Pinned Tweet
ఒక ఎండాకాలపు మధ్యాహ్నం పుస్తకావిష్కరణ 💙🤗
హైదరాబాద్ బుక్ఫెయిర్తో పాటు అమెజాన్‌లో కూడా ఈ పుస్తకం దొరుకుతుంది. లింక్ బయోలో ఉంది.
Visit our stall at the Hyderabad Bookfair - Stall No. 356 (Premalu Pusthakaalu).
@insidemalli
ప్రేమలు పుస్తకాలు retweeted
ఇవాళ్టి ఆంధ్రజ్యోతి దినపత్రికలో నా ఇంటర్వ్యూ.. 💙
'వివిధ' టీమ్‌కు, మెహెర్ గారికి ప్రేమ 🤗
ప్రేమలు పుస్తకాలు retweeted
నా నవల 'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' చదివారా?
ఇప్పుడే చదివెయ్యండి, వచ్చే నెల బుక్ ఫెయిర్‌లో కలిసి మాట్లాడుకోవచ్చు! 💙🤗
#OkaEndakalapuMadhyahnam
@PremaluBooks
ప్రేమలు పుస్తకాలు retweeted
ఛాయ లిటరేచర్ ఫెస్టివల్‌కి వెళ్ళడమూ, మిత్రులందర్నీ కలవడమూ, రెండు సెషన్స్‌లో ఇష్టంగా మాటలు పంచుకోవడమూ మంచి అనుభవం.
మొదటిరోజు "City of Strangers: Alienation and Relationships in Urban Telugu Fiction (అపరిచితల నగరం: అర్బన్ కథల్లో పరాయీకరణ, ఆధునిక సంబంధాలు)" అన్న అంశంపై మాధురి పాలాజీ, శ్రీ ఊహా, నేనూ మాట్లాడాం. రెండో రోజు ముచ్చట సెషన్లో పాఠకులతో ముచ్చటించా.
ఈ రెండు సెషన్లలోనూ చాలాసార్లు నా నవల 'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' చర్చకు రావడం బాగుంది.
ముచ్చట సెషన్లో.. "ఓ, ఇంత మాట్లాడుకోవచ్చా?" అనిపించేటంత మాట్లాడుకున్నాం. ఇలాంటి ముచ్చట కార్యక్రమాలు నేనింకా చాలా చెయ్యాలైతే.. 😊
రెండు రోజుల పాటు వైభవంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించిన ఛాయకు ప్రేమ 💙🤗
@chaayalitfest
ప్రేమలు పుస్తకాలు retweeted
నవంబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో జరుగుతున్న ఛాయ లిటరేచర్ ఫెస్టివల్‌కి అందరూ వస్తున్నట్టే కదా?
కలుద్దాం 💙🤗
@chaayalitfest
ప్రేమలు పుస్తకాలు retweeted
అమ్మాయిలూ..
మరి మీ మీ బాయ్‌ఫ్రెండ్స్‌తో 'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవల చదివించి, చర్చ పెట్టండి! 💙🤗
Happy reading!
#OkaEndakalapuMadhyahnam
ప్రేమలు పుస్తకాలు retweeted
నా నవలను రెండోసారి చదువుతున్నామని చెప్తున్నారు చాలామంది. కొంతమంది మూడు, నాలుగోసారి చదువుతున్నామని చెప్పారు. ఈ పుస్తకానికి వస్తున్న రివ్యూలు చూస్తే ఒక్కోసారి నాకే ‘నేనింత రాసిన్నా?’ అనిపిస్తుంది.
Truly blessed to have such beautiful readers for Oka Endakalapu Madhyahnam. 💙🤗
🤖 Made with AI
నచ్చిందా?
బాధ పెట్టిందా?
ఏం మాట్లాడాలో తెలియడం లేదా?
.
.
"ఇంకోసారి చదవాలని ఉంది" 🙋🏻♂️😄
Thank you to all OEM readers for your love and support. 🤗
@insidemalli
🤖 Made with AI
ప్రేమలు పుస్తకాలు retweeted
Replying to @insidemalli
@insidemalli Anna
ఒక ఎండాకాలపు మధ్యాహ్నంలో…నవల లో
చదువుతూ ఉన్నంతసేపు…!
కొద్దిసేపు హ్యాపీగా…
కొద్దిసేపు బాధగా…
కొద్దిసేపు కోపంగా…
చివరికి…
“అయ్యో… ఇలా ఎందుకు జరిగింది?”
