Pen Andhra (@PenAndhra) header
Pen Andhra (@PenAndhra) profile picture
Joined September 2026
Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)Photo by Pen Andhra (@PenAndhra)
పులివెందులపై టీడీపీ దుర్మార్గపు ప్లాన్‌ - ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు పక్కా పథకం - చుట్టుపక్కల నుంచి పులివెందులకు ఇప్పటికే 500 మంది టీడీపీ గూండాలు. కుట్ర పథకాన్ని సిద్ధం చేసినట్టుగా స‌మాచారం. - టీడీపీ దాడులకు అవకాశం కల్పించేలా.. శాంతిభద్రతల బాధ్యత నుంచి తప్పించేందుకు తక్కువ మంది పోలీసులకే పరిమితం. - పోలింగ్‌ రోజు ఉదయం గంటలోపే వారి ద్వారా దాడులకు ప్లాన్‌ - దాడి అనంతరం ఆ పని వైయస్సార్‌సీపీ కార్యకర్తలే చేయించారని వెనువెంటనే ప్రచారం. - ఆ మేరకు ఎల్లోమీడియాను ఇప్పటికే అప్రమత్తంచేసిన టీడీపీ ముఠా - టీడీపీ గూండాల దాడిని సాకుగా చూపి వైయస్సార్‌సీపీ కార్యకర్తల వరుస అరెస్టులకు రెడీ చేసేలా ఆదేశాలు - వైయ‌స్సార్‌సీపీకి చెందిన నాయకులను, క్రియాశీలక కార్యకర్తలను అరెస్టు చేయాలని వ్యూహం - ఆ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల నుంచి టీడీపీకి చెందిన కార్యకర్తలను తరలించి వారి ద్వారా పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణ, రిగ్గింగ్‌, సైక్లింగ్‌ చేయించే ప్రయత్నం చేస్తున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.
19
1
90
2,692
రాత్రికి రాత్రే విశాఖ‌లో రూ.7 కోట్ల లిక్విడ్ క్యాష్‌ - లిక్క‌ర్ సిండికేట్ డాన్స్ ద్వారా వ‌సూళ్లు - రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేష‌న్ అయిన విశాఖ‌ను త‌మ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు టీడీపీ భారీ స్కెచ్ వేసింది. - ఎన్నికల్లో డబ్బులతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు ఏకంగా రూ. 7 కోట్ల భారీ లిక్క‌ర్ సిండికేట్‌ లిక్విడ్ క్యాష్‌ను సిద్ధం చేస్తోంది. - విశాఖ మేయర్ పీఠం కోసం నగరంలోని వైన్ షాపులు, బార్ల యజమానుల నుంచి రూ. 7 కోట్ల నగదును ఒకే రాత్రిలో వసూలు చేయాలని టీడీపీ పెద్ద వ్యూహమే పన్నింది. - అధిష్టానం ఆదేశాల మేరకు విశాఖ నగరంలోని 150 వైన్ షాపుల నుంచి ఒక్కో షాపునకు రూ. 4 లక్షలు, 110 బార్ల నుంచి ఒక్కో బార్‌కు రూ. 1 లక్ష చొప్పున వసూలు చేసేందుకు టీడీపీ ప్రత్యేక టీమ్స్ ను రంగంలోకి దింపింది. - ఈ అక్రమ వసూళ్ల నెట్ వర్క్ ను సిండికేట్ డాన్లు పుష్కర్ గణేష్, వేణు, సురేష్, రవీంద్రలు దగ్గరుండి ఆర్గనైజ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం బయటపడింది. - అడిగిన అమౌంట్ ఇవ్వని షాపు యజమానుల షాప్ లైసెన్సులు రద్దు చేయిస్తామని, అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది. - ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని గ్రహించిన టీడీపీ.. మద్యం వ్యాపారులను దోచుకుని ఆ నల్లధనంతో ఓటర్లను మభ్యపెట్టాలని చూస్తున్నారనేది స్పష్టమవుతోంది. - విశాఖ నగర ప్రతిష్టను మసకబారుస్తూ, అధికార బలంతో బెదిరింపులకు దిగుతూ సాగిస్తున్న ఈ ‘మద్యం మనీ స్కామ్‌’ గురించి అధికారుల‌కు తెలిసి కూడా అటు క‌న్నెత్తి కూడా చూడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.
