కాస్త కరుణించే మేఘంలాగా
నీవో మాటంత ప్రేమ కురిపిస్తే చాలు,
మళ్ళీ మొలకెత్తి జీవం పోసుకునే విత్తనంలా
మనిషినై ఈ లోకంలో సంచరిస్తా!
6
183
కలిపురుషుడు పాచికల్లో చేరి
నలున్ని అడవుల బాట పట్టించినట్లు,
ప్రియురాలి ప్రేమలో చేరి
నన్ని విరహంలో నెట్టేసాడేమో!
7
143
అమ్మతో మొదలైన ఈ ప్రేమ
ప్రేయసివై ధర్మపత్నివై
నిను వరించాలని ఉవ్విళ్లూరి
వృద్దాప్యంలో పండాల్సినది
యవ్వనంలోనే నీ విరహంలోనే
పండై మోక్షం పొందేస్తున్నట్లుంది
ఆ సంగీత స్వరానికి, నాచేత వ్రాయబడిన సాహిత్యం.
జాలినే లేదా చెలి, నను కరుణింప..
ప్రేమనే దాచవులే, నీ మనసంతా..
యుగములై వేచున్ననే.. నీ వెనకింటా..
(ప్రేమ తనలోనే దాచుకొని, తన వెనక తిప్పుకుంటున్న ఓ అమ్మాయి ప్రేమ పిలుపుకై ఎదురుచూస్తున్న ప్రియుని ఆవేదనంతరంగం ఈ పాట..)
చీకట్లో ఉన్న నా జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన ఈ దీపావళి చాలా చాలా స్పెషల్ ❤️
#యండమూరి గారి కథతో,
#రసూల్ గారి విజువల్స్ తో ,
#సీతారామశాస్త్రి గారు దాచేసుకున్న సాహిత్యంతో,
వాళ్ళ అబ్బాయి సంగీతం,
యశోదమ్మ కృష్ణ పరమాత్ముడి కోసం పాడిన కీర్తనలో నేపథ్య సంగీతం 🙌🤞🛐
#TrivedaArts
1
17
573
అందమైన సముద్రాన్ని చూడాలని
తీరంలో అలలతో కలిసిపోయి
సముద్రంలో తప్పిపోయినట్లు,
అంతే అందమైన ప్రేమను కోరి
తీరపు అలల్లాంటి యవ్వన మాయలో పడి
విరహమనే సాగరంలో మునిగిపోయాను!
ఆనాడు చిన్నికృష్ణుడు
నోరుతెరచి యశోదకు
ముల్లోకాలు చూపిస్తే,
ఈనాడు మా చిట్టితండ్రి
చిట్టి చేతులు చేసే పనుల వలన
రోజుకో లోకం కనిపిస్తుంది.
చిన్నికృష్ణుడైన ముల్లోకాలు
ఒక్కసారే చూపించాడు
కానీ ఈ చిచ్చరపిడుగు
రోజుకోసారి చూపిస్తున్నాడు
యశోదక్కూడా దక్కని ఈ భాగ్యం
మాకు అనుగ్రహించవా తండ్రి.
1
19
349
ఆన్లైన్లో శివకాశి నుండి 3 బాక్సులు టపాసులు కొన్నాం. అవి తిరుపతికి వచ్చేసరికి, తిరుపతిలో పోలీసులు పట్టుకొని తీసుకుపోయారంట. ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మీద కేసు కూడా పెట్టారన్నారు.
ప్రజల మధ్య గోడౌన్లు ఉంచి, వాటిలో టపాసుల బాక్సులు ఉంచి.. సరైన జాగ్రత్తలు తీసుకోలేదని వంటి కారణాలతో..
+1
దాదాపు నెల రోజుల పైనుండి అవి స్టేషన్లోనే ఉన్నాయి. మాకు ట్రాన్స్పోర్ట్ నుండి తరువాత ఏ సమాచారం లేదు.
దీపావళి కూడా ఇంకొక రోజు మాత్రమే ఉంది.
ఆ టపాసుల బాక్సులను విడిపించుకునే మార్గం ఏదైనా ఉందా?
@Keerthana_JSP @adipudi365
ఏమయ్యా కవి
అప్పట్లో గురజాడ గారు
“దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్” అన్నారు
అదే ఎవరినైనా ప్రేమించుంటే
"ప్రేమంటే ఆనందం కాదోయ్
ప్రేమంటే విరహమేనోయ్" అని
దేశమంతా తిరిగి చాటింపేసేవారు
1
6
304
ప్రజాసేవ అంటే ఎంత ఇష్టమో!
సాలూరులో వెబ్‌సిరీస్‌ను తలపించిన ఎన్నిక!
👉 ముందుగా సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ సీటును బీసీ మహిళకు కేటాయించడంతో మంజీరను పెళ్లి చేసుకున్న టీడీపీ నేత హర్షవర్ధన్.
👉 కట్ చేస్తే.. కూటమి సీట్ల సర్దుబాటులో జనసేన పార్టీకి దక్కిన మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం.
👉 జనసేనకు చైర్‌పర్సన్ సీటు కేటాయించడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, పబ్లిక్‌గా ప్రభుత్వ సమావేశంలోనే కంటతడి పెట్టుకున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి.
👉 ప్రతీకారం తీర్చుకునేందుకు జనసేన పోటీ చేసిన అన్ని వార్డులతో పాటు చైర్‌పర్సన్ స్థానానికి కూడా మంజీరను టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దించారు.
👉 మంత్రి గారే స్వయంగా ప్రచారం చేయడంతో పోరు హోరాహోరీగా సాగి త్రిముఖ పోటీ నెలకొంది
👉 అర్ధరాత్రి వరకు ఉత్కంఠగా సాగిన కౌంటింగ్‌లో చివరకు 300 ఓట్ల తేడాతో జనసేన విజయం సాధించడంతో సిట్టింగ్ మంత్రికి సైతం ఫలితం షాక్ ఇచ్చింది!
#APLocalPolls
#APLocalBodyElections2026
145
వయసులో ఉన్నప్పుడో
సంపాదించేటప్పుడో
అవసరం కోసమో
ఆనందం కోసమో
అందరితో బంధం వేసి
నడిపించేలా చేస్తావు,
అదే వృద్ధాప్యనికి చేరుకునేసరికి
కన్నవారికే భారమయ్యేలా చేస్తావు
తెంచుకోవాలనుకున్న
తెంచుకోలేని బంధాలెన్నింటినో
వృద్ధాప్యం ద్వారా తొలగించేస్తావు
ఈశ్వరా మోక్షమంటే ఇదే కదా!
ఒకరికి ప్రజలు పిచ్చి
ఇంకొకరికి పదవులు పిచ్చి
మరొకరికి రాజకీయం పిచ్చి
ఇన్ని పిచ్చిల నడుమ
పిచ్చోడిని కావడమే
నా అసలైన పిచ్చి.
- బొచ్చు పెద్ద పిచ్చయ్య


























