చీకట్లో ఉన్న నా జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన ఈ దీపావళి చాలా చాలా స్పెషల్ ❤️
#యండమూరి గారి కథతో,
#రసూల్ గారి విజువల్స్ తో ,
#సీతారామశాస్త్రి గారు దాచేసుకున్న సాహిత్యంతో,
వాళ్ళ అబ్బాయి సంగీతం,
యశోదమ్మ కృష్ణ పరమాత్ముడి కోసం పాడిన కీర్తనలో నేపథ్య సంగీతం 🙌🤞🛐
#TrivedaArts
అన్నీ కాకపోయినా కొన్ని కలల్ని దేవుడు నెరవేరుస్తాడు....
ఇటువంటి విజువల్స్ తీసిన మహానుభావుడు, మా మొదటి సినిమా D.O.P. 🛐
అన్నమయ్య గారు చెప్పినట్టు
"ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి
యిదిగాక వైభవం బిఁక నొకటి కలదా".
#TrivedaArts @SreedharAdabala 🙌❤️🤞
ఇండియన్ సినిమాలో దీన్ని తలదన్నేది ఎప్పటికీ రాదు....
RGV : పాట ఎక్కడ తీస్తావ్ వంశీ??
కృష్ణవంశీ : అరకులో బైక్ మీద సర్....
RGV : సరే!!! తరువాత??
కృష్ణవంశీ : తరువాత కూడా బైక్ మీదనే సర్....
RGV : ఆ తరువాత??
కృష్ణవంశీ : మొత్తం పాట అంతా బైక్ మీదనే సర్....
RGV : నీకేమైనా పిచ్చెక్కిందా??
విజువల్స్ చూసాకా రాము సర్ కి పిచ్చెక్కిపోయింది...
RGV సర్ "గాయం",
కృష్ణవంశీ గారి "గులాబీ",
తేజ గారి "నువ్వు నేను",
త్రివిక్రమ్ గారి "జల్సా",
సురేందర్ గారి "కిక్" చేసిన @rellore సర్ నా మొదటి సినిమా DOP 🛐🛐🛐
మీరు తీయబోయే మంచి విజువల్స్ కోసం ఎదురుచూస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు సర్. #TrivedaArts 🎬🔥♾️
ఇది కదా ఆనందం 🥹🥹🥹
సర్వదా ( ఎల్లప్పుడూ )
శతదా ( వందల సార్లు )
సహస్రదా ( వేలసార్లు ) కృతజ్ఞతతో ❤️🛐🎬
సినిమాని నేర్పించిన @director_kv సర్ కి,
సాహిత్యంతో పాటు సంస్కారాన్ని నేర్పించిన శ్రీ #యండమూరి గారికి
సాంబయ్య ❤️🙌🛐
కష్టపడడం నేర్పించాడు,
త్యాగం అంటే ఏంటో చెప్పాడు,
ప్రేమని ఇచ్చాడు,
ఎదగడం ఎలాగో చూపించాడు,
సహనం,
సంకల్పం,
కృతజ్ఞత ఉండాలని,
లక్ష్యం తప్ప ఏం ఉండకూడదు అని చెప్పాడు...
దేవుడు కూడా అదే కదా చెప్పాడు.
( చిరంజీవి గారు నాకు దేవుడు కాదు, సాంబయ్య ఖచ్చితంగా దేవుడే )
తల్లిదండ్రులుకి,
ప్రకృతికి,
నన్ను నిలబెట్టిన కొంతమంది మనుషులుకి,
ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దేవుడు లాంటి మనుషులుకి కృతజ్ఞతతో ❤️🛐🙌
దేవుడు ఆలస్యం చేసాడు🥹
అన్యాయం చేయలేదు 🛐
వనవాసం 14 ఏళ్ళు,
అజ్ఞాతవాసం 14 ఏళ్ళు,
నా 14 ఏళ్ళ దర్శకత్వ కలని నిజం చేసిన నిర్మాత @SreedharAdabala అన్నయ్యకి కృతజ్ఞతతో 🙌❤️🙏
"కనిపించనంత దూరంలో ఉన్న అమ్మానాన్నలకి, వినిపించేంత గట్టిగా అరిచి చెప్తున్నా, నేను సినిమా తీయబోతున్నాను 🛐🛐🛐
తను మోసం చేసింది,
తను వెళ్ళిపోయింది,
తనకి ఇంకెవరో నచ్చారు,
తనకి క్యారక్టర్ లేదు....