8
50
1,785
బాబు పుట్టుకే అప్రజాస్వామికం - భజన పరులకు తెలియని చరిత్ర పాఠం - జాతి ఉద్ధరణ పేరిట కోట్ల మంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన హిట్లర్ ను సమర్థించే వాళ్లు కూడా అప్పట్లో నీలానే ఇలాంటి చెత్త థియరీలు రాసేవారు. - చంద్రబాబు, లోకేష్ వేసే ఎంగిలి మెతుకులు తింటే, సినిమా గ్యాసిప్పులు రాసుకొని బతికేవాళల్లు రాజకీయాల గురించి మాట్లాడడం, కామెంట్ చేయడం ఎలా ఉంటుందో.., ఈ @Telugu360 స్టోరీ కూడా అలాగే ఉంది. - రాజకీయాలను పరిశీలించకుండా, అధ్యయనం చేయకుండా రాస్తే ఇలాగే ఉంటుంది. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యింది సొంతమామను వెన్నుపోటు పొడిచి అన్న సంగతిని నువ్వు మరిచిపోతే ఎలా..? ఆరోజు “సారా” డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ఎల్లో మీడియాలో లేని మద్దతును ఉన్నట్టుగా చూపించడంతో, అప్పటి కేంద్రంలో ఒక మంత్రిని, అతని ద్వారా గవర్నర్ ను కొనుగోలు చేసి ఈ వెన్నుపోటు కథ నడిపారు. కానీ, జగన్ అలా కాదు, కాంగ్రెస్ కు రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టి, తన కాళ్ల మీద తాను అధికారంలోకి వచ్చాడు. తన కాళ్ల మీద తాను నిలబడి రాజకీయాలు చేస్తున్నాడు. దటీజ్ జగన్. - 2002లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను కట్టబెట్టారు. ప్రజాతీర్పును బేఖాతరు చేసి అనంతపురం లాంటి చోట్ల జెడ్పీటీసీలను భయపెట్టి, బెదిరించి తన పార్టీలోకి చేర్చుకున్నాడు. సొంతం బలం ఎలాగూ లేదు.. ఎదుటివారిపై ఆధారపడి రాజకీయం చేసే చంద్రబాబు గురించి నీతులు చెప్పడం సిగ్గుచేటు. - 2014లో తృటిలో అధికారాన్ని కోల్పోయిన జగన్, 67 మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగా అవతరించాడు. కాని జగన్ ను దెబ్బతీయాలన్న ఏకైక ఉద్దేశంతో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, తన పార్టీలో చేర్చుకున్నాడు. ఆ తర్వాత 2019లో చంద్రబాబు దారుణ ఓటమికి గురయ్యాడు. 23 మంది ఎమ్మెల్యేలతో సంతలో పశువుల మాదిరిగా కొన్న చంద్రబాబు పశువుల బేరగాడు కాదా..? చంద్రబాబు రాజకీయ పుట్టుకే అప్రజాస్వామికం.
2
8
25
770
ఏపీలో ఇదీ ప‌రిస్థితి..! ప్ర‌జ‌లు : హామీలు అమలు చేయకుండా.. మళ్ళీ ఓట్లు అడగటానికి ఎలా వచ్చారు? చంద్ర‌బాబు : గత ముఖ్యమంత్రి చెల్లెలికి ఆస్తులు ఇవ్వలేదు.. తల్లి చెల్లెలికి న్యాయం చేయలేదు.. ఆ ఇల్లు షర్మిలదే. ప్ర‌జ‌లు : మేము అడుగుతున్నది ఏమిటి? మీరు చెప్తున్నది ఏమిటి?
7
152
3
455
5,773
ఏపీలో ఇదీ ప‌రిస్థితి..! ప్ర‌జ‌లు : మూడేళ్లు కావొస్తోంది.. బీసీలకి 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు.. నిరుద్యోగ భృతి నెలకు రూ.3000 అన్నారు. చంద్ర‌బాబు : వాళ్లది గొడ్డలి పార్టీ.. గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగింది. ప్ర‌జ‌లు : మేము అడుగుతున్నది ఏమిటి? మీరు చెప్తున్నది ఏమిటి?
