పులివెందులలో పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోలేదు స్పష్టం చేసిన కడప కలెక్టర్
పులివెందులలో ఎక్కడా పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్న ఘటనలు జరగలేదని కడప జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ బూత్‌లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల నిఘా ఉందని వెల్లడించారు.
ఎలాంటి దౌర్జన్య ఘటనలు రికార్డు కాలేదని, పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్నట్లు ఆర్వోలు, ప్రిసైడింగ్ అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని కలెక్టర్ పేర్కొన్నారు.
#Pulivendula #Kadapa #APElections #ElectionUpdate
🚨 హైదరాబాద్‌లో 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం.. నవంబర్ 3 నుంచి మరమ్మతులు
🔸 హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేసే గండిపేట కాండ్యూట్‌లో సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల వద్ద భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. వీటిని అరికట్టేందుకు జలమండలి మరమ్మతులు చేపట్టనుంది.
🔸 నవంబర్ 3, మంగళవారం ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 4, బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు పనులు కొనసాగనున్నాయి.
🔸 ఈ మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ప్రభావిత ప్రాంతాల ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలి.
🔸 గోషామహల్, కార్వాన్ సర్కిళ్ల పరిధిలోని రెడ్‌హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకీ ఖబర్, హిందీనగర్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.
🔸 అసెంబ్లీ, సెక్రటేరియట్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్‌నగర్, నాంపల్లి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంతం, గన్‌ఫౌండ్రీలోనూ సరఫరా నిలిచిపోనుంది.
🔸 గోల్కొండ జోన్ పరిధిలోని చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, అహ్మద్‌నగర్ ప్రాంతాలపై ప్రభావం పడనుంది. కవాడిగూడ, గాంధీనగర్ వార్డుల పరిధిలోని దోమలగూడలోనూ అంతరాయం ఏర్పడనుంది.
🔸 జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలోని బంజారాహిల్స్ వార్డులోనూ నీటి సరఫరా నిలిచిపోనుంది. ప్రభావిత ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి కోరింది.
#Hyderabad #WaterSupply #HMWSSB #WaterDisruption
ఇరాన్ సముద్ర నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపణలు.. పర్షియన్ గల్ఫ్‌లో దాడికి గురై మునిగిన ఆయిల్ ట్యాంకర్
ఇరాన్ సముద్ర నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్‌లో ఓ ఆయిల్ ట్యాంకర్‌పై దాడి జరిగినట్లు, అనంతరం అది సముద్రంలో మునిగిపోయినట్లు చూపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
#Iran #PersianGulf #OilTanker #BreakingNews
పొలం ఎండిపోయింది సారు...అప్పుల పాలయ్యాం... మాజీ మంత్రి కాళ్లపై పడి మహిళా రైతు కన్నీటి వేడుకోలు
🔹 మహబూబ్‌నగర్ రూరల్ మండలం మాచన్‌పల్లి గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి @VSrinivasGoudను ఓ మహిళా రైతు కాళ్లపై పడి బోరున విలపించింది.
🔹 కరెంటు సక్రమంగా అందక తనకున్న నాలుగు ఎకరాల పొలం మొత్తం ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే రూ.1.50 లక్షల అప్పులు చేసినట్లు కన్నీటిపర్యంతమైంది.
🔹 "పంట పోయింది.. అప్పులు మిగిలాయి.. ఇప్పుడు మా కుటుంబం ఎలా బతకాలి సారు...?" అంటూ మహిళా రైతు చేసిన వేడుకోలు కలచివేసింది.
#Mahabubnagar #FarmerIssues #SrinivasGoud #TelanganaNews
తెలంగాణలో నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. మరో 2-3 గంటల్లో తేలికపాటి వర్షాలు
🔸 భారత వాతావరణ శాఖ (IMD) తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
🔸 నవంబర్ 1, 2026 రాత్రి 7 గంటలకు హెచ్చరిక జారీ కాగా, రాత్రి 10 గంటల వరకు అమల్లో ఉంటుంది. వాతావరణ పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
#TelanganaWeather #RainAlert #IMD #YellowWarning
🗳️ పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ రచ్చ.. నడిరోడ్డుపై జనసేన బైఠాయింపు
🔹 పిఠాపురం 19వ వార్డు రదాలపేట అంగన్‌వాడీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
🔹 తమ పోలింగ్ ఏజెంట్‌ను బయటకు పంపేశారని జనసేన ఆరోపించింది.
🔹 వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల ముందే రిగ్గింగ్ జరుగుతోందని మండిపడింది.
🔹 లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎంపీ ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీని పోలీసులు అడ్డుకున్నారు.
