
Author | Isuka Addam • Balkaav • Sikka • Amarandame Prema Historophile with a vintage soul Development Sector | Govt. of Telangana | #కాఫీతాగారా
Joined June 2023
- Tweets75
- Following31
- Followers60
- Likes146
Pinned Tweet
You may write me down in history
With your bitter, twisted lies,
You may trod me in the very dirt
But still, like dust, I'll rise.
Just like moons and like suns,
With the certainty of tides,
Just like hopes springing high,
Still I'll rise.
from Maya Angelou's, "Still I Rise"
1
550
Sri Uha S retweeted
హైదరాబాద్ ఈ నవలలో కేవలం కథాస్థలం కాదు. చార్మినార్, గోల్కొండ, తారామతి బారాదరి, రవీంద్రభారతి, నీలోఫర్, నిమ్రా కేఫ్, ఇరానీ చాయ్, బన్ మస్కా కథనంలో భాగమవుతాయి. మేఘనాథ్‌కు నగరం చారిత్రక అనుభవం. ఆశ్లిష్టకు భావోద్వేగ అనుభవం. -ప్రసేన్(రచయిత)
Order your Copy amzn.in/d/0a7q2H7N
#amaranandameprema
Available on Amazon
amzn.in/d/0bzKxDC0
📷Qila Khammam
Sri Uha S retweeted
రచయిత్రి శ్రీఊహ గారు రాసిన పుస్తకాలను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి చదవండి.
#Isukaadham #balkaav #sikka #amaranandameprema #sriuha
ఇది కాళిదాసు 'మేఘమాక్లిష్ట సానుం' కావచ్చు. కానీ కొండను తాకిన మేఘం కథ మాత్రమే కాదు. విడిపోయినా ఒకరి ఆకాశాన్ని మరొకరు వదలలేని రెండు జీవితాల కథ.
#amarandameprema available at:
Akshara Books
Plot no, 60A, Road No.70, Journalist Colony, Jubilee Hills, Hyd
New Vishalandhra Book Centre
Metro Pillar No, C-1486, 8-3-318/6/B/3, Yousufguda Main Rd, opp. Sri Chaitanya High School, Madhura Nagar, Hyd
Navodaya Book House
Amazon
The first review of #amaranandameprema is out.
Grab your copy now
amzn.in/d/068CyxD5
హైదరాబాద్ ఈ నవలలో కేవలం కథాస్థలం కాదు. చార్మినార్, గోల్కొండ, తారామతి బారాదరి, రవీంద్రభారతి, నీలోఫర్, నిమ్రా కేఫ్, ఇరానీ చాయ్, బన్ మస్కా కథనంలో భాగమవుతాయి. మేఘనాథ్‌కు నగరం చారిత్రక అనుభవం. ఆశ్లిష్టకు భావోద్వేగ అనుభవం. -ప్రసేన్(రచయిత)
Order your Copy amzn.in/d/0a7q2H7N
🫶
Although I was part of publishing close to 250 books, these books gave me immense satisfaction.
I translated @baradwajrangan's Conversation with Maniratnam into Telugu as మణిరత్నం సినిమాలు - సందర్భాలు.
I was part of editing KV Anudeep 's #LifeIsBeautiful and learnt lot of new things about various things on food, sleep and habits.
I was one of the first readers of @nameisuha's అమరానందమే ప్రేమ and I also wrote the foreword for the novel.
All the books are/will be available at amazon.in/anvikshikipublishe…
1
3
103
Amarandame Prema now on Amazon.