అనే ప్రశ్నార్థకంతో ముగించావు..
అన్నా మళ్లీ రెండు మూడు సార్లు చదవాలనిపిస్తుంది....
Amazon’s Great Indian Festival is live now! 🎉
Get Oka Endakalapu Madhyahnam at 16% off during the sale.
amzn.in/d/0hzux1Mv
🤖 Made with AI
ప్రేమలు పుస్తకాలు retweeted
'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవల చదివి రచయిత @inksudha రాసి పంపిన రివ్యూ. Thank you for the beautiful review, Sudha. 💙🤗
***
ఎనిమిదో తరగతి దాకా, ఎండాకాలపు మధ్యాహ్నాలు అంటే ఒక ఇష్టం ఉండేది. ఒంటిపూట బడులు మొదలవుతాయి. త్వరగా ఇంటికి వెళ్లిపోవచ్చు, సరదాగా క్రికెట్ ఆడుకోవచ్చు, నచ్చిన సినిమా చూసుకోవచ్చు ఇలా. అయితే తొమ్మిదో తరగతి నుంచి ఆ ఫీలింగ్ పోయింది. ఇష్టం లేదని కాదు, స్పెషల్ క్లాసులు, తర్వాత కాలేజీ రోజుల్లో ఆ టైమ్‌కి సమ్మర్ సెమిస్టర్లు, ఇలా ఇదొక ఎండాకాలపు మధ్యాహ్నం అని గుర్తుంచుకునే రోజులు పోయాయి. తర్వాత లాక్డౌన్ మాత్రమే ఆ మధ్యాహ్నాలకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చింది.
ఈ మధ్యాహ్నాలకు ఒక స్వరం ఉంటుంది. ఆ స్వరం నువ్వు ఖాళీగా ఉన్నావనో, నువ్వు చేస్తున్న పనికి అసలు అర్థముందా అనో, ఇలాంటి మధ్యాహ్నం రేపు మళ్లీ వస్తే ఏం చేస్తావనో, స్నేహితులతో సరే, ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే ఒక ఏవగింపు, నచ్చిన మనిషితో ఉన్నప్పుడు కూడా ఉనికిని గుర్తుచేసే ఉక్కపోత... ఇలా ఆ సమయం అంత సులభంగా గడవదు. ఈ ఎండాకాలాల్లో అందుకే నేను మా ఊర్లో ఉండటానికి ఇష్టపడతాను. ఎందుకంటే, చాలా మంది ఆ చేదు కొన్నిసార్లు కావాలనిపిస్తుంది అంటారు కదా, అందుకేనేమో.
మల్లికార్జున్ గారు రాసిన ఎండాకాలపు మధ్యాహ్నం, నన్ను ఆ క్షణాల్లోకి లాక్కెళ్లి కూర్చోబెట్టింది.
ఇందులో నేను అయిష్టత చూసాను, బాధను గమనించాను, ప్రేమ నుంచి పారిపోవడం చూసాను, ప్రేమ కోసం వెంపర్లాడటం చూసాను, ఒక మనిషిని కావాలనుకోవడం చూసాను, వదిలిపెట్టాలి అనుకోవడాన్ని సమర్థించుకోలేని సున్నిత మనసుల గుండె చప్పుడు విన్నాను.
రచయిత మనల్ని ఒక కాల్పనిక ప్రపంచానికి తీసుకెళ్తున్నాడు, ప్రేమ లోతుల్లో ముంచెత్తుతున్నాడు, అనే భ్రమను కలిగించి, నిజానికి చాలా దగ్గరగా రాయాలనే ప్రయత్నం చేశారు. అది చాలా బాగా కుదిరింది కూడా.
ఇది చాలా రిలేటబుల్ అని చెప్పడం ఎందుకో ఇబ్బందిగా ఉంది. ఇదిలా టైప్ చేస్తున్నప్పుడు కూడా ఆ చేదు అనే ఫీలింగ్ ఒళ్లంతా పాకుతోంది.
నాకు ఇందులోని రెండు పాత్రల మీదా జాలి కలిగింది.
కోపం, ఇష్టం, ద్వేషం కూడా.
ఎందుకో తెలీదు నవల పూర్తి చేశాక చాలా గంటల పాటు మౌనంగా ఉండిపోయా నేను.
This is disturbing, traumatic, sad, therapeutic and, in a strange way, it's beautiful too.