ఇవన్నీ కాదు తనకి నువ్వు నచ్చలేదు,
తనకి నచ్చేలా నువ్వు ప్రవర్తించలేదు,
నిజంగా "తను ప్రేమిస్తే, తనకి ఉండాలనిపిస్తే తానే అంతా చేస్తుంది, నువ్వు (మగాడు) నిమిత్త మాత్రుడివి... "తాను శక్తి"❤️🙌🤞
జీవితంలో నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటి పొద్దున్నే జిమ్ కి వెళ్లడం.....
దారిని, గమనాన్ని మార్చిన "వెంకటేశ్వరుడికి, పద్మావతి అమ్మకి" 🛐🛐🛐
అసతోమా సద్గమయ 📃
తమసోమా జ్యోతిర్గమయ 🌄🌞
మృత్యోర్మా అమృతంగమయ⏳
6 నెలలు వ్యాయామం చేస్తే???
శరీరం మారింది, తిండి మారింది, బుద్ది మారింది, ఆలోచన మారింది, కోపం పోయింది, ప్రశాంతత వచ్చింది, అన్నిటికంటే జీవితం మారిపోయింది....
"మనిషి మారడానికి ఒక్క మాట చాలు" అనే మాటని నిజం చేసిన @miryalasrikanth డాక్టర్ అన్నయ్య కి శిరస్సు వంచి ❤️🙏🤞
చెత్త సినిమాని విమర్శించడం ఎంత అవసరమో!!!
మంచి సినిమాని అభినందించడం కూడా అంతే అవసరం ❤️
సినిమాని ఒప్పుకున్న @Dir_Lokesh గారికి,
స్త్రీ మనస్సుని స్క్రీన్ మీద చూపించిన @sanjana_off గారికి, @iWamiqaGabbi గారికి,
#DC ని ఇచ్చిన @ArunMatheswaran గారికి,
కొత్త G.O.A.T. @anirudhofficial 🙏
మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో❤️❤️❤️
దేవ దేవుడా!!! వీలైనంత తొందరగా ఈ సినిమాని మెదడు నుండి, హృదయం నుండి చేరిపేసేలా చెయ్...
లేకపోతే ఇలాంటి గొప్ప సినిమాని చేసేంత జ్ఞానాన్ని, శక్తిని ఇవ్వు 🙌
నిజాయితీగా, హృదయమంతా అనందంతో అరిచేలా సినిమాని తీసిన @ArunMatheswaran #DC
"ఈ దశాబ్దంలో గొప్ప సినిమా చూసాను" అనే ఆనందాన్ని కొన్ని రోజులు కూడా ఉండనీయకుండా చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే కోపం వస్తుంది @RGVzoomin సర్ 😘😘😘
"చంద్ర, డాక్టర్ ని చంపడానికి వెళ్ళినప్పుడు ఇదే ఎమోషన్ చూసాను". బహుశా @ArunMatheswaran కూడా ఇక్కడ నుండే తీసుకుని ఉంటాడు. #DC చూడండి
శివ మొదలయ్యాక "RGV" సర్ తీసుకున్న బలమైన నిర్ణయాలు...
1. #ఇళయరాజా సర్
2. గోపాల రెడ్డి గారు (DOP.)
వీళ్ళు లేకుండా సినిమాని ఊహించలేం, వీళ్ళతో పాటుగా కసి మీద ఉన్న "కృష్ణవంశీ" గారిని, "తేజ" గారిని, "ఉత్తేజ్" గారిని ప్రాజెక్ట్ లోకి తీసుకోవడం..
