Mummareddy Prema Kumar (@mummareddyjsp) header
Mummareddy Prema Kumar (@mummareddyjsp) profile picture

Politician JanaSena Leader | Kukatpally Incharge Serving with Purpose 🇮🇳 For the People. With the People.

Hyderabad
Joined August 2023
ఇచ్చేదే గుక్కెడు నీళ్ళు అవికూడా దుర్వాసన తో కూడిన మురుగు నీరు జనసేన నాయకులు:కొల్లా శంకర్ కేపీహెబి 4వ ఫేస్ గత కొన్ని నెలలుగా వేధిస్తున్న తాగునీటి సమస్యపై ఎల్ఐజి కాలనీవాసులు *జనసేన కూకట్పల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్* గారి దృష్టికి వారి యొక్క త్రాగునీటి సమస్యను తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రేమకుమార్ గారి సూచనలు మేరకు జనసేన పార్టీ కూకట్పల్లి కోఆర్డినేటర్ కొల్లాశంకర్ ఈ రోజు తాగునీటి సమస్యపై స్థానిక ప్రజలతో కలిసి వాటర్ బోర్డు DGM త్రినాథరావు గారిని కలిశారు. ​ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను జనసేన నాయకులు కొల్లా శంకర్ వివరిస్తూ తాగునీటిలో మురుగునీరు కలవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారాని నీటి సరఫరా ప్రారంభమైన 30 నిమిషాల్లో మొదటి 10 నిమిషాలు కలుషితమైన మురికినీరే వస్తోందని, ఆ తర్వాతే మంచి నీరు వస్తుందని,స్థానిక ప్రజలు అనారోగ్యానికి పాల్పడుతున్నారని, ప్రజల ఆరోగ్యం పై దృష్టి సారించాలని ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని త్రినాథరావు గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ తీవ్రమైన సమస్యపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు. ​జనసేన నాయకులు తెలిపిన సమస్యపై శ్రీ త్రినాథరావు గారు తక్షణమే సానుకూలంగా స్పందించారు. నెల రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అదే విధంగా, స్థానిక ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని, తాగునీటిని వృథా చేయవద్దని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆళ్ల నరేంద్ర ,పుప్పాల అంజి ,దాసరి వెంకట్ మరియు కాలనీ మహిళలు పాల్గొన్నారు... @JSPTelangana
1
3
32
382
అందరికీ దీపావళి శుభాకాంక్షలు! ✨🪔 ​చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండగ దీపావళి. ఈ పండగ ప్రతి ఇంటా ఆనంద సిరులను కురిపించాలని మనసారా కోరుకుంటున్నాను. ​ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోదాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ... ​ఇట్లు, ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జనసేన జాయినింగ్ కమిటీ కన్వీనర్, కూకట్ పల్లి నియోజకవర్గం, జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే.
3
9
177
హైదరాబాదుకు చెందిన ప్రముఖులు వి. శ్రీనివాస్ (కుత్భుల్లాపూర్ నియోజకవర్గం 3 వ డివిజన్), ఎన్. శ్రీధర్ రావు (మేడ్చల్ నియోజకవర్గం 298 వ డివిజన్), కోటిపల్లి దుర్గా (దేవేంద్ర నగర్ 225 డివిజన్) జనసేన పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్ళి శ్రీ రామ్ తాళ్ళూరి, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ప్రచార కార్యదర్శి శ్రీ ఆర్.కె. సాగర్, వీర మహిళా నాయకురాలు శ్రీమతి మండపాక కావ్య పాల్గొన్నారు. @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam @mummareddyjsp @JSPTelangana
17
71
815
*కేపీహెచ్‌బీ కాలనీలో ప్రభుత్వ వేలం పాటలను తక్షణమే నిలిపివేయాలి: నిరసన ర్యాలీలో ముమ్మారెడ్డి ప్రేమ కుమార్* ​ కేపీహెచ్‌బీ కాలనీ లో ప్రభుత్వం చేపడుతున్న స్థలాల వేలం పాటలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జాయింట్ కమిటీ కన్వీనర్ మరియు కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారి నాయకత్వంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి ప్రభుత్వ స్థలాలను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ​ఈ సందర్భంగా ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారు మాట్లాడుతూ.. స్థానిక ప్రజల అవసరాలకు కోసం సేకరించిన ఫిష్ మార్కెట్ పక్కన ఉన్నా స్థలం మరియు ట్రక్ పార్క్ స్థలాన్ని మరియు పబ్లిక్ పార్కులు, ఆసుపత్రులు, పాఠశాలలు, పెట్రోల్ బంక్ కి కేటాయించినటువంటి ప్రజా ఉపయోగకరమైన పనులకు వినియోగించాల్సిన స్థలాలను ప్రభుత్వం వేలం పేరిట విక్రయించడం సరికాదన్నారు. ప్రజా ఆస్తులను కాపాడటమే ధ్యేయంగా తమ పోరాటం కొనసాగుతుందని, వేలం ప్రక్రియను రద్దు చేసే వరకు నిరసనలు ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ​ఈ నిరసన ర్యాలీ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ మద్దతు తెలిపారు.​ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వేలం పాటల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో కాలనీ వాసులు మరియు కాలనీ సంఘాలతో కలిసి వేలం పాట ఆపుతామని, ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజక జనసేన నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్, బోగాది వెంకటేశ్వర్ రావు, నాగేంద్ర, పండుగ సూర్య, అశోక్ మాదాసు,డి.వెంకట్, శ్రీనివాస్ గోవింద్, అంజి, పవన్, ప్రసన్న ఆంజనేయులు,సుదర్శన్, రాము, ప్రసాద్ నాయుడు, మురళి, ప్రసాద్, శివశంకర్,శేకర్, గోపి, నీరజ్ తదితరులు పాల్గొన్నారు @JSPTelangana @itsRamTalluri @PawanKalyan