2
105
4
234
3,373
ఏపీలో ఇదీ ప‌రిస్థితి..! ప్ర‌జ‌లు : మూడేళ్లు అవుతోంది.. ఇంతవరకు మహిళలకి ఇస్తామన్న నెలకు 1500 ఇవ్వలేదు..? చంద్ర‌బాబు : గ‌త పాలనలో లడ్డూలో కల్తీ చేశారు.. వాళ్ల‌ బాబాయిని వాళ్లే చంపారు. ప్ర‌జ‌లు : మేము అడుగుతున్నది ఏమిటి? మీరు చెప్తున్నది ఏమిటి?
8
247
5
837
14,076
కాపులారా.. తేల్చుకోండి 25 ఏళ్ల పాటు 15 శాతం నాయ‌క‌త్వం కావాలా..? లేక 100 శాతం క‌మిట్ ‌మెంట్ కావాలా..? - ఆంధ్రప్రదేశ్ ‌లో ఇప్పుడు ఈ నినాదం చాలా బ‌లంగా వినిపిస్తోంది. - 25 ఏళ్లు గ‌డిస్తే గానీ పార్టీ బ‌ల‌ప‌డ‌దంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడిన మాట‌లు, అదీ చంద్ర‌బాబు గారి స‌మ‌క్షంలో చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్య‌కు దారి తీశాయి. - కాపులు త‌మ ఉనికి, త‌మ స్వాభిమానం కోసం ఒక నిర్ణ‌యం తీసుకోక‌పోతే టీడీపీ బానిస‌లుగా మిగిలిపోతామ‌నే ఆందోళ‌న క‌నిపిస్తోంది.
11
23
1
136
4,550
పవన్ @ 80, జనసేన @ 2051 పాతికేళ్ల పాటు 15 శాతమే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వయస్సు.. సర్టిఫికెట్ ప్రకారమే 55 సంవత్సరాలు, అంటే మరో పాతికేళ్ల తర్వాత అంటే 80 ఏళ్లకు ఆయన తనకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వస్తుందని భావిస్తున్నారు. - రాజకీయాల్లో మనం తప్పక అధికారంలోకి వస్తామని నాయకుడే చెప్పకపోతే ఇక కార్యకర్తలు ఎందుకు ఆ పార్టీని అంటిపెట్టుకొని ఉంటారు. - పార్టీ బలోపేతం కావడానికి మరొక 25 సంవత్సరాలు వేచి చూడాలంటూ, పవన్ చేసిన కామెంట్స్ జనసేన కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం నింపాయి. పార్టీ పరువును పవనే గంగలో కలిపేశారని తీవ్రంగా వాపోతున్నారు. - సోషల్ మీడియాలో జనసేన సానుభూతి పరుల కామెంట్స్ చూస్తే పవన్ తీరు మీద ఎంత మండిపడుతున్నారో అర్థం అవుతుంది. - స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకాలపై నిన్న హఠాత్తుగా చంద్రబాబు, మాధవ్ లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, ఆ సమావేశంలో జనసేన బలాబలాలు గురించి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కార్యకర్తలను అధ:పాతాళానికి తాక్కేశాయి. - జనసేన 2014 ఎన్నికల్లో పాల్గొంది. కానీ, పోటీ చేయలేదు. అప్పుడు కూడా చంద్రబాబు గెలుపు కోసమే పనిచేసింది. - 2019లో చంద్రబాబు వ్యతిరేక ఓటును చీల్చడానికి విడిగా పోటీ చేసింది. అప్పుడు కూడా చంద్రబాబు మేలు కోసమే. - 2024లో కలిసి పోటీ చేసింది. జనసేన మద్దతు కచ్చితంగా అవసరమని, ఇది అనివార్యమని చంద్రబాబు గట్టిగా కోరుకుంటున్న సమయంలో కూడా తగినన్ని సీట్లు అడక్కుండా రాజీపడ్డారు. - తీరా అధికారంలోకి వచ్చాక.. జనసేనను వెన్నుపోటు పొడవడమే లక్ష్యంగా టీడీపీ నాయకత్వం ముందుకుసాగుతున్నా.. పవన్ పూర్తిగా రాజీ ధోరణిలోనే వ్యవహరించారు. - దీనికి తోడు తాజా ప్రకటనలు ఆ పార్టీని పూర్తిగా దెబ్బతీశాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
