేషన్ ఫారం నింపి సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఈ మార్గదర్శకాల ప్రకారం బీఎల్ఓలు, బీఎల్ఏలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టి, అర్హులైన ప్రతి ఓటరుకు అవకాశం కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఓటు హక్కుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
పర్యావరణహితంగా, సురక్షితంగా ప్రశాంత వాతావరణంలో దీపావళి జరుపుకోవాలి.....జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
గ్రీన్ క్రాకర్స్ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలి
బాణాసంచా కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ భద్రతా జాగ్రత్తలు పాటించాలి
పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
-----------------------------
దీపావళి పండుగను పర్యావరణహితంగా, సురక్షితంగా, సంతోషంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సూచించారు. పండుగ సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, శబ్ద, వాయు కాలుష్యాన్ని తగ్గించే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
బాణాసంచా కాల్చే సమయంలో ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. టపాసులు కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు ధరించాలని, నైలాన్, పాలిస్టర్ వంటి సింథటిక్ దుస్తులు ధరించకూడదని సూచించారు. భవనాలు, విద్యుత్ తీగలకు దూరంగా ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే బాణాసంచా కాల్చాలని, టపాసులు కాల్చే ప్రదేశంలో ముందస్తుగా ఒక బకెట్ నీరు, ఇసుక, ప్రథమ చికిత్స సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
పిల్లలు బాణాసంచా కాల్చేటప్పుడు పెద్దలు తప్పనిసరిగా వారి పక్కనే ఉండి పర్యవేక్షించాలని, బాణాసంచాను జేబుల్లో పెట్టుకోవడం, చేతుల్లో పట్టుకుని తిరగడం చేయకూడదని కలెక్టర్ సూచించారు. వెలగని టపాసులను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయకూడదని, వాటిని నీటితో తడిపి సురక్షితంగా తొలగించాలని పేర్కొన్నారు. ఇళ్లలో, గ్యారేజీల్లో, బాల్కనీల్లో బాణాసంచా కాల్చకూడదని తెలిపారు.
ప్రమిదలు, దీపాలను స్థిరమైన ప్రదేశాల్లో, కర్టెన్లు, ప్లాస్టిక్ వస్తువులు, ఇతర మండే వస్తువులకు దూరంగా ఉంచాలని, నిద్రించే ముందు లేదా బయటకు వెళ్లే ముందు వెలుగుతున్న దీపాలను ఆర్పివేయాలని సూచించారు. పెంపుడు జంతువులు, వీధి జంతువుల సమీపంలో పెద్ద శబ్దాలు వచ్చే బాణాసంచా కాల్చకూడదని తెలిపారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని, ప్రమాదాలకు తావులేకుండా కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితమైన, ఆనందకరమైన దీపావళి పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
జీఓ 59 క్రింద భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల విచారణను వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశించారు. అర్హులైన దరఖాస్తుదారులు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం 500 గజాల లోపు ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వం అందించిన జాబితా ప్రకారం ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న జీఓ 59 దరఖాస్తుల విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
కొణిజెర్ల మండలంలో 84, సింగరేణి 3, కామేపల్లి 8, వైరాలో 193, బోనకల్ 2, చింతకాని 151, ముదిగొండ 82, నేలకొండపల్లి 7, మధిర 206, ఎర్రుపాలెం 12, కల్లూరులో 213, పెనుబల్లి 216, తల్లాడ 39, తిరుమలాయపాలెంలో 79, వేంసూర్ 266, సత్తుపల్లిలో 1662, ఖమ్మం అర్బన్ 1255, ఖమ్మం రూరల్ 270, కూసుమంచి 445, రఘునాథపాలెంలో 212 దరఖాస్తులు వచ్చాయని, ఈ దరఖాస్తుల విచారణను వేగవంతం చేసేందుకు మొత్తం 12 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాల్లో 17 మంది జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి, వారికి అవసరమైన శిక్షణ అందించిన అనంతరం దరఖాస్తుల విచారణ 30 రోజుల్లోగా చేపట్టాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం సంబంధిత జిల్లా అధికారులు వారికి కేటాయించిన దరఖాస్తులను పరిశీలిస్తూ విచారణ ప్రక్రియను కొనసాగిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తుదారులు విచారణ సమయంలో సంబంధిత అధికారులకు అవసరమైన సమాచారం, పత్రాలు అందించి పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు.
ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూములను క్రమబద్ధీకరించుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ కోరారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
#ఖమ్మంజిల్లా నేలకొండపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రాచీన మానవ నివాసానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి బైరాగులగుట్ట, మొర్లకొండ వాగు పరిసరాల్లో పురావస్తు అన్వేషణ జరుగుతున్న ప్రాంతాన్ని శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నేలకొండపల్లి సమీపంలోని బైరాగులగుట్ట, మొర్లకొండ వాగు పరిసరాల్లో తెలంగాణ వారసత్వ శాఖ పురావస్తు అన్వేషణ బృందం నిర్వహించిన క్షేత్రస్థాయి ఉపరితల సర్వేలో ప్రాచీన నివాస స్థల ఆనవాళ్లు, ప్రాచీన ఇటుక నిర్మాణాలు లభ్యమయ్యాయని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ వారసత్వ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ (టెక్నికల్) డాక్టర్ పి. నాగరాజు నాయకత్వంలో అసిస్టెంట్ డైరెక్టర్లు బి. మల్లు నాయక్, బి. గంగాదేవి, సైట్ సూపర్వైజర్ అశ్విన్ కుమార్, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తిలతో కూడిన అధికారుల బృందం నవంబర్ 5 నుండి 7వ తేదీ వరకు ఈ క్షేత్రస్థాయి అన్వేషణ చేపట్టిందన్నారు. ఈ బృందం బైరాగులగుట్ట, మొర్లకొండ వాగు పరిసర ప్రాంతాల్లో ప్రాచీన నివాస స్థలం విస్తరణ, భౌగోళిక పరిస్థితులు, ఉపరితలంపై కనిపిస్తున్న పురావస్తు అవశేషాలను పరిశీలించిందని తెలిపారు.
క్షేత్రస్థాయి సర్వేలో నాటి ప్రజల దైనందిన జీవన విధానం, కళాత్మక నైపుణ్యం, వస్తు సంస్కృతిని ప్రతిబింబించే పలు విలువైన పురావస్తువులను గుర్తించి సేకరించారని తెలిపారు. వీటిలో ముఖ్యంగా మట్టి పూసలు, బండి చక్రం, రాతి రోకలి, ఎరుపు రంగు మృణ్మయ పాత్రల పెంకులు, నలుపు-ఎరుపు రంగుల పాత్రల పెంకులు, ఎరుపు పూత కలిగిన పాత్రల పెంకులు, నలుపు మెరుగు కలిగిన పాత్రల పెంకులు వంటి పురావస్తు ఆధారాలు లభించాయని కలెక్టర్ అన్నారు. సేకరించిన మృణ్మయ పాత్రల పెంకులపై పుష్పాలంకరణలు, బొటనవేలి ముద్రలు, తాడు ఆకారపు అలంకరణలు, పౌరాణిక ఆకృతులు, ముద్రిత అలంకరణలు గుర్తించారన్నారు.
ఈ అలంకరణలు ఆనాటి ప్రజల పాత్రల తయారీ సాంకేతిక పరిజ్ఞానం, కళాత్మక అభిరుచి, సాంస్కృతిక సంప్రదాయాలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడే ముఖ్యమైన ఆధారాలుగా భావిస్తున్నారన్నారు.
ఈ అన్వేషణలో భాగంగా బైరాగులగుట్ట పరిసరాల్లోని ప్రాచీన నివాస స్థలంలో రెండు ఇటుక నిర్మాణాల అవశేషాలను పురావస్తు బృందం గుర్తించి, వాటిలో కొంత భాగాన్ని వెలికితీసిందన్నారు. ఈ నిర్మాణాల నిర్మాణశైలి, ఇటుకల పరిమాణం, అమరిక, వాటికి సంబంధించిన ఇతర పురావస్తు ఆధారాలపై మరింత శాస్త్రీయ పరిశోధన చేపట్టాల్సిన అవసరం ఉందని బృందం అభిప్రాయపడిందని కలెక్టర్ అన్నారు.
తెలంగాణ వారసత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (టెక్నికల్) డాక్టర్ పి. నాగరాజు జిల్లా కలెక్టర్‌కు అన్వేషణలో గుర్తించిన వివిధ పురావస్తువులు, మృణ్మయ పాత్రల రకాలు, వాటిపై కనిపించే ప్రత్యేక అలంకరణలు, ప్రాచీన ఇటుక నిర్మాణాల వివరాలను సమగ్రంగా వివరించారు. జిల్లా కలెక్టర్ పురావస్తు బృందం గుర్తించిన నిర్మాణాలను, సేకరించిన పురావస్తువులను పరిశీలించి, ఈ ప్రాంతానికి సంబంధించిన పురావస్తు విశేషాలను అడిగి తెలుసుకున్నారు. నేలకొండపల్లి ప్రాంతం తెలంగాణలోని ముఖ్యమైన చారిత్రక, పురావస్తు కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నేపథ్యంలో తాజాగా లభించిన ఈ ఆధారాలు ఈ ప్రాంత ప్రాచీన చరిత్రను, నివాస సంస్కృతిని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి దోహదపడనున్నాయని, శాస్త్రీయ డాక్యుమెంటేషన్ ద్వారా మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని కలెక్టర్ తెలిపారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
#బేతుపల్లి చెరువులో చిక్కుకున్నవారిని కాపాడిన జిల్లా యంత్రాంగం పనితీరును అభినందించిన సీఎస్ సంజయ్ జాజు.
#ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు లో చిక్కుకున్న 19మందిని రాత్రింబవళ్లు శ్రమించి, అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ సురక్షితంగా రక్షించడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు ప్రత్యేకంగా అభినందించారు. అత్యవసర, ఆందోళనకర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్, ఎస్పీ చూపిన చొరవ, నాయకత్వం అందరికీ ఆదర్శమని సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రశంసించారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
ప్రభుత్వం నిర్ధేశించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడువులోగా పూర్తి చేయాలని #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ అధికారులకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ పి శ్రీజ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
త్రాగునీటి సరఫరా, పీఎంశ్రీ పాఠశాలలు, సమగ్ర శిక్షా అభియాన్ నిధుల వినియోగం, ఇందిరమ్మ ఇళ్లు, వీబీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రైవేట్ బోర్‌వెల్స్ ను వినియోగించుకోవడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం, కొత్త బోర్లను ఏర్పాటు చేయడం వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ పనులను నవంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు.
జిల్లా స్థాయిలో డీపీఓ, మిషన్ భగీరథ ఈఈ, పబ్లిక్ హెల్త్ అధికారులు తదితరులతో వారం వారీగా సమీక్ష కమిటీని ఏర్పాటు చేయాలని, మండల స్థాయి కమిటీలను నవంబర్ నెలాఖరులోగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చేతి పంపులు, బోరు పంపులు, బావుల మరమ్మతులను నవంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని, నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి త్రాగునీటికి సంబంధించిన సమస్యలన్నింటిని పరిష్కరించాలన్నారు. మిషన్ భగీరథ వాల్వుల ద్వారా నీటి వృథాను అరికట్టడంతో పాటు అక్రమ నీటి కనెక్షన్లను నివారించాలని సూచించారు.
పీఎం శ్రీ పాఠశాలలకు కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించు కోవాలని సూచించారు. పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు, మరమ్మతులు తదితర మౌళిక వసతుల పనులను ప్రాధాన్యతతో చేపట్టాలన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ 2026–27 సంవత్సరానికి సంబంధించిన నిధులను కూడా పూర్తిగా వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందించాలని, ఈ నిధుల వినియోగంపై ముఖ్యమంత్రి ప్రతి పది రోజులకు ఒకసారి సమీక్షిస్తున్నందున, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటి పురోగతిని సీఎం డ్యాష్‌బోర్డులో నమోదు చేయాలని, నిధుల వినియోగంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. పాఠశాలలను అధికారులు తరచూ సందర్శించి విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యాలు, మధ్యాహ్న భోజనం, అల్పాహారం నాణ్యతను పరిశీలించాలన్నారు.
వీబీజీ రామ్ జీ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మార్చి నెలాఖరు నాటికి నిర్దేశించిన పనిదినాల లక్ష్యాన్ని సాధించేలా చర్యలు చేపట్టాలనీ, గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించి నాణ్యతతో చేపట్టడంతో పాటు కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా #జిల్లాకలెక్టర్ దివాకర సిఎస్ కు వివరిస్తూ* ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారి భూసేకరణకు సంబంధించి 98 శాతం అవార్డులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు. మిగిలిన రూ.3 కోట్ల విలువైన అవార్డులకు సంబంధించి టోకెన్లు జనరేట్ అయ్యాయని, చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.
వీడియో సమావేశం అనంతరం #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ సమీక్షిస్తూ... జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎస్ సూచనల మేరకు ప్రతి అంశంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు
జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం, పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి శాఖకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, పెండింగ్ పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని, ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
District Collector Khammam retweeted
Commendable leadership by Collector Diwakar and SP Rohit in the rescue operation.