జనసేన పార్టీ పిలుపు – కేపీహెచ్‌బీలో నిరసన కార్యక్రమం ​కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై జనసేన సమరభేరి! ​కేపీహెచ్‌బీ (KPHB) ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న వేలంపాటలను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించబడుతోంది. ​ఈ నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జనసేన పార్టీ జాయినింగ్ కమిటీ కన్వీనర్ శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు పిలుపునిచ్చారు. ​ కావున జనసేన నాయకులు , వీర మహిళలలు అందరూ రేపు అనగా 07.11.2026 ఉదయం 8:30 గంటలకు కేపీహెచ్‌బీ 5th ఫేస్ (KPHB 5th Phase) నందు గల జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ​ఇట్లు, ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ కన్వీనర్ - జాయినింగ్ కమిటీ, జనసేన పార్టీ. @JSPTelangana @itsRamTalluri
1
13
53
558
జనసేన పార్టీ పిలుపు – కేపీహెచ్‌బీలో నిరసన కార్యక్రమం ​కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై జనసేన సమరభేరి! ​కేపీహెచ్‌బీ (KPHB) ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న వేలంపాటలను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించబడుతోంది. ​ఈ నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జనసేన పార్టీ జాయినింగ్ కమిటీ కన్వీనర్ శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు పిలుపునిచ్చారు. ​ కావున జనసేన నాయకులు , వీర మహిళలలు అందరూ రేపు అనగా 07.11.2026 ఉదయం 8:30 గంటలకు కేపీహెచ్‌బీ 5th ఫేస్ (KPHB 5th Phase) నందు గల జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ​ఇట్లు, ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ కన్వీనర్ - జాయినింగ్ కమిటీ, జనసేన పార్టీ. @JSPTelangana @itsRamTalluri
36
1
71
1,240
*బస్తీ దావఖానాలో వైద్య సిబ్బంది లేరాయే .. పేద ప్రజలకు వైద్యం కరువాయే జనసేన నాయకులు: కొల్లా శంకర్* కెపిహెచ్‌బి 4వ ఫేజ్ బస్తీ దవాఖానలో ఎదురవుతున్న తీవ్ర ఆరోగ్య సమస్యలు, వైద్య సేవల లోపంపై స్థానిక ప్రజలు మరియు జనసేన నాయకులు ఆళ్ల నరేంద్ర గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేడు కూకట్‌పల్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్ *కొల్లా శంకర్,* జనసైనికులతో కలిసి బస్తీ దవాఖానను నేరుగా సందర్శించడం జరిగింది. ​ఈ సందర్భంగా దవాఖానలోని సిబ్బందితో మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితులను ఆరా తీశారు. గత 4 నెలలుగా దవాఖానలో డాక్టర్ లేకపోవడం, అలాగే సబ్-నర్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. ​ఈ సందర్భంగా కొల్లా శంకర్ మాట్లాడుతూ: ​"ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాల్సిన బస్తీ దవాఖానలో గత నాలుగు నెలలుగా వైద్యులు లేకపోవడం, అత్యవసర పరిస్థితిలో ప్రధమ చికిత్స చేసే స్థాయి సిబ్బంది కూడా లేకపోవడం విచారకరమని తెలియజేసారు. వైద్య వృత్తిపై అవగాహన లేని ఒక మహిళను దావఖానాలో సహాయ సిబ్బందిగా పెట్టుకోవడం బాధాకరమని తెలియజేసారు. పేద ప్రజల ఆరోగ్య విషయంలో అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యంపై ఆగ్రహిస్తూ అధికారులు తక్షణమే స్పందించి కెపిహెచ్‌బి 4వ ఫేజ్ బస్తీ దవాఖానకు పూర్తి స్థాయి డాక్టర్‌ను మరియు సబ్-నర్స్‌ను నియమించి, ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేకపోతే జనసేన పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేసారు ." ​ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాస్ గోవింద, పాదం సూర్య, నీరజ్ కుమార్, గోపికృష్ణ మరియు జనసైనికులు పాల్గొన్నారు. @JSPTelangana @itsRamTalluri @PawanKalyan
8
23
310
తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో ఆర్గనైజింగ్ సెక్రటర, ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారు, రాష్ట్ర నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు .
9
58
543
జనసేన తెలంగాణ ‘అలయ్ బలయ్’ ప్రారంభం జనసేన తెలంగాణ ‘అలయ్ బలయ్’ ఆత్మీయ సమ్మేళనం హైద్రాబాదులోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమైంది. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నరు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్ళూరి, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, ప్రచార కార్యదర్శి శ్రీ ఆర్.కె. సాగర్ అతిథులుగా హాజరయ్యారు. జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం, రానున్న ఎన్నికలకు సన్నద్ధత లక్ష్యంగా, పార్టీలో నూతనంగా చేరిన నాయకులకు స్వాగతం పలకడం, వారిని సమావేశానికి పరిచయం చేయడం, పార్టీ బలోపేతంలో వారి పాత్ర, బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం, జానపద కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్ర సంస్రృతిని చాటి చెప్పాలనేది ‘అలయ్ బలయ్’ ప్రధాన ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలోనే అతిథుల ప్రసంగాలు కొనసాగుతున్నాయి.
18
100
824
*కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ కు పార్కుల దుస్థితిపై వినతి పత్రం ఇచ్చిన : జనసేన నాయకులు* ఈ రోజు కేపిహెచ్ బి నాలుగవ ఫేస్‌లోని పార్కులు సరైన నిర్వహణ లేక పూర్తిగా నిర్వీర్యంగా మారాయని పార్కులలో పిచ్చిమొక్కలు పెరిగిపోవడం, చెత్తాచెదారంతో నిండిపోవడంతో పారిశుద్ధ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని పిచ్చిమొక్కల కారణంగా పాముల బెడద తీవ్రమైందని, కేవలం రాత్రి వేళల్లోనే కాకుండా పగటిపూట కూడా పాములు సంచరిస్తూ చుట్టుపక్కల ఇళ్లలోకి వస్తున్నాయని దీని వలన కాలనీవాసులు ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, అంతేకాకుండా, పార్కుల సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల తాగుబోతులకు అడ్డాగా మారాయని కాలనీ వాసుల నుండి జనసేన నాయకులకు తెలియజేయడం వలన కాలనీవాసుల భద్రత మరియు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, జీహెచ్‌ఎంసీ అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతూ కాలనీ వాసుల తరుపున కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ గారికి జనసేన నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు వివరించిన సమస్యలను జోనల్ కమిషనర్ శ్రీ మయాంక్ సింగ్ గారు సానుకూలంగా స్వీకరించారు, కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందిస్తూ, సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, ఆళ్ల నరేంద్ర, పోలేబోయిన శ్రీనివాస్ గోవిందా, పి.గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. @JSPTelangana @itsRamTalluri @PawanKalyan
2
18
250
నల్గొండ జిల్లా జనసేన నాయకుల సమీక్ష సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మరియు ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు మరియు రాష్ట్ర నాయకులు నల్గొండ జిల్లా జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. @JSPTelangana @drgsrao @itsRamTalluri @PawanKalyan
నల్గొండలోని హోటల్ విస్టా గ్రాండ్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ నల్గొండ జిల్లా సమీక్ష సమావేశం రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో జనసేన పార్టీకి బలమైన పునాది ఉందని, రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, ఎన్నికల ప్రచారాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని నాయకులు, వీర మహిళలు, జనసైనికులకు పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తూ, అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేసి, జనసేన పార్టీ అభ్యర్థి విజయానికి కట్టుబడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యుడు ప్రజిత్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధులు మిరియాల రామకృష్ణ, సాంబశివుడు, రాష్ట్ర నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్, కార్తీక్‌తో పాటు మునుగోడు, నకిరేకల్, మిర్యాలగూడ, నల్గొండ, దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల నాయకులు, జిల్లా నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు. @JSPTelangana @PawanKalyan @itsRamTalluri @drgsrao @JSPShatagniTeam @mummareddyjsp #mlcelectioncampaign
8
36
383