గొప్పోడి నిర్ణయాలు ఇలాగే ఉంటాయేమో??
ఎందుకింతగా మనస్సుని తాకింది??
ఎనిమిదేళ్ల తరువాత రెండోసారి థియేటర్ కి వెళ్లి చూడాలని ఎందుకు అనిపించింది??
వేశ్య నడుము మీద క్లోజ్ అప్ లేదు,
బార్ సింగర్ పార్వతి ఎక్సపోసింగ్ లేదు,
స్పెషల్ సాంగ్ లేదు,
హీరో ఎంట్రీ కి సాంగ్ లేదు కానీ ప్రతీ సీన్ లో క్రాఫ్ట్ ఉంది #DC @ArunMatheswaran ❤️🙏
వెంటాడి వేధిస్తూ ఏ పని చేసినా మాటిమాటికి గుర్తొస్తున్న #DC ❤️🥰😘🥹🙌🙏
ప్రేమ, అందం, రొమాన్స్, కథ, ఎడిటింగ్, విజువల్స్, సంగీతం, యాక్షన్, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్న సినిమా ఈ దశాబ్దంలో ఇదే.
మనుషులతో పాటుగా ప్రకృతి కూడా సహాయం చేస్తేనే ఇలాంటి సినిమా సాధ్యం @ArunMatheswaran CRAFT
దేవదాసు నవలని 20సార్లు సినిమాగా తీశారు, అందులో సగానికి పైగానే చూసాను కానీ ఇదెందుకో బలంగా ఇంకా వెంటాడుతూనే ఉంది....
విమల్ రాయ్ గారు, వేదాంతం గారు, భన్సాలీ గారు, అనురాగ్ కాశ్యప్ గారు సాధించలేనిది ఏదో @ArunMatheswaran సాధించారు అనిపించింది. ముఖ్యంగా వయిలెన్స్ తో #DC ❤️🙌😘🥰🤞🥹🙏
సినిమా లక్ష్యం "బ్రేక్ ఈవెన్" సాధించడమేనా?? ఖచ్చితంగా కాదని నా బలమైన నమ్మకం....
థియేటర్ నుండి బయటకి వచ్చాక ట్రాన్స్ లోకి వెళ్ళిపోవాలి❤️
విజువల్స్, క్యారక్టర్ లు వెంటాడుతూ వేధించాలి😘
గుర్తొచ్చిన ప్రతిసారి నవ్వొ, భాదో, దుఃఖమో, ప్రేరణో రావాలి ఇవ్వాలి🙌
#DC చాలా చాలా గొప్ప సినిమా
టీనేజ్ లో తల్లిని కోల్పోయిన కొడుకు కథ,
కొడుకుని అపార్ధం చేసుకున్న తండ్రి కథ,
18ఏళ్ళు వేశ్యగా బ్రతికిన అమ్మాయి స్వేచ్ఛ కోసం ఎదురుచూసే కథ,
ప్రేమకోసం ఎదురుచూసిన దేవదాసు కథ,
శరీరంతో అవసరం లేకుండా ప్రేమ కోసం ఎదురుచూసిన చంద్ర కథ,
జీవితాన్ని అనుభవించేలోపు చనిపోయిన పార్వతి కథ #DC ❤️❤️❤️
పిల్లి క్లోజ్ అప్ ❤️
నవ్వుతున్న చంద్ర ముఖం నుండి పున్నమి చంద్రుడు ట్రాన్సిషన్🙏
చంద్ర ఏటిలో నిల్చుని స్వేచ్ఛగా నడుస్తున్నప్పుడు వచ్చిన సంగీతం "హ్యాన్స్ జిమ్మర్" గారి డాకింగ్ సన్నివేశాన్ని గుర్తుచేసిన "అనిరుధ్"🛐🛐🛐
హింసని కవితలా,
రక్తాన్ని అభిషేకంలా చూపించిన #DC 🤞😘🥹