బహుశా నేను దీన్ని ట్రిగ్గర్ వార్నింగ్ ఇచ్చి సజెస్ట్ చేస్తానేమో ఎవరికైనా. Read at your own risk అని.
ప్రేమలు పుస్తకాలు retweeted
నా నవల 'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' చదివారా? చదవకపోయి ఉంటే.. ఇంకా ఎందుకు చదవలేదు? 🙈
చదివినవాళ్ళందరికీ ప్రేమ. 💙
OEM - Oka Endakalapu Madhyahnam is available on Amazon and all major book stores.
@PremaluBooks
Oka Endakalapu Madhyahnam is a contemporary love story that delves into the complexities of love, intimacy, and loneliness within a relationship.
మీరు ఈ పుస్తకాన్ని అమెజాన్‌లో కొనొచ్చు:
amzn.in/d/0eHHyZbw
@insidemalli
🤖 Made with AI
వి. మల్లికార్జున్‌కి డా. వేదగిరి రాంబాబు కథానిక పురస్కారం - 2026.
'ఇరానీ కేఫ్' పుస్తకానికి ఈ పురస్కారం లభించింది.
Congratulations @insidemalli 💐🎉
జీవితాలు.. ప్రేమలు..
నిర్వచనాలకు లొంగవు.
'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవల లాగా.. 💙
ఈ పుస్తకాన్ని మీరు చదివేశారా?
Get your copy from Amazon.
@insidemalli
ప్రేమలు పుస్తకాలు retweeted
"కొన్ని కథలు పూర్తయ్యాక మనం చివరి పేజీ మూసేస్తాం.
కొన్ని కథలు మాత్రం చివరి పేజీ తర్వాత కూడా మనలో ఎక్కడో నెమ్మదిగా కొనసాగుతూనే ఉంటాయి.
ఒక ఎండాకాలపు మధ్యాహ్నం నాకు రెండో రకం పుస్తకం 🌻
Rating: 5.7/5 ⭐"
'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవలను ఒకే నెలలో మూడు సార్లు చదివి రివ్యూ రాసి పంపింది విభ అని ఈ బుక్స్టాగ్రామర్ (@ vibha_archive). ఎంత బాగా రాసిందో! 💙🤗
***
ఒక ఎండాకాలపు మధ్యాహ్నం | వి. మల్లికార్జున్
కొన్ని పుస్తకాలు కథను మాత్రమే చెప్పవు. మనం మనుషుల్ని, సంబంధాల్ని, జ్ఞాపకాల్ని చూసే విధానాన్ని కూడా కొంచెం మార్చి వెళ్తాయి. ఒక ఎండాకాలపు మధ్యాహ్నం నాకు అలాంటి పుస్తకంగా అనిపించింది.
మొదట ఇది ఒక ప్రేమకథలా మొదలవుతుంది. కానీ కథ ముందుకు వెళ్లేకొద్దీ ప్రేమ కంటే పెద్దదైన కొన్ని విషయాలు దాని మధ్యలో కనిపిస్తాయి. ఒక సంబంధంలో ప్రేమ ఎంత ముఖ్యమో, అంతే ముఖ్యమైనవి అర్థం చేసుకోవడం, మాట్లాడుకోవడం, ఒకరి భావాలకు మరొకరు ఇచ్చే విలువ, అలాగే చెప్పకుండా మిగిలిపోయే విషయాలు కూడా అని కథ నెమ్మదిగా చూపిస్తుంది.
ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన విషయం దాని సహజత్వం.
పెద్ద సంఘటనలతో ప్రతి భావోద్వేగాన్ని బలవంతంగా చూపించకుండా, రోజువారీ జీవితంలోని చిన్న చిన్న క్షణాల నుంచే సంబంధాన్ని నిర్మించారు. ఒక సంభాషణ, ఒక నిశ్శబ్దం, ఒక చిన్న అపార్థం, ఒక జ్ఞాపకం... ఇవన్నీ కలిసి పాత్రల మధ్య ఉన్న బంధాన్ని మనకు అర్థమయ్యేలా చేస్తాయి.
ముఖ్యంగా పాత్రలు పూర్తిగా మంచివాళ్లు, పూర్తిగా చెడ్డవాళ్లు అనే సులభమైన గీతల్లో ఉండవు. వాళ్లకి వాళ్ల కారణాలు ఉన్నాయి. భయాలు ఉన్నాయి. తప్పులు ఉన్నాయి. ప్రేమ ఉంది. అదే సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకోలేని సందర్భాలు కూడా ఉన్నాయి.