Order your copy now🫶
ఈ కాలానికి అవసరమైన ప్రేమ
తెలుగులో మంచి ప్రేమ నవల చదివి చాలా కాలమైంది. అసలు తెలుగులో ప్రేమనే వస్తువుగా చేసుకున్న నవలలేవీ ఉత్తమ నవలల తొలి వరసలో లేవు. ఏ తెలుగు విమర్శకుడిని, పండితుడినీ అత్యుత్తమ తెలుగు నవలల్ని చెప్పమన్నా ‘మాలపల్లి, అల్పజీవి, అసమర్థుని జీవయాత్ర, వేయిపడగలు, చివరకు మిగిలేది...’ ఇలా వల్లె వేస్తూంటారు. ఏ ఒక్క తొలివరస నవలల జాబితాలోనూ ప్రేమకథ ఉండదు. అది వారి తప్పు కాదు; అసలు మన రచయితలే గొప్ప ప్రేమ నవలలు రాయలేదని నాకనిపిస్తోంది. ఇతర భాషలను చూసినపుడు రష్యన్లో ఉత్తమ నవలల్లో ‘అన్నా కెరెనినా’, ఇంగ్లీష్‌లో ‘ప్రైడ్ అండ్ ప్రెజుడిస్’, ఫ్రెంచిలో ‘మదామ్ బొవేరీ’, బెంగాలీలో ‘దేవదాసు’ తప్పక ఉంటాయి. కానీ ప్రేమ వస్తువుగా వచ్చిన గొప్ప నవలలు తెలుగులో కనిపించడం కష్టమే. చటుక్కున అడిగితే ఒక్కటి కూడా తోచదు. సులోచనారాణి పుణ్యమాని ‘సెక్రటరీ’ ఆ కొరతని కొంత తీర్చింది. దాన్ని కాల్పనిక నవల, ఊహల పల్లకి, అసత్యాలు ప్రచారం చేసే నవల, ఆడవాళ్లను తప్పుదోవ పట్టించే నవల అంటూ కొట్టి పారేశారు గానీ, నిజానికి అది వేర్వేరు సామాజిక, ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చిన అబ్బాయి, అమ్మాయిల మధ్య నడిచిన చక్కని ప్రేమ కథ.
ఇటీవల కొందరు యువరచయితలు మళ్లీ ప్రేమను చిగురింపజేయాలనుకోవడం మెచ్చుకోవాల్సిన విషయం. ఇప్పుడు శ్రీ ఊహ రాసిన ఈ నవల ఒక మంచి ప్రేమ కథ. ఇది ఊహల్లో విహరించే ప్రేమ కథ కాదు; ప్రేమలో శారీరక ఆకర్షణే ముఖ్యమని చెప్పే ప్రేమ కథ కాదు. యువతీయువకుల మధ్య ప్రేమ బలపడ్డానికి వాళ్లిద్దరి మధ్యా శారీరక సంబంధం ఏర్పడి తీరాలని చెప్పే ప్రేమ కథ అసలే కాదు. అందుకే ఇది మంచి ప్రేమ కథ. జీవితం పట్ల, సమాజం పట్ల, మానవసంబంధాల పట్ల, వ్యక్తిగత ఆకాంక్షల పట్ల అవగాహన ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచే ప్రేమ కథ. నవల చదివాక, నిజంగా అబ్బాయిలు, అమ్మాయిలు ఇలా ఉన్నారా ఇప్పుడు అనే అనుమానం కంటే, ఇలా కదా ఉండాలి! అని ఆశను చిగురింపజేసే కథ. -- మృణాళిని
Order your copy now: amazon.in/dp/9348912437
Sri Uha S retweeted
ఎనభైలు, తొంభైలలో పెరిగిన మా తరం కుర్రాళ్లందరిలాగే నేను కూడా మణిరత్నం సినిమాలకు పెద్ద అభిమానిని. ఈ పుస్తకంలో భరద్వాజ్ రంగన్ రాసినట్టు ఆయన కేవలం సినిమాలు తీసిన దర్శకుడు మాత్రమే కాదు, మా తరం ఆలోచనలను, కలలను తెర మీద బొమ్మలుగా గీసిన మాంత్రికుడు. ముఖ్యంగా 1989లో వచ్చిన 'గీతాంజలి' సినిమా నా జీవితంలో ఒక పెద్ద మలుపు. అప్పటివరకూ నేను సినిమాలు చూసే విధానాన్ని ఆ సినిమా పూర్తిగా మార్చేసింది. అసలు నాలో సినిమా మీద ఇంత ప్రేమ పుట్టడానికి, ఫిల్మ్ మేకింగ్ వైపు అడుగులు వేయడానికి ఆ సినిమానే మెయిన్ కారణం అనుకుంటా. ఆ తర్వాత వచ్చిన 'బొంబాయి' సినిమాని అయితే నేను ముప్పై సార్లకు పైగా చూసుంటాను. మణిరత్నం ఫ్రేమ్స్, ఇళయరాజా, రెహ్మాన్‌ల మ్యూజిక్, పి.సి. శ్రీరామ్ కెమెరా పనితనం... ఇవన్నీ మా తరానికి సినిమా అంటే ఏంటో కొత్తగా నేర్పించాయి.