15
67
2,425
కాకినాడ‌లో ప‌వ‌న్ క‌వ్వింపులు - క‌ర‌క‌ట్ట బంగ్లాలో బాబుతో ఒప్పందాలు ప్లేటు ఫిరాయింపునకు పవన్ కళ్యాణ్ అద్దంలా నిలిచారని జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. - సెప్టెంబర్ 2న కాకినాడలో మీటింగ్ పెట్టుకున్న పవన్, టీడీపీతో సంబంధం లేకుండానే నామినేషన్లు వేయమని, ఎక్కడా వెనక్కి తగ్గొద్దని పార్టీ నాయకులను కవ్వించాడు. - పవన్ ఫైర్ మీద ఉన్నాడంటూ కేడర్ అంతా టీడీపీతో సంబంధం లేకుండానే నామినేషన్లు వేశారు. - దీని పర్యావసానాల్లో భాగంగానే ఇటీవల నామినేషన్ల దాఖలు సమయంలో పలు జిల్లాల్లో జనసేన అభ్యర్థులపై టీడీపీ దాడులు కూడా చేసింది. - కట్ చేస్తే.. అక్టోబర్ 27, 2026 నాటికి మొత్తం సీన్ మారిపోయింది. కవ్వింపులు, హుంకరింపులు పోయి, ఒప్పందాలు కుదిరాయి. కరకట్ట బంగ్లాలో చంద్రబాబు - పవన్ కళ్యాణ్ మధ్య కుదిరిన పాతికేళ్ల పాటు 15 శాతం ఒప్పందం కాకినాడ సభలో పాల్గొన్న నాయకుల్ని నిశ్చేష్టులను చేసింది.
2
7
53
3,142
తుపాను తీరం దాటకముందే.. బాబు పబ్లిసిటీ ఆకాశాన్ని తాకింది! తుపాను ఇంకా తగ్గలేదు.. నష్టమెంతో తేలలేదు.. రైతుల కన్నీళ్లు ఆరలేదు.. కానీ చంద్రబాబు అద్భుతాలు చేశారంటూ అప్పుడే జాతీయస్థాయిలో ప్రచారాల హోరు! తుపాను వస్తోందంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటారు. రైతులు తమ పంటలు ఏమవుతాయోనని ఆందోళన చెందుతారు. కానీ, చంద్రబాబు మాత్రం తన పబ్లిసిటీని పీక్‌ లెవల్లోకి తీసుకెళ్లే పనిలో పడిపోతారు. స్థానిక ఎన్నికల్లో జరిగిన దాడులు, దౌర్జన్యాలతో ఆంధ్రప్రదేశ్‌ ఒక సౌత్‌ బిహార్ ‌గా మారిపోయిందన్న విమర్శల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి నిన్నటివరకు బెంగళూరులో జగన్‌ నివాసాన్ని వేదికగా చేసుకున్న చంద్రబాబు, ఇప్పుడు అర్నబ్ తుపానును తన పబ్లిసిటీకి వేదికగా మార్చుకున్నారు. - గతంలో తుపాన్లనే అడ్డుకున్నానన్న తరహాలో ప్రచారం చేసుకున్న చంద్రబాబు, ఆయన భజన బృందం ఇప్పుడు కూడా అదే పాత స్క్రిప్టును మళ్లీ మొదలుపెట్టింది. - తుపాను వస్తుందని ముందే తెలుసు. కానీ, ముందు రోజు వరకు అధికారులతో కూలంకషమైన సమీక్షలు లేవు. మంత్రులకు బాధ్యతల అప్పగింత లేదు. ఒక్కరోజు ముందు హడావిడి రివ్యూలు మాత్రం ఉన్నాయి. - పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి సరైన సౌకర్యాలు కల్పించారా? బాధితులకు ఎలాంటి సాయం చేస్తారో ప్రకటించారా? అదేమీ లేకపోయినా అద్భుతంగా పనిచేస్తున్నామంటూ ప్రచారం మాత్రం మొదలైపోయింది. - అసలు విచిత్రం ఏంటంటే.. తుపాను ఈ ఉదయం 10:14 గంటలకు తీరం దాటిందని వాతావరణ శాఖ చెబుతుంటే, అంతకంటే ముందే చంద్రబాబు అద్భుతంగా పనిచేసి ప్రజలను రక్షించేశారంటూ జాతీయస్థాయిలో ప్రచారం మొదలైంది. - మీడియా సంస్థల చేత ట్వీట్లు పెట్టించడం, స్టోరీలు రాయించడం కోసం భారీగా డబ్బులు వెచ్చిస్తున్నారన్న ఆరోపణలు ఒకవైపు.. ఆర్టీజీఎస్ ‌లో కూర్చుని సీసీ కెమెరాల ద్వారా తుపాను నష్టాన్ని