🔹 పోలింగ్ రద్దు చేయాలంటూ నేతలు రోడ్డుపైనే నిరసనకు దిగగా, భారీగా పోలీసులు మోహరించారు.
#Janasena #Pithapuram
రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పాలనే కారణం... బాధిత కుటుంబాలకు కేటీఆర్ రూ.2 లక్షల ఆర్థిక సాయం
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఆరోపించారు. తలమడుగు మండలంలో నలుగురు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 100 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు మండలంలో ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతుల కుటుంబాలను కేటీఆర్ పరామర్శించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు.
#KTR #BRS #Adilabad #FarmersIssues
గుంటూరులో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత...ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులపైనా దాడి
గుంటూరు 57వ వార్డు పరిధిలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ పోలింగ్ బూత్‌లో ఎన్నికల విధులకు వచ్చిన ఉపాధ్యాయులపై కూడా దాడి జరిగినట్లు సమాచారం.
నల్లగుట్టలో మురుగునీటి సమస్యపై మాజీ ఎమ్మెల్యే కత్రగడ్డ ప్రసూన పర్యటన.. 3 నెలలుగా ప్రజల అవస్థలు
🔸 రాంగోపాల్‌పేట పరిధిలోని పీజీ రోడ్, మార్వాడీ విద్యాలయానికి ఎదురుగా ఉన్న నల్లగుట్ట మురికివాడను మాజీ ఎమ్మెల్యే కత్రగడ్డ ప్రసూన పరిశీలించారు. మూడు నెలలుగా పొంగిపొర్లుతున్న డ్రైనేజీ, కలుషిత తాగునీరు, నీరు నిలిచిన రోడ్లతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
🔸 వీధి దీపాలు పనిచేయకపోవడంతో ప్రజలు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్యలను పరిష్కరించాలని జలమండలి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
#Nallagutta #KatragaddaPrasuna #Ramgopalpet #HyderabadNews
@HMWSSBOnline @HMDA_Gov
నరకాన్ని తలపిస్తున్న బస్తీ పరిస్థితులు.. మూడు నెలలుగా పట్టించుకోని అధికారులు
రామ్ గోపాల్‌పేట పీజీ రోడ్ నుంచి నల్లగుట్టకు వెళ్లే మార్గంలో మార్వాడి విద్యాలయం ఎదురుగా, వెస్లీ స్కూల్ కాంపౌండ్ గేట్ పక్కన ఉన్న బస్తీ ప్రజలు గత మూడు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్థానిక సమస్యలపై అధికారులు స్పందించకపోవడంపై మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన @PrasunaTDP తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
#Hyderabad #Ramgopalpet #KatragaddaPrasuna #CivicIssues
సింగరేణిలో 63 ఎలక్ట్రీషియన్ ట్రైనీ పోస్టులకు రాత పరీక్ష...258 మంది హాజరు
🔹 సింగరేణి కాలరీస్‌లో 63 ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ-1 పోస్టుల భర్తీకి కొత్తగూడెంలోని మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించారు. 282 మందికి హాల్‌టికెట్లు జారీ చేయగా, 258 మంది పరీక్షకు హాజరయ్యారు.
🔹 విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో సీసీ కెమెరాల నిఘా మధ్య పరీక్ష నిర్వహించారు. జీఎంలు మురళీధరరావు, ఎస్.వి.మురళీధరరాజు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు.
🔹 ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగానే ఉంటుందని, దళారుల ప్రమేయం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఫలితాలను ఆదివారం రాత్రి నుంచే సింగరేణి అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రధాన కార్యాలయ నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.
#Singareni #ElectricianTrainee #JobNotification #Kothagudem
దివ్యాంగ జొమాటో డెలివరీ బాయ్‌కు కస్టమర్ అవమానం
శారీరక వైకల్యం ఉన్నప్పటికీ 50 విలువైన ఫుడ్ ఆర్డర్‌ను అందించేందుకు నిహిర్ ఎంతో కష్టపడి మెట్లు ఎక్కి కస్టమర్ ఇంటికి వెళ్లారు.
కిందకు వచ్చి పార్శిల్ తీసుకోవాలని నిహిర్ చేసిన విజ్ఞప్తిని కస్టమర్ పట్టించుకోలేదు. చివరకు కష్టపడి పైకి వెళ్లేసరికి ఆర్డర్‌ను క్యాన్సిల్ చేశారు.
తనకు ఎదురైన అవమానకర అనుభవాన్ని నిహిర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఘటనపై డెలివరీ ఏజెంట్ల పట్ల కస్టమర్ల ప్రవర్తనను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.