గీతాంజలి సినిమా నాకు కేవలం ఒక గొప్ప సినిమా మాత్రమే కాదు, నా సొంత జీవితంలో కష్ట సమయాలు ఎదురైనప్పుడల్లా నాకు బతకడం మీద ఆశని, ధైర్యాన్ని ఇచ్చిన సినిమా అది. ముఖ్యంగా అందులో గిరిజ వేసిన గీతాంజలి క్యారెక్టర్, చావు ఎదురుగా ఉన్నా సరే జీవితాన్ని అంత హుషారుగా, చిరునవ్వుతో ప్రేమించే ఆ అమ్మాయి పాత్ర నా మనసులో బలంగా ముద్రపడిపోయింది. ఆ పాత్ర మీద ఉన్న ఇష్టంతో, అసలు గిరిజని జీవితంలో ఒక్కసారైనా స్వయంగా కలవాలని నాకు బలమైన కోరిక ఉండేది.
తర్వాత నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ యూకేలో ఉంటున్న రోజుల్లో, గిరిజ కూడా యూకేలోనే ఉంటున్నారని ఏవో ఇంటర్నెట్ ఫోరమ్స్‌లో చదివాను. ఎలాగైనా ఆమెను కలవాలనే పట్టుదలతో కష్టపడి ఆమె ఈమెయిల్ ఐడీ సంపాదించాను. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని పర్మిషన్ అడుగుతూ ఒక మెయిల్ పెట్టాను. అదృష్టవశాత్తూ ఆమె ఒప్పుకున్నారు. ఆ తర్వాత మేము చాలాసార్లు కలిశాం, కలిసి ఆర్ట్ షోలకు వెళ్లాం, గంటల తరబడి కూర్చుని బోలెడు కథలు మాట్లాడుకున్నాం. మన టీవీ ఛానెళ్లు, మీడియా వాళ్లు ఆమె ఎక్కడున్నారో కనిపెట్టి ఇంటర్వ్యూలు చేయడానికి చాలా కాలం ముందే ఇదంతా జరిగింది. నాకు ఇష్టమైన పాత్రకు ప్రాణం పోసిన మనిషితో అలా గడిపిన ఆ రోజులు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు.
యూకేలో ఉన్న ఆ రోజుల్లోనే సినిమా మీద ఇష్టంతో ప్యాషన్ ఫర్ సినిమా అనే బ్లాగ్‌లో వ్యాసాలు రాస్తుండేవాడిని. 2007లో మణిరత్నం గురు సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో, ఆయన మొదటి సినిమా పల్లవి అనుపల్లవి నుంచి ఇద్దరు దాకా ఆయన సినిమాలన్నిటినీ విశ్లేషిస్తూ ఇరవై ఐదు పేజీల ఒక పెద్ద వ్యాసం రాసి ఆ బ్లాగ్‌లో పెట్టాను. ఆ వ్యాసం చదివి, స్వయంగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆ బ్లాగ్ పోస్ట్ కింద కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ చూసినప్పుడు నాకు కలిగిన కిక్ అంతా ఇంతా కాదు.
ఆ తర్వాత నా జీవితంలో జరిగిన మరో అద్భుతమైన కోఇన్సిడెన్స్ ఏంటంటే, 2013 ఫిబ్రవరి 1న మణిరత్నం కడలి సినిమా రిలీజ్ అయింది. సరిగ్గా అదే రోజున నా మొదటి సినిమా కూడా రిలీజ్ అయింది. మరుసటి రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ తెరిచి చూస్తే, సినిమా రివ్యూల పేజీలో మణిరత్నం 'కడల్' రివ్యూ పక్కనే నా మొదటి సినిమా రివ్యూ కూడా అచ్చయింది! ఏ దర్శకుడినైతే ఆరాధిస్తూ నేను సినిమాల్లోకి వచ్చానో, ఆయన సినిమా రివ్యూ పక్కనే నా సినిమా రివ్యూ కనిపించడం చూసి ఆ రోజు నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది.