పరిశీలిస్తున్నారంటూ మరోవైపు ప్రచారాలు. - అసలు సీసీ కెమెరాల్లో తుపాను నష్టాన్ని అంచనా వేయడమేంటి చంద్రబాబుగారూ? - లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటుంటే, వందల గ్రామాల్లో కరెంటు, రవాణా సౌకర్యాలు నిలిచిపోతుంటే.. సీసీ కెమెరాల్లో చూస్తూ నష్టాన్ని అంచనా వేశామనడం ఏంటి? - రైతుల పొలాల్లోకి వెళ్లకుండా పంటనష్టం తెలుస్తుందా? ప్రజల మధ్యకు వెళ్లకుండా వారి కష్టాలు తెలుస్తాయా? - ప్రజలకు కావాల్సింది పబ్లిసిటీ కాదు.. పరిహారం! సీసీ కెమెరాల్లో కనిపించాల్సింది చంద్రబాబు ముఖం కాదు.. ప్రజల కష్టాలు! - తుపాను తీరం దాటినంత మాత్రాన ప్రమాదం తొలగిపోదు. ఆ తర్వాత రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు, వరదల ముప్పు ఉంటుంది. అసలు నష్టం ఎంతో తేలేది అప్పుడే. - కానీ నష్టాన్ని పరిశీలించకముందే, బాధితులకు ఏం చేస్తారో చెప్పకముందే, అద్భుతంగా పనిచేశామంటూ డబ్బాలు కొట్టుకోవడం చంద్రబాబుకే చెల్లింది! తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి పాలన కంటే ప్రచారానికే ప్రాధాన్యం ఇవ్వడం నియంతృత్వ పాలనను గుర్తుచేస్తోంది. - చంద్రబాబు పబ్లిసిటీకి తుపాను తీరం దాటాల్సిన అవసరం లేదు. కానీ రైతుకు పరిహారం రావాలంటే మాత్రం నెలలు గడిచినా సరిపోవడం లేదు. ఇదే అసలు విషాదం. - చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ను 17 తుపాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు ప్రభావితం చేశాయి. ఈ తుపాను కాకుండా ఏడుసార్లు రైతులు నష్టపోయినా వారిని ఆదుకున్న పాపాన పోలేదన్న విమర్శలకు సమాధానమేది? - గత ఏడాది అక్టోబరులో మొంథా తుపాను వల్ల దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే, నష్టాన్ని 4 లక్షల ఎకరాలకు కుదించేశారు. - రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద దాదాపు రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉన్నా, ఏడాది గడిచినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. - ఆ రైతుల గోడు పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు మరో తుపాను రాగానే మళ్లీ ప్రచార పర్వం మొదలుపెట్టారు. - 2024 విజయవాడ వరదల సమయంలోనూ ఇదే పబ్లిసిటీ. బాధితులకు లెక్కలేనన్ని హామీలు. వాటి అమలుపై ఇప్పటికీ ప్రశ్నలే! - పబ్లిసిటీకి మాత్రం ఫుల్‌ స్పీడ్‌.. పరిహారానికి బ్రేకులు! ఇదేనా చంద్రబాబు విపత్తుల నిర్వహణ? - ఇప్పుడు అర్నబ్‌ తుపాను నష్టాన్ని కూడా తగ్గించి చూపించే ప్రయత్నం మొదలైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. - కేవలం 70 వేల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 10 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయంటూ అప్పుడే లెక్కలు చెప్పేస్తున్నారు. - మచిలీపట్నం నుంచి విజయనగరం వరకు పంటలపై తీవ్ర ప్రభావం ఉందని వార్తలు వస్తుంటే, క్షేత్రస్థాయిలో రైతుల పొలాలను పరిశీలించకుండానే ఈ కాకి లెక్కలేంటి?