#Zomato #DeliveryBoy #ViralVideo #Humanity
SBI క్రెడిట్ కార్డుదారులకు షాక్
డిసెంబర్ 1, 2026 నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై కొత్త అదనపు ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. నెలవారీ పెట్రోల్, డీజిల్ ఖర్చులు రూ.50,000 దాటితే మొత్తం ఖర్చుపై 1 శాతం ఫీజు విధించనున్నారు.
రోడ్డు, రైలు, ఇతర కమ్యూటర్ రవాణా బుకింగ్స్‌లో ఒక్కో లావాదేవీ రూ.30,000 దాటితే ఆ పేమెంట్‌పై 1 శాతం అదనపు రుసుము వసూలు చేయనున్నారు. నిర్ణీత పరిమితుల్లోపు లావాదేవీలకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు.
#SBICreditCard #SBI #CreditCardCharges #BankingNews
శాతవాహన యూనివర్సిటీ హాస్టల్‌లో ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని ఆత్మహత్య
🔹 కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్న చంద్రకళ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
🔹 రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన చంద్రకళ మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
#SatavahanaUniversity #Karimnagar #LLBStudent #Shadnagar
కుటుంబ కలహాలతో గంగానదిలో దూకిన యువకుడు
🔹 హాపూర్‌లోని బ్రిజ్‌ఘాట్ గంగా బ్రిడ్జిపై నుంచి కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన అమ్రోహాకు చెందిన 27 ఏళ్ల మయాంక్.. ఎన్‌హెచ్-09 వంతెనపై నుంచి గంగానదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.
🔹 వెంటనే స్పందించిన పడవ నడిపేవారు, గజ ఈతగాళ్లు యువకుడిని సురక్షితంగా బయటకు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
#Hapur #Brijghat #GangaRiver #UPPolice
రైతు కుటుంబాలకు కేటీఆర్ భరోసా.. తలమడుగులో పాదయాత్ర
🔹 ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పాదయాత్ర చేపట్టిన కేటీఆర్.. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించారు.
🔹 కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కరెంట్, సాగునీరు అందక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
#KTR #Adilabad #Thalamadugu #Farmers
బీజేపీ ప్రభుత్వం పోతుంది.. ఢిల్లీ ర్యాలీలో మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన INDIA కూటమి ర్యాలీలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ @MamataOfficial బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం త్వరలోనే పోతుందని వ్యాఖ్యానించారు. రామజన్మభూమి నిధులు, వక్ఫ్ ఆస్తుల దోపిడీకి గురవుతున్నాయని ఆరోపించారు.
సొంతంగా పార్టీ సంస్థాగత బలం లేకపోవడంతోనే బీజేపీ పోలీసులను పార్టీ పనుల కోసం ఉపయోగించుకుంటోందని మమతా బెనర్జీ విమర్శించారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు.
#MamataBanerjee #INDIABloc #BJP #RamlilaMaidan
శుభకార్యానికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల.. అల్వాల్‌లో 29 తులాల బంగారం చోరీ
హైదరాబాద్ అల్వాల్‌లోని జానకి నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. ఇంటికి తాళాలు వేసి ఉండటాన్ని గమనించిన దుండగుడు తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డాడు. 29 తులాల బంగారం, 28 తులాల వెండి, రూ.1.5 లక్షల నగదును అపహరించాడు.
దమ్మాయిగూడలో శుభకార్యానికి వెళ్లిన కుటుంబం తిరిగొచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం అల్వాల్ పోలీసులు గాలిస్తున్నారు.
#Alwal #HyderabadCrime #HouseTheft #Telangana
చిత్తూరులో దొంగ ఓటు కలకలం.. తమిళనాడుకు చెందిన యువతిని గుర్తించిన వైసీపీ అభ్యర్థి
చిత్తూరులోని 44వ వార్డు రాంనగర్ కాలనీలో కేశవరెడ్డి స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓటు వేసేందుకు వచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడుకు చెందిన యువతిని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి హరీషారెడ్డి గుర్తించారు.
తమిళనాడుకు చెందిన వారితో కూటమి దొంగ ఓట్లు వేయిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద కలకలం నెలకొంది.
#Chittoor #YSRCP #FakeVotes #AndhraPradesh
వరంగల్ ట్రైసిటీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. చల్లబడిన వాతావరణం
#Warangal #Hanamkonda #Kazipet #WarangalRains
పెళ్లి మండపం నుంచి నేరుగా పోలింగ్ బూత్‌కు.. నవ దంపతుల ఓటు హక్కు
పుట్టపర్తిలో మున్సిపల్ ఎన్నికల వేళ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వివాహం జరిగిన కాసేపటికే నవ దంపతులు నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.
పెళ్లి దుస్తుల్లోనే ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతను చాటిచెప్పిన నవ దంపతుల తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.
#Puttaparthi #MunicipalElections #VoteForDemocracy #AndhraPradesh