యూకే నుంచి ఇండియాకి తిరిగి వచ్చి సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలనుకున్నప్పుడు నా గోల్ కేవలం సినిమాలు తీయడం మాత్రమే కాదు. సినిమా మేకింగ్‌లోని దాదాపు అన్ని విభాగాల్లోనూ పనిచేస్తూనే, తెలుగులో సాహిత్యానికీ, సినిమాకీ మధ్య ఉన్న గ్యాప్ తగ్గించాలని నేను ఎప్పుడూ బలంగా కోరుకునేవాడిని. ఆ ఆలోచనతోనే ఫ్రెండ్స్‌తో కలిసి తెలుగులో 'నవతరంగం' అనే ఫిల్మ్ క్రిటిసిజం వెబ్సైట్ మొదలుపెట్టాను. అలాగే సత్యజిత్ రే రాసిన Our Films, Their Films పుస్తకాన్ని తెలుగులోకి అనువదించడంతో నా పబ్లిషింగ్ ప్రయాణం మొదలైంది.
అదే ప్రయాణంలో మేము 'అన్వీక్షికి పబ్లిషర్స్' స్థాపించాక, భరద్వాజ్ రంగన్ రాసిన ఈ Conversations with Mani Ratnam పుస్తకాన్ని కచ్చితంగా తెలుగులోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యాం. నిజానికి ఈ పనిని ఎవరైనా మంచి అనువాదకులకు అప్పగిద్దామని నేను చాలా ప్రయత్నించాను. కానీ ఈ పుస్తకానికి పూర్తి న్యాయం చేయగల మనుషులు నాకు దొరకలేదు. ఎందుకంటే ఇది కేవలం ఇంగ్లీష్ వాక్యాలను తెలుగులోకి మార్చే మామూలు అనువాదం కాదు. ఇది పూర్తిగా ఫిల్మ్ మేకింగ్ గురించిన పుస్తకం. స్క్రిప్ట్ రాయడం, కెమెరా యాంగిల్స్, లెన్సింగ్, ఎడిటింగ్ కట్స్, సౌండ్ మిక్సింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోరింగ్... ఇలా సినిమా క్రాఫ్ట్ మీద లోతైన అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే దీన్ని అనువదించగలరు. దాంతో చివరికి ఆ బాధ్యతను నేనే నా భుజాల మీద వేసుకున్నాను.
ఇంత పెద్ద పుస్తకాన్ని అనువదించడం అంత సులభంగా ఏమీ జరగలేదు. వేరే పనుల ఒత్తిడి వల్ల, ఇది చాలా కష్టమైన పని అవ్వడం వల్ల మధ్యలో ఎన్నోసార్లు పక్కనపెట్టేశాను, ఇక నావల్ల కాదేమో అని వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మణిరత్నం సినిమాల మీద ఉన్న ప్రేమ నన్ను మళ్లీ మళ్లీ ఈ పుస్తకం దగ్గరికి లాక్కొచ్చింది. ఇన్నాళ్లకు ఈ పని పూర్తయినందుకు నాకు కేవలం సంతోషంగా మాత్రమే కాదు, ఎంతో గర్వంగా, ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఎందుకంటే ఇది మార్కెట్లోకి వచ్చే మరో మామూలు పుస్తకం కాదు. సినిమాని ప్రేమించే వాళ్లకి, సినిమా తీయాలనుకునే వాళ్లకి ఇదొక ఫిల్మ్ స్కూల్. ఎంత కాలం గడిచినా చరిత్రలోఎప్పటికీ నిలిచిపోయే పుస్తకం ఇది. మణిరత్నం సినిమాల ప్రయాణాన్ని తెలుగు పాఠకుల చేతుల్లో పెడుతున్నందుకు మనస్ఫూర్తిగా ఆనందిస్తూ... వెంకట్ శిద్దారెడ్డి.
Some moments are too precious for words. Tomorrow is one such moment for me.
‘అమరానందమే ప్రేమ’ is more than a book; it carries a piece of my heart, countless emotions & a journey I can't wait to share with you.
