స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ, తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కావడం జరిగింది.
ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం, స్వచ్ఛ శౌచాలయం గౌరవ ప్రదమైన భవిష్యత్ పై రూపొందించిన పోస్టర్లను, బ్యానర్ ను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.
ఎఫ్ఆర్ఎస్ (FRS), ఎఫ్ఎల్ఎన్ (FLN), ఆన్లైన్ తరగతులు, అభివృద్ధి పనులు, తదితర అంశాలపై విద్యా శాఖ అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమావేశం నిర్వహించడం జరిగింది.
వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (VTADA) ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పురోగతి, నిత్యాన్నదాన సత్రం, బద్ది పోచమ్మ ఆలయం, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.
వేములవాడ మండలం చీర్లవంచ ఆర్&ఆర్ కాలనీ, సిరిసిల్ల పట్టణంలోని 23వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి, వివరాలు నమోదు చేయడంపై పలు సూచనలు చేసి, దరఖాస్తుల స్వీకరణపై అవగాహన కల్పించాలని ఆదేశించడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలోని 4 వ వార్డులో ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారితో కలిసి ప్రారంభించి, పథకం ఉద్దేశ్యాన్ని అందరికీ వివరించి, పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది
వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమావేశం నిర్వహించడం జరిగింది.
జాతీయ స్థాయి ఏవియేషన్ ఒలింపియాడ్‌కు దేశవ్యాప్తంగా 2,09,280 మంది విద్యార్థులు పాల్గొనగా, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి కేజీబీవీ లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అర్హత సాధించారు. విద్యార్థుల ప్రతిభను ప్రశంసించి, అభినందించడం జరిగింది.
భూముల రీ సర్వే ప్రక్రియ పురోగతి, ఎస్ఐఆర్ (SIR), ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, తదితర అంశాలపై మండలాల అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.
సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ఓపీ రిజిస్టర్, ఫార్మసీ, వ్యాక్సిన్లు, తదితర వివరాలను పరిశీలించి, అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 8వ ఎడిషన్ ఖేలో ఇండియా నేషనల్ యూత్ గేమ్స్ - 2026 లోగో, మస్కట్ గోడ పత్రికలను సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించి, సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటో దిగడం జరిగింది.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, దరఖాస్తుల సేకరణ, ప్రజలకు అవగాహన కల్పించడం, తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కావడం జరిగింది.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ, తదితర అంశాలపై జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల పంచాయతీ అధికారులు, మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు ఇతర అధికారులు, సిబ్బందికి IDOC లో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
బోయినిపల్లి మండలం కొత్తపేట గ్రామంలోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన చేయూత పెన్షన్ అర్హత మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారితో కలిసి పాల్గొని, మండలంలోని అన్ని గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేయడం జరిగింది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై రూపొందించిన పోస్టర్లను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆవిష్కరించడం జరిగింది.
జిల్లాలో ఆయిల్ పామ్, కూరగాయలు, తదితర ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణంపై ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమావేశం నిర్వహించడం జరిగింది.
వీబీజీరామ్ జీ, జల్ సంచాయ్ జన్ భగీదరి, తెలంగాణ జలసిరి పనులు, తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది.
నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO) నిర్దేశించిన హెచ్ఐవీ నియంత్రణ 95-95-95 లక్ష్యాల సాధనలో జిల్లా మెరుగైన ప్రగతి సాధించి “సురక్షిత్” జిల్లాగా గుర్తింపు పొందినందుకు గానూ వైద్యారోగ్య శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసారు.
ముస్తాబాద్ మండలం చీకోడు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్ ను ప్రారంభించి, కంప్యూటర్ గది, కిచెన్ ను పరిశీలించి, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి పలు సూచనలు చేయడం జరిగింది.



















