2
40
1
168
5,290
ఇంత‌కంటే అడుక్కు తిన‌డం బెట‌ర్ క‌దా కూనా..? టీడీపీ కుట్ర రాజ‌కీయం చూస్తే యాచ‌కులతో పోలిక కూడా త‌క్కువే అనిపిస్తోంది. క‌డుపు నింపుకోవ‌డానికి నాలుగు మెతుకుల కోసం క‌నిపించిన వారి ద‌గ్గ‌ర చేయి చాచుతారు కానీ, మ‌నుషుల‌ను దోచుకోరు. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తాన‌ని ప్ర‌మాణం చేసిన చంద్ర‌బాబు.. ఏకంగా జ‌నం స్వేచ్ఛ‌ను కాలరాస్తున్నాడు, తనవారి చేత ఓట‌ర్ల హ‌క్కుల‌నే కొల్లగొడుతున్నాడు. ప్ర‌జాబ‌లం లేక‌పోయినా, త‌న పార్టీ ఏక‌గ్రీవాలు సాధించింద‌ని డ‌బ్బా కొట్టుకోవ‌డానికి ప్ర‌త్య‌ర్థి పార్టీ అభ్య‌ర్థుల సంత‌కాల‌నే ఫోర్జ‌రీ చేసే స్థాయికి టీడీపీ నాయ‌క‌త్వం దిగ‌జారిపోయింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో ఫోర్జరీ సంతకాలతో ఏకంగా వైయ‌స్సార్సీపీకి చెందిన 5 ఎంపీటీసీ నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకున్న‌ట్లుగా ప్ర‌క‌టించ‌డం టీడీపీ కుట్ర రాజ‌కీయాల‌కు అద్దం ప‌డుతోంది. వైయ‌స్సార్సీపీ నేత చింతాడ ర‌వికుమార్ అభ్య‌ర్థుల‌ను త‌న‌వెంట ఆర్వో కార్యాల‌యానికి తీసుకెళ్లి నిల‌దీయ‌గా, టీడీపీ ఏక‌గ్రీవాల కుట్ర రాజ‌కీయ బ‌య‌ట‌ప‌డింది. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరిలోనూ ఈ త‌ర‌హా ఘ‌ట‌నే బ‌య‌ట‌ప‌డింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎన్ని ఫోర్జ‌రీ ఏక‌గ్రీవాలున్నాయ‌ని జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు. టీడీపీ దగుల్బాజీ రాజ‌కీయం కంటే.. యాచ‌కుడు బెట‌ర్ అంటూ ప్ర‌జాస్వామ్య వాదులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
8
43
714
వైయస్సార్‌సీపీకి షాకంటూ అజ్ఞానుల విన్యాసపు రాతలు - సుప్రీంకోర్టు ఆర్డర్‌ కాపీ రాకముందే తప్పుడు రాతలు - చంద్ర‌బాబును కాపాడేందుకు ప‌చ్చ‌మీడియా నానా తంటాలు - శ‌నివారం ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు అందరి కాళ్లు పట్టుకునేలా చేసింది వైయస్సార్‌సీపీయే మరి షాక్‌ ఎవరికి? - రాష్ట్ర‌ ఎన్నికల సంఘానికి చీవాట్లు పెట్టి, నామినేషన్లు తిరిగి తీసుకోవాలన్న ఆదేశాలే చంద్రబాబుకు చెంపపెట్టు