Join me as I celebrate this special milestone.
#AmaranandamePrema
సరిగమపదని – A Full Circle
అక్షరాలతో మొదలైన ప్రయాణం మరో అందమైన మజిలీకి చేరుకుంటోంది. నా తొలి నవల ‘అమరానందమే ప్రేమ’ రేపు మీ ముందుకు రాబోతోంది.
ప్రేమ, అనుబంధాల సమాహారమైన ఈ కథను మీతో పంచుకోవడం ప్రత్యేకం.
ఈ ప్రయాణంలో మీ ప్రేమ తోడుగా ఉండాలని కోరుకుంటూ, రేపు కలుద్దాం
#అమరానందమేప్రేమ
Thank you @vrsiddareddy garu
ఊహ రాసిన 'అమరానందమే ప్రేమ' నవల ప్రమోషన్ కోసం రీల్ చేద్దామని 'ప్రేమ' సినిమాలోని పాటలన్నీ వెతికినా, ఈ లైన్ ఉన్న పాట ఎంతకీ దొరకలేదు. అసలు ఈ వాక్యం ఎక్కడుందా అని ఇంకొంచెం లోతుగా వెతికితే, అది 'ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు' పాటలోని రెండో చరణంలో కనిపించింది. హుషారైన పెప్పీ ట్యూన్‌తో మొదలయ్యే ఆ పాటలో, "ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ" లాంటి లోతైన సాహిత్యం కానీ, అంతటి గాంభీర్యం ఉన్న ట్యూన్ కానీ వస్తాయని మనం అస్సలు ఊహించం. ఇవాళ కారులో మళ్లీ ఆ పాట వింటుంటే నేనే కాదు, నాతో పాటు ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోయారు.
అచ్చం ఆ పాటలాగే, ఎంతో లోతైన సాహితీ విలువలతో ఒక గొప్ప ప్రేమకథను చెప్పొచ్చని, ఇద్దరు యువతీయువకుల ప్రేమను స్వచ్ఛమైన లిటరరీ ఫిక్షన్‌గా మలచవచ్చని నిరూపించిన నవల తెలుగులో ఇంతవరకూ రాలేదు. ఆ రకంగా ఈ నవలకు 'అమరానందమే ప్రేమ' అనే టైటిల్ నూటికి నూరు శాతం న్యాయం చేసిందనే చెప్పాలి.
రేపే విడుదల: #అమరానందమేప్రేమ
1
40
అమరానందమే ప్రేమ నవల కోసం వెంకట్ గారు రాసిన ముందుమాట.
Thank you, @vrsiddareddy garu
#UhaWrites #AmaranandamePrema
పర్వతాన్ని తాకిన మేఘం
----*-----
ప్రముఖ తత్వవేత్త పాల్ టిల్లిచ్ "ప్రేమకు మొదటి కర్తవ్యం వినడం" అంటారు. ఆధునిక ప్రపంచంలో అందరూ తమ గురించి తాము చెప్పుకోవాలనే ఆరాటంలోనే ఉంటారు తప్ప, ఎదుటివారి మనసులోని అల్లకల్లోలాన్ని, వారి అంతరంగపు ఘర్షణను ఎలాంటి తీర్పులు ఇవ్వకుండా ఓపికగా వినేవాళ్లు చాలా అరుదు. వినడం అంటే కేవలం ఎదుటివారి మాటలను గ్రహించడం మాత్రమే కాదు, వారి బాధను పంచుకునేలా మన ఆలోచనలను పక్కనపెట్టి మౌనం వహించడం. ఒకరు తమ గుండె భారాన్ని దించుకుంటున్నప్పుడు, ఏ సలహాలూ ఇవ్వకుండా, 'నేను నీ కోసం ఇక్కడ ఉన్నాను' అని పక్కన నిలబడే ఆ నిశ్శబ్దమే బహుశా అన్నిటికంటే గొప్ప ప్రేమ. మాటల్లో చెప్పే ఆర్భాటం కన్నా, అవసరమైనప్పుడు మౌనంగా తోడుండే ఆ ఆసరాలోనే ప్రేమ తన అసలైన స్వచ్ఛతను సంతరించుకుంటుంది. సరిగ్గా ఈ భావననే అత్యంత సహజంగా అక్షరబద్ధం చేసిన నవల శ్రీ ఊహ రాసిన 'అమరానందమే ప్రేమ'.