నల్గొండలోని హోటల్ విస్టా గ్రాండ్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ నల్గొండ జిల్లా సమీక్ష సమావేశం రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో జనసేన పార్టీకి బలమైన పునాది ఉందని, రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, ఎన్నికల ప్రచారాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని నాయకులు, వీర మహిళలు, జనసైనికులకు పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తూ, అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేసి, జనసేన పార్టీ అభ్యర్థి విజయానికి కట్టుబడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యుడు ప్రజిత్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధులు మిరియాల రామకృష్ణ, సాంబశివుడు, రాష్ట్ర నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్, కార్తీక్‌తో పాటు మునుగోడు, నకిరేకల్, మిర్యాలగూడ, నల్గొండ, దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల నాయకులు, జిల్లా నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు. @JSPTelangana @PawanKalyan @itsRamTalluri @drgsrao @JSPShatagniTeam @mummareddyjsp #mlcelectioncampaign
2
1
13
566
Mummareddy Prema Kumar retweeted
బియ్యం ధరలు ఆకాశంలో.. బ్లాక్ మార్కెటింగ్ పై మంత్రి ఉత్తమ్ స్పందించాలి - జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ @revanth_anumula @UttamINC @DirectorAgriTS #CongressFailedTelangana
1
35
1
90
1,381
శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు: ప్రేమకుమార్* కూకట్ పల్లి నియోజకవర్గం మోతినగర్ లో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థాన ఆలయ ప్రాంగణంలో *శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ* మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ​ఈ కార్యక్రమానికి దేవాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు *జనసేన రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్* గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆలయ ఈఓ నరేందరరెడ్డి రాఘవేంద్రరావు ప్రేమ కుమార్ గారిని పూలమాలతో మరియు శాలువా తో సత్కరించడం జరిగింది. ​ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని శబరిమల మేల్‌శాంతి మాలిగ పురోత్తమ దేవాలయం బ్రహ్మశ్రీ పి.జి. మురళి నంబూద్రి గారి దివ్య సమక్షంలో, వేదమంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, బడే విశ్వేశరరావు, చిట్టి బాబు, రామకృష్ణ మరియు ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. @JSPTelangana @itsRamTalluri @PawanKalyan
4
31
365
GHMC, MMC, CMC ఎన్నికలతో పాటు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సైతం జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు గారిని ప్రకటించడం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుండి కీలకమైన నాయకులు జనసేనలో చేరుతున్నారు. ప్రతి డివిజన్ పరిధిలో స్థానికంగా నాయకులు పార్టీని బలపరుచుకుంటూ ముందుకు సాగాలి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ఆదరణ పొందిన నాయకులకు పోటీలో నిలబడే అవకాశం దక్కుతుంది. -జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ శ్రీ మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్. #GHMCElections #JanaSenaTelangana #JSPForTelangana @JSPTelangana @itsRamTalluri @PawanKalyan
21
110
1,158
Mummareddy Prema Kumar retweeted
GHMC, MMC, CMC ఎన్నికలతో పాటు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సైతం జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు గారిని ప్రకటించడం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుండి కీలకమైన నాయకులు జనసేనలో చేరుతున్నారు. ప్రతి డివిజన్ పరిధిలో స్థానికంగా నాయకులు పార్టీని బలపరుచుకుంటూ ముందుకు సాగాలి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ఆదరణ పొందిన నాయకులకు పోటీలో నిలబడే అవకాశం దక్కుతుంది. -జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ శ్రీ మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్. #GHMCElections #JanaSenaTelangana #JSPForTelangana
110
1
412
3,154