కాదా? - ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకున్న ఘటనలు ఉన్నాయా? - చంద్రబాబు ఎంతటి అరాచకాలు చేస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది? - ఈరోజు విచారణ తర్వాత కూడా ఆ పిటిషన్‌ను సజీవంగా ఉంచితే దాన్ని షాక్ అంటారా? - ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి తగిన మార్గదర్శకాలు ఇస్తామనడం షాకవుతుందా? - ప్రభుత్వం, పోలీసులు, ఎన్నికల సంఘం ఇలాంటి ఆదేశాలను తీసుకోవడమే వారి పరువు గంగలో కలిసినట్టు కాదా? - ఎన్నికల సీసీటీవీ ఫుటేజీని భద్రపరచేందుకు సుప్రీంకోర్టు సానుకూలత వ్యక్తం చేయడమే మీ దుర్మార్గ పరిపాలనకు సిగ్గుచేటు
1
20
102
5,094
అడ్డంగా దొరికిపోయిన పచ్చ పోలీస్ - టీడీపీ ఏక‌గ్రీవ కుట్ర‌ల‌కు ఇదిగో సాక్ష్యం.. - అక్రమ ఏకగ్రీవాలు చేసేందుకు పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని టీడీపీ భారీ మనీ స్కామ్.. - టీడీపీకి అనుకూలంగా ప్ర‌త్య‌ర్థి వైయ‌స్సార్‌సీపీ అభ్య‌ర్థుల‌కు బెదిరింపులకు గురిచేస్తున్న నెల్లూరు జిల్లా గూడూరు డీఎస్పీ న‌ర్సింహ‌మూర్తి - నామినేష‌న్ విత్ డ్రా చేసుకోవాల‌ని, తాను చెప్పినట్టు వినకపోతే బలి అవుతావంటూ వైయస్ఆర్సీపీ నేత నరేంద్రరెడ్డికి డీఎస్పీ నర్సింహమూర్తి వార్నింగ్ - ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను విత్ డ్రా చేయించాలని హుకుం.. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్న డీఎస్పీ నర్సింహమూర్తి బెదిరింపులు
11
44
713
మీడియా స‌మావేశంలో బ్యాలెన్స్ కోల్పోయిన చంద్ర‌బాబు - తుపాన్ సంద‌ర్భంగా న‌ష్ట‌ప‌రిహారం అంద‌కుండా చూస్తామంటూ మ‌తిచ‌లించిన మాట‌లు - తుపాన్‌పై ఎప్ప‌టిక‌ప్పుడు బులిటెన్స్ రిలీజ్ చేస్తామంటూ ప్ర‌గ‌ల్భాలు. ఆ ప‌ని స‌హ‌జంగానే వాతావ‌ర‌ణం శాఖ చేస్తుందంటూ విశ్లేష‌కుల చుర‌క‌లు - ర‌త‌నాల సీమ రాయ‌ల‌సీమ ఎడారిగా మారిపోయింద‌న్న చంద్ర‌బాబు.. మ‌రి ఈ క‌రువు నివార‌ణ‌కు ఇప్ప‌టికీ రూపాయి ఇవ్వ‌ని వైనాన్ని ఎండ‌గ‌డుతున్న సీమ ప్ర‌జ‌లు. - సీమ‌కు ప్రాణాధార‌మైన రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్‌కు ఊపిరి తీసింది చంద్ర‌బాబే..