తెలుగు సాహిత్యంలో ప్రేమకథల ప్రస్తావన వస్తే, దాదాపుగా తెలుగు రచయితలు ప్రేమను పూర్తిగా పక్కనపెట్టేశారనే చెప్పాలి. మన తెలుగు సినిమాలో మాత్రం ప్రేమకు ఎప్పుడూ పెద్ద పీటే వేశారు. అయితే వాటిలో సహజత్వం కంటే నాటకీయతే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు అర్పించడం, సమాజాన్ని ఎదిరించడం వంటి అడ్డంకుల చుట్టే మన కథలు తిరుగుతుంటాయి. నేటి తరానికి ఎదురయ్యే సవాళ్లు మాత్రం పూర్తిగా వేరు. వృత్తిపరమైన ఆందోళనలు, మధ్యతరగతి కష్టాలు, అస్తిత్వ పోరాటాలు, లోపల దహించే ఒంటరితనం నేటి బంధాలను శాసిస్తున్నాయి. ఇలాంటి వాస్తవిక పరిస్థితుల మధ్య, మనుషుల అంతరంగాల్లో జరిగే మార్పులను కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించిన అద్భుతమైన నవల ఇది. కేవలం ఆకర్షణ లేదా నాటకీయమైన ఉద్వేగాల చుట్టూ కాకుండా, ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకుంటూ ఒక అరుదైన, నిశ్శబ్దమైన తోడుగా మారిన ఇద్దరు వ్యక్తుల ప్రయాణంగా ఈ కథను మలిచిన తీరు నిజంగా ప్రశంసనీయం.
ఒకరి లోపలి శూన్యాన్ని, ఒంటరితనాన్ని మరొకరు ఎలా పూరించుకున్నారనేది ఈ నవల ప్రధాన ఇతివృత్తం. ఈ కథలోని ఆస్లిష్ట పాత్ర అటువంటి ఒక శూన్యం నుంచే తన ప్రయాణం మొదలుపెడుతుంది. గని ప్రమాదంలో తండ్రిని కోల్పోయి, ఆ ప్రాణాన్ని కేవలం నష్టపరిహారపు డబ్బుతో కొలవాలని చూసే లోకం ముందు లొంగిపోని ఆమె పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం. తన దుఃఖాన్ని దాటుకుని సింగరేణి బొగ్గు గనుల్లో జూనియర్ మైనింగ్ ఆఫీసర్ ట్రైనీగా అడుగుపెట్టడం, గని చీకట్లలో నిరంతరం శ్రమిస్తూ కుటుంబాన్ని నిలబెట్టే మహిళల్లో ఆమె అద్భుతమైన ధైర్యాన్ని చూడటం ఈ నవలకు ఒక బలమైన వాస్తవికతను అద్దాయి. మహిళా సాధికారత అంటే వేదికల మీద అరిచి చెప్పడం మాత్రమే కాదని, మట్టిలో, శ్రమలో అసలైన సాధికారత ఉంటుందని రచయిత్రి ఆచరణాత్మకంగా చూపించారు.