My appreciation to the district teams and to NDRF, SDRF and all agencies for their swift, coordinated and selfless work in saving lives. 👏💐💐
District Collector Khammam retweeted
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో గల్లంతైన మత్స్యకారులు, వారిని రక్షించేందుకు వెళ్లి చిక్కుకుపోయిన పలువురు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో పాలుపంచుకున్న ఎన్డీఆర్ఎఫ్ (#NDRF), ఎస్డీఆర్ఎఫ్ (#SDRF), అగ్నిమాపక సిబ్బందికి, అధికారులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న బేతుపల్లి చెరువులో చిక్కుకున్న మత్స్యకారులు, వారిని కాపాడటానికి వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడేందుకు NDRF, ఇతర సహాయక బృందాలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో చేసిన కృషి అభినందనీయమని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సిబ్బంది ప్రదర్శించిన ధైర్యసాహసాలు, అంకితభావం ప్రశంసనీయమని అన్నారు. సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి గారు అభినందించారు.
@Collector_KMM
#Sathupalli #Khammam #BetupalliCheruvu #RescueOperation
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులో చిక్కుకున్న జాలర్లను కాపాడేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ బోట్లు గల్లంతైన ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆరా తీశారు.
ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి సూచించారు.
#SDRF #Sathupalli #Khammam #BetupalliCheruvu #RescueOperation
#ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలం బుధవారం బేతుపల్లి చెరువు వరద ప్రవాహంలో చిక్కుకున్న జాలర్లను కాపాడేందుకు వెళ్లిన ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని ఎన్టీఆర్ఎఫ్ బృందం క్షేమం గా కాపాడింది. ఎనిమిది మంది జాలర్లు చెరువుకు వలలు కట్టేందుకు వెళ్లగా.. వరద ప్రవాహానికి అక్కడే చిక్కుకు పోయారు. స్థానికుల సమాచారంతో రెవెన్యూ, పోలీస్ శాఖ సిబ్బంది సహకారంతో 10 మందితో కూడిన ఎస్టీఆర్ఎఫ్ బృందం, ఒక స్ధానిక గజఈతగాళ్ళు తో కలిసి రంగంలోకి దిగింది. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లో రక్షించే చర్యల్లో భాగంగా ముందుగా బోట్లలో వెళ్లిన సిబ్బంది ముగ్గురు జాలర్ల లను క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. మరో ఐదుగురి కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లలో చీకట్లోనే జాలర్లు చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వరద ఉదృతి పెరిగి బోట్లూ నీటిలోనే బోల్తాపడ్డాయి. దీంతో పది మంది ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, స్ధానిక వ్యక్తి వరద ప్రవాహానికి చెల్లా చెదురయ్యారు.
ప్రభుత్వం, మంత్రుల ఆదేశంతో వరద ప్రవాహంలో చిక్కి చెల్లాచెదురైన ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందిని రక్షించేందుకు హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. ముందుగా మిగిలిన ఐదుగురు జాలర్లలను క్షేమంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. చిమ్మని చీకటిలో అర్థరాత్రి మూడున్నర గంటల ప్రాంతంలో
ఒక ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందిని ఒడ్డుకు చేర్చారు. అనంతరం గురువారం తెల్లవారు జామున మిగతా వారిని గాలించి ఒడ్డుకు తీసుకువచ్చారు.
వరదలో చిక్కుకున్న 19 మంచి సేఫ్ గా బయట పడినట్టు అయ్యింది.
#జిల్లాకలెక్టర్ దివాకర్ టీఎస్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పర్యవేక్షణలో నిరంతరం సహాయక చర్యలు కొనసాగాయి. ప్రభుత్వం తరుపున పలు ఆదేశాలు ఇస్తూ దిశానిర్దేశం చేస్తూ 19 మంది ప్రాణాలు కాపాడిన ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికార యంత్రాంగం తో పాటు #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ రోహిత్ రాజ్ లను మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
#ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు వరద ఉధృతిలో చిక్కుకున్న 10 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, 9 మంది మత్స్యకారులను సురక్షితంగా రక్షించిన సహాయక బృందాలు.
#ఖమ్మంజిల్లాకలెక్టర్ దివాకర్ టీఎస్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు క్షేత్రస్థాయిలో సమయస్ఫూర్తితో కూడిన పర్యవేక్షణ, వివిధ శాఖల సమన్వయంతో విజయవంతమైన సహాయక చర్యలు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
#సత్తుపల్లి మండలం లోని బేతుపల్లి చెరువులో సహాయక చర్యలు.. మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరిక
గల్లంతైన SDRF బృందం కోసం కోసం NDRF బృందం గాలింపు చర్యలు.
#ఖమ్మంజిల్లా కలెక్టర్దివాకర్ క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షణ
ప్రభుత్వం ఆదేశాలమేరకు గల్లంతైన SDRF బృందం ఆచూకీ కోసం అర్ధరాత్రి చీకటిలో కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti































