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు మీడియా సమావేశం @HCM CAMP OFFICE nitter.gq/i/broadcasts/1DGLdZlyd…
2
11
2,668
స్థానిక ఎన్నిక‌ల‌ను Mid Term Appraisalగా పేర్కొన్న చంద్ర‌బాబు అందుకే ఆ అప్రైజ‌ల్‌ను హైజాక్ చేసి, రిగ్గింగ్‌ చేశారంటున్న విశ్లేష‌కులు ఇప్పుడు ప్ర‌తికూల ఫ‌లితాలు కాస్త వ‌చ్చినా బాబు కూలిపోవ‌డం ఖాయ‌మ‌ని, అందుకే దాడులు చేశారంటున్న విశ్లేష‌కులు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు మీడియా సమావేశం @HCM CAMP OFFICE nitter.gq/i/broadcasts/1DGLdZlyd…
1
9
375
నామినేష‌న్ల‌పై చంద్ర‌బాబు ప‌చ్చి అబ‌ద్ధాలు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు నామినేష‌న్లు వేసిన‌ట్టుగానే వైయ‌స్సార్ సీపీ వేసింద‌న్న చంద్ర‌బాబు నామినేష‌న్లు వేయ‌నిచ్చి ఉంటే టీడీపీ+జ‌న‌సేన‌+బీజేపీ నామినేష‌న్ల‌కు స‌మాన‌స్థాయిలో వైయ‌స్సార్ సీపీ నామినేష‌న్లు వేసి ఉండాలి క‌దా..? కాని కూట‌మిలో ఉన్న టీడీపీ క‌న్నా సింగిల్ అపోజిష‌న్ ఉన్న వైయ‌స్సార్ సీపీ నామినేష‌న్లు త‌క్కువ‌గా ఎందుకు వ‌చ్చాయి..? వైయ‌స్సార్ సీపీ త‌ర‌ఫున నామినేష‌న్లు మేము వేశామ‌ని త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, నామినేష‌న్లు ఏ పార్టీ వాళ్లు వేశారో తెలియ‌ద‌న్న చంద్ర‌బాబు బీ-ఫారం ఇచ్చిన త‌ర్వాతే నామినేష‌న్లు వేస్తారంటూ అబ‌ద్ధాల మాట‌లు నామినేష‌న్లు వేసిన‌ప్పుడు ఫారంలో ఏ పార్టీ అనే విష‌యాన్ని చెప్ప‌రు. ఆ మాత్రం చంద్ర‌బాబుకు తెలియ‌దా..? బీ-ఫారం లేక‌పోయినా నామినేష‌న్లు వేయొచ్చ‌న్న విష‌యం తెలిసే ప‌చ్చిగా మాట్లాడిన చంద్ర‌బాబు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు మీడియా సమావేశం @HCM CAMP OFFICE nitter.gq/i/broadcasts/1DGLdZlyd…
3
7
257
జ‌న‌సేన‌ను ప‌వ‌న్ తాక‌ట్టు పెట్టార‌ని, రాష్ట్ర బీజేపీని మాధ‌వ్ అమ్మేశార‌న్న విమ‌ర్శ‌లు మ‌రింత ప‌దునెక్కేలా చేసిన ముగ్గురు పార్టీల అధ్య‌క్షుల స‌మావేశం.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు మీడియా సమావేశం @HCM CAMP OFFICE nitter.gq/i/broadcasts/1DGLdZlyd…
1
2
121
క‌రెంట్ చార్జీలు త‌గ్గించామ‌ని ప‌చ్చి అబ‌ద్ధాలు - 2024 జూన్ రాష్ట్రంలో ఏదైనా క‌రెంట్ బిల్లును 2024 అక్టోబ‌ర్ క‌రెంట్ బిల్లును పోల్చి చూద్దామా..? - క‌రెంట్ చార్జీల‌పై చంద్ర‌బాబు ప‌చ్చి అబ‌ద్ధాలు - క‌రెంట్ చార్జీలు త‌గ్గించామంటూ క‌ళ్లు మూసుకోకుండా అబ‌ద్ధాలు - పెంచిన చార్జీలు ర‌ద్దు చేశామ‌ని అబ‌ద్ధాలు
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు మీడియా సమావేశం @HCM CAMP OFFICE nitter.gq/i/broadcasts/1DGLdZlyd…
4
15
608
సూప‌ర్ సిక్స్‌పై మ‌ళ్లీ చంద్ర‌బాబు అవే అబ‌ద్ధాలు - ఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు చేసేశామ‌న్న చంద్ర‌బాబు - సూప‌ర్ సిక్స్‌, సూప‌ర్ సెవ‌న్ అమ‌లు చేశామంటూ ప‌చ్చి అబ‌ద్ధాలు - నిరుద్యోగ భృతి ఇచ్చారా..? - ఆడ‌బిడ్డ నిధి ఇచ్చారా..? - రూ.50 వేల‌కే పెన్ష‌న్ ఇచ్చారా..?
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు మీడియా సమావేశం @HCM CAMP OFFICE nitter.gq/i/broadcasts/1DGLdZlyd…
2
6
185