ఇంతటి కఠినమైన వాస్తవికతతో పోరాడుతున్న ఆస్లిష్ట జీవితంలోకి మేఘనాథ్ రాకతో కథ ఒక అందమైన మలుపు తిరుగుతుంది. రిచర్డ్ లింక్ లేటర్ అద్భుత దృశ్య కావ్యం 'బిఫోర్ సన్ రైజ్' చలనచిత్రంలో నాయకానాయికల సంభాషణలు మనల్ని ఒక మాయలో పడేస్తాయి. అచ్చం అలాగే, ఈ కథలో పాతబస్తీ వీధుల్లో, కిన్నెరసాని ఒడ్డున ఆస్లిష్ట, మేఘనాథ్ మధ్య జరిగే మాటలు కూడా జీవితానికి అంతే దగ్గరగా అనిపిస్తాయి. ఈ ఇద్దరి ప్రపంచాలు వేరైనా, వారి మనసులను కలిపింది ఆ సంభాషణలే. రాజుల వైభవం కంటే సామాన్యుల కథలను ఇష్టపడే చరిత్రకారుడు మేఘనాథ్ ఎంతో పరిణతితో కనిపిస్తాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో కుటుంబాన్ని నిలబెట్టిన తల్లి పెంపకంలో పెరిగిన అతనికి స్త్రీల పట్ల ఉండే అపారమైన గౌరవమే ఆస్లిష్టకు గొప్ప భరోసానిస్తుంది. ప్రేమంటే ఒకరిని మనకు నచ్చినట్లు మార్చుకోవడం కాదు, వారు ఎలా ఉన్నారో అలా అంగీకరించడం అనే తత్వానికి మేఘనాథ్ పాత్ర ఒక మంచి ఉదాహరణగా నిలుస్తాడు. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు పెద్ద మాటలు చెప్పి పరిస్థితులను మార్చేయాలని చూడటం కంటే, ఎలాంటి తీర్పులు ఇవ్వకుండా ఓపికగా వారి పక్కన నిలబడటమే నిజమైన ప్రేమ అని ఈ ఇద్దరి ప్రయాణం బలంగా చెబుతుంది.
ఈ తరం యువ పాఠకులు ఈ నవలను తప్పక ఆదరిస్తారనే నమ్మకం ఉంది. వారు బంధాల్లో వెతికేది పెద్దపెద్ద త్యాగాలను కాదు; తమ ఉనికిని గౌరవించే, తమ మాటను ఎలాంటి తీర్పులు లేకుండా వినే ఒక ప్రశాంతమైన తోడును. కెరీర్ సందిగ్ధతలు, కుటుంబ బాధ్యతలు, ఎవరికీ చెప్పుకోలేని ఒంటరి పోరాటాల మధ్య నలిగిపోయే నేటి యువత మానసిక సంఘర్షణకు ఈ నవల అచ్చమైన అద్దం పడుతుంది.
కోలుకోవడం అనేది రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదు, అది మన ఇంట్లో జరిగే చిన్న చిన్న పనుల్లోనే మొదలవుతుందని ఈ కథ వివరిస్తుంది. రాళ్ల మధ్య ఎండకు ఎండుతూ కూడా పూసే కాగితం పూలు ఆస్లిష్ట మొండితనానికి, ఉనికి కోసం చేసే పోరాటానికి ప్రతీకగా నిలుస్తాయి. నాన్న చనిపోయినప్పటి నుంచి మూగబోయిన అమ్మ చేతి గాజులు రొట్టెలు చేస్తున్నప్పుడు మళ్లీ ఘల్లుమని మోగడం, ఉదయాన్నే ఉమామహేశ్వర స్తోత్రం చదవడం వంటి దృశ్యాలు ఆగిపోయిన జీవితం మళ్లీ చిగురిస్తోందనడానికి అందమైన సంకేతాలు. పార్వతిపై తన ప్రేమను శివుడు మాటల్లో చెప్పకపోయినా ఆయన ప్రపంచమంతా ఆమే అన్నట్లుగా, మాటల్లో చెప్పకపోయినా పక్కన ఉన్నామన్న భరోసా ఇవ్వడమే నిజమైన ప్రేమ అని ఈ కథ స్పష్టం చేస్తుంది.
సరిగమపదని అనే ఏడు స్వరాలతో రాగమాలికలా సాగే ఈ నవల ఏ తరం పాఠకులనైనా ఆకట్టుకుని, తెలుగు సాహిత్యంలో ఒక క్లాసిక్‌లా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. సుదూర తీరాల నుంచి దారితప్పి అలసిపోయి వచ్చిన ఒక మేఘం, ఒంటరిగా ఉన్న ఒక పర్వతాన్ని ఆత్మీయంగా హత్తుకున్నట్టుగా, ఈ కథ మన మనసును మెల్లగా తాకి అక్కడే ప్రశాంతంగా ఉండిపోతుంది. డబ్బు, ఉద్యోగం, సమాజం అనే గీతల మధ్య నేటి యువత తమ ప్రేమను, బాధను ఎలా సమతుల్యం చేసుకుంటున్నారో చెప్పిన ఈ నవల, మన కష్టసుఖాల్లో నిజంగా తోడుండేది మనం ఎంచుకున్న వాళ్లతో పంచుకునే ఇలాంటి మౌనరాగాలే అని అద్భుతంగా గుర్తు చేస్తుంది.