అందుకే ఈ కథను చదువుతున్నప్పుడు ఎవరు సరైనవారు, ఎవరు తప్పు అనే దానికంటే, ఒక మనిషి తన మనసులో అనుభవించేది ఇంకొక మనిషికి ఎప్పుడూ అదే విధంగా కనిపించకపోవచ్చు అనే విషయం ఎక్కువగా గుర్తుండిపోతుంది.
ఈ కథలో జ్ఞాపకాలకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని జ్ఞాపకాలు మనం కోరుకున్నా మాయమవ్వవు. కాలం వాటిని తీసుకుపోదు. బదులుగా, మనం వాటిని చూసే విధానమే మారుతుంది.
అందుకే కథలోని కొన్ని moments అప్పట్లో సాధారణంగా అనిపించినా, తర్వాత వాటికి వేరే అర్థం వస్తుంది. అదే నాకు ఈ పుస్తకంలోని emotional strength అనిపించింది.
ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం గురించి కాదు. ఒక సంబంధం మనిషిని ఎంతగా మార్చగలదు, ఒక మనిషి మన జ్ఞాపకాలలో ఎంతకాలం జీవించగలడు, ప్రేమ ముగిసిన తర్వాత కూడా దాని ప్రభావం మనలో ఎలా కొనసాగుతుంది అనే విషయాల గురించి కూడా.
అందుకే పుస్తకం పూర్తయ్యాక దాని title కూడా ఇంకాస్త అర్థవంతంగా అనిపించింది.
ఒక ఎండాకాలపు మధ్యాహ్నం.
బయటికి చూస్తే ఒక సాధారణ సమయం మాత్రమే. కానీ ఒక మనిషి జీవితంలో కొన్ని సాధారణ క్షణాలే తర్వాత అతిపెద్ద జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
ఈ పుస్తకం నాకు అలాంటి ఒక జ్ఞాపకాన్ని చదివిన అనుభూతిని ఇచ్చింది.
ఇది చాలా loud గా ఉండే కథ కాదు. తన భావాల్ని అరుస్తూ చెప్పే కథ కూడా కాదు. నెమ్మదిగా చదివితే, పాత్రలతో కొంత సమయం గడిపితే, వాళ్ల మధ్య ఉన్న మాటలకన్నా మాటల వెనుక ఉన్న భావాలు ఎక్కువగా కనిపించే కథ.
అందుకే ఈ పుస్తకాన్ని నేను ఒక perfect love story అని చెప్పను.
ఇది చాలా human అయిన love story.
ప్రేమలో ఉండటం ఎంత అందంగా ఉంటుందో మాత్రమే కాకుండా, ప్రేమను అర్థం చేసుకోవడం ఎంత కష్టమో కూడా గుర్తుచేసే కథ.
కొన్ని కథలు పూర్తయ్యాక మనం చివరి పేజీ మూసేస్తాం.
కొన్ని కథలు మాత్రం చివరి పేజీ తర్వాత కూడా మనలో ఎక్కడో నెమ్మదిగా కొనసాగుతూనే ఉంటాయి.
ఒక ఎండాకాలపు మధ్యాహ్నం నాకు రెండో రకం పుస్తకం 🌻
Rating: 5.7/5 ⭐
అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. 💙
ఈ పండుగ సందర్భంగా మా పుస్తకాలన్నీ కలిపి కాంబో ఆఫర్‌గా 30% డిస్కౌంట్‌కి అందిస్తున్నాం.
8106228999 నెంబర్‌కి వాట్సాప్ చెయ్యండి! 🤗
@insidemalli
ప్రేమలు పుస్తకాలు retweeted
పుస్తకం వెనక పేజీలో ఇలా రాసుకొని పంపిస్తారు కొందరు. ఎంత బాగుంటుంది!
Somehow missed posting this letter. ఏవో ఫొటోలు వెతుకుతుంటే దొరికింది. 🤗
#OkaEndakalapuMadhyahnam
ప్రేమలు పుస్తకాలు retweeted
నీ పుస్తకానికొచ్చే రివ్యూలన్నీ మురిసిపోతూ చదువుకుంటున్నావు కదా? అన్నారొకరు.
మరి ఇంత ఇష్టంగా రాసి పంపుతుంటే ఎందుకు మురిసిపోను? 💙
***
హాయ్ బ్రో, ఇప్పుడే ఎండాకాలపు మధ్యాహ్నం బుక్ కంప్లీట్ చేశాను. నేను చాలా బుక