Ch.M.NAIDU (@chmnaidu) header
Ch.M.NAIDU (@chmnaidu) profile picture

ఏకం సత్.. బహుధా వదన్తి

Hyderabad Telangana India 🇮🇳
Joined December 2012
#ArnabCyclone విధ్వంసంపై ఓ బుడ్డోడి అప్డేట్స్..
205
"ఈ ప్రపంచంలో ఒకరి కోసం ఒకరు ఏదీ చేయరు. ఎవళ్ల కోసం వాళ్లే చేసుకుంటారు. కొందరికది చాతనవుతుంది. కొందరికి అదీ రాదు" (కాలాతీత వ్యక్తులు/డాక్టర్ పి. శ్రీదేవి)
24
"ఆడవాళ్ల మనసు తెలుసుకోవడం, నీళ్లలో చేపల దారి కనుక్కోవడం ఒక్కటే.. " (సంస్కారం /UR అనంతమూర్తి/సుజాత పట్వారి)
26
"రాజకీయాల్లో మనుషుల్ని చంపరు. దారిలో కంటకాలను ఏరిపారేస్తారు. అంతే" (ది కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో/ అలెగ్జాండర్ డ్యూమా- అజేయుడు/సూరంపూడి సీతారాం)
27
జీవితం అన్ని సుఖాలను అనుభవించేందుకు, అపారమైన జ్ఞానాన్ని సముపార్జించేందుకు సరిపోకపోతే ఆ జీవితం మనకెందుకు? (వ్యాసుడితో ద్రౌపది) (ద్రౌపది/యార్లగడ్డ లక్ష్మీప్రసాద్)
1
29
గొప్ప రచయిత గోపీచంద్ (అసమర్ధుని జీవయాత్ర) 1952లో 'పేరంటాలు' సినిమాను తెరకెక్కించారు. సినిమా విడుదలకు ముందు శ్రీశ్రీకి చూపించారు. ఆ సినిమా చూసి శ్రీశ్రీ ఆశువుగా ఇలా చెప్పారట.. "చూచితిని పేరంటాలిని వాచెను నా రెండు కళ్లు వలవలా ఏడ్వన్ లేచి లేవక మునుపే గోచీ విడే నేమనందు గోపీచందు"
40
"దరిద్రుడు, ధనవంతుడు అనే తేడా లేకుండా అందరినీ సమానమైన బిడ్డలలాగున పాలించే దయాళుడైన దేవుడెక్కడైనా ఉన్నాడా? " (అమ్మ/మాగ్జిమ్ గోర్కీ/క్రొవ్విడి లింగరాజు)
24
గణాచారి గుత్తా పన్ను: విజయనగర రాజుల కాలంలో భోగపు సానులు పెద్దసంఖ్యలో ఉండేవారట. వారిపై విధించే పన్నును గణాచారి గుత్తా పన్ను అనేవారు. ఇలా వసూలు చేసే పన్ను 12 వేల మంది సైనికుల జీతభత్యాలకు సరిపోయేదట! (ఆంధ్రుల సాంఘిక చరిత్ర/సురవరం ప్రతాపరెడ్డి)
22
"క్రమమేమిటి? అక్రమమేమిటి? ఎవడికి వీలుగా ఉన్నది వాడికది క్రమం ఎవడికి వీలు తప్పింది వాడికది అక్రమం" (చంఘిజ్ ఖాన్/తెన్నేటి సూరి)
27
"గొల్లోడు గొర్రెలతోబాటు కొండలెక్కుతాడు. అడవుల్దిరగతాడు. వాటితో పాటు వానలో తడుస్తాడు. ఎండల్లో ఎండుతాడు. ఇంతజేసినా గాని గొర్లు కసాయోడిని నమ్మినట్టుగా గొల్లోడిని నమ్ముతాయా? అదే ఇచిత్రం" (ఇన్.క్రెడిబుల్ గాడెస్ (క్షుద్రదేవత)/డాక్టర్ కేశవరెడ్డి)
39
"కాలం చాలా కఠోరమైనది. ఎంత వారినైనా తన పొట్టలో పెట్టుకుంటుంది. అదృష్టవంతుల పేర్లు పైకి వస్తాయి. దురదృష్టవంతులవి అట్టడుగున పడిపోతాయి" (హంపీ నుంచి హరప్పా దాకా/ తిరుమల రామచంద్ర)
29
పరమాత్మను సర్వసాక్షి అంటారు. కానీ, అమాయకులకు, నేరం చేయని వారికి సాక్షిగా అతను ఎప్పుడైనా పరుగెత్తుకుని వస్తాడా? (యయాతి/విష్ణు సఖారామ్ ఖండేకర్/యార్లగడ్డ లక్ష్మీప్రసాద్)
35
"తినుటకు తిండి యున్నచో న్యాయస్థానమునకు లాగబడరాని యే దోషము చేసినను దోషము కాదు" (వేయిపడగలు/విశ్వనాథ సత్యనారాయణ)
28
"ఇలా చేయకుండా ఉంటే, ఇలా కాకుండా ఉంటే బాగుండేది" అని నువ్వు విచారించేవన్నీ అప్పటికే ముగిసిపోయి ఉంటాయి (ఫౌంటెన్ హెడ్/ అయిన్ రాండ్/ రెంటాల శ్రీవెంకటేశ్వరరావు)
27
"ఎవరి సంభాషణ అయినా నాకు విసుగనిపిస్తే వాళ్ల నుంచి తప్పించుకోవడానికి నేను సాధారణంగా చేసే పని ఒకటుంది. అది- వాళ్లు చెబుతున్న దానికి ఒప్పుకున్నట్టు నటించడం.." (The Stranger/అపరిచితుడు/ Albert Camu/జి. లక్ష్మి)
37
"చాలా కుటుంబాలు సంవత్సరాల తరబడి ఎలాంటి వికాసమూ లేకుండా ఉండటానికి కారణమేమిటంటే ఆ భార్యాభర్తలు పూర్తిగా కలిసీ ఉండరు, విడిపోయీ ఉండరు" (ఆన్నా కరేనినా/టాల్ స్టాయ్/ తాపీ ధర్మారావు)
30
"మనుషులలో ఒకరి సంగతి మరొకరికి నిజంగా ఏపాటి తెలుస్తున్నది?" (వనవాసి/భిభూతిభూషణ్ బందోపాధ్యాయ/సూరంపూడి సీతారాం)
30
"రావణుడిలా జీవించాను. రావణుడిలా మరణిస్తాను. నాకు రాముడిలా మారాలని లేదు. అతను సంపూర్ణ మానవుడు. దేవుడు. నా రాజ్యంలో దేవుళ్లకు కొదవ లేదు. మనుషులే తక్కువైపోయారు" (అసురుడు/ఆనందనీలకంఠన్/ఆర్.శాంతసుందరి)
31
ఇంటికొకసారి వచ్చిన తరువాత వెళతానని కూడా అనకుండా భోజనాలు చేస్తూ, విందులు కుడుస్తూ కూర్చునే అతిథిలాంటిది "అప్పు" (గోదాన్/ ప్రేమ్ చంద్/ అట్లూరి పిచ్చేశ్వరరావు)
34
ఆంధ్రజ్యోతి సచిత్ర మాస పత్రిక 1947 (సర్వజీత్తు నామ సంవత్సర) ఉగాది సంచిక ముఖచిత్రం #ఉగాది
28