Thank you, @vrsiddareddy garu for trusting my work
Replying to @AnvikshikiPub
@AnvikshikiPub మొదలుపెట్టిన ఉద్దేశమే కొత్త పాఠకులు, కొత్త రచయితలు మళ్లీ తెలుగు భాష పట్ల ఆసక్తి చూపించాలని. మేము మొదటి మూడు సంవత్సరాలు ఎక్కువగా, షార్ట్ స్టోరీ కలెక్షన్స్, కొన్ని నవలలు పబ్లిష్ చేశాం. కానీ నిజానికి మాకు ఎక్కువగా కొత్త రచయితల చేత నవలలు రాయించి ప్రచురిద్దామనే ఆశ. అందులో భాగంగానే ఉగాది నవలలపోటీ పెట్టి దాదాపు ముప్ఫై కి పైగా నవలలు పబ్లిష్ చేశాం. ఆ ప్రయనం విజయవంతమై ఎంతో మంది కొత్త రచయితలను నవలలు రాసే దిశగా నడిపించింది. ఆన్వీక్షికి నుంచే కాకుండా ఇతర సంస్థలనుంచి కూడా ఎన్నో కొత్త నవలలు వచ్చాయి. అయినపట్టికీ పూర్తి సంతృప్తినిచ్చిన నవల నేను ఇంతవరకూ చదవలేదు. కానీ ఇప్పుడు ఊహ రాసిన "అమరానందమే ప్రేమ" ఆ వెలితిని పూడ్చింది.
చాలా పుస్తకాలు చదివి కళ్లల్లో నీళ్లు తిరిగిన సందర్భాలు ఉన్నాయి కానీ, హ్యాపీ టియర్స్ వచ్చింది మాత్రం ఈ నవల చదివాకే.
ఎందులో తెలియదు కానీ, ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ నాకు లింక్లేటర్ "బిఫోర్ సన్ రైజ్" గుర్తుకొచ్చింది. ఆ సినిమాలో కేవలం ఇద్దరువ్యక్తుల మధ్య జరిగే మాటలు మనల్ని ఒక తెలియని మాయలో పడేస్తాయి. అచ్చం అలాగే, రెండు వేర్వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరు మనుషులు తమ మాటలతోనూ, అంతకంటే ఎక్కువగా తమ మౌనంతోనూ దగ్గరయ్యే ప్రయాణమే శ్రీ ఊహ రాసిన 'అమరానందమే ప్రేమ'. రోజూ ఉండే పరుగులో అలసిపోయినప్పుడు, ఎలాంటి తీర్పులూ లేకుండా మన మాట వినే ఒక మనిషి పక్కన ఉంటే చాలనిపిస్తుంది. పెద్ద పెద్ద మాటలు చెప్పకపోయినా, నేనున్నాననే ఆ చిన్న భరోసాలోనే అసలైన ప్రేమ ఉంటుందని ఈ నవల చాలా సహజంగా చెబుతుంది.
కెరీర్ కన్ఫ్యూజన్లు, ఇంటి బాధ్యతలు, ఎవరికీ చెప్పుకోలేని ఒంటరితనాల మధ్య ఈ తరం తమ బంధాలను ఎలా వెతుక్కుంటున్నారో ఈ పుస్తకం కళ్లకు కడుతుంది. గత ఇరవై ఏళ్లలో వచ్చిన తెలుగు నవలల్లో ఇంత కొత్తగా, మనసుకు ఇంత దగ్గరగా అనిపించే పుస్తకం బహుశా ఇదేనేమో. ప్రయాణంలో అలసిపోయిన మేఘం ఒక కొండను తాకి సేదతీరినట్టు, ఈ కథ చదువుతుంటే మనసుకు ఎంతో తేలికగా, ప్రశాంతంగా అనిపిస్తుంది.
Thank you @nameisuha for giving us an opportunity to publish this beautiful novel.
2
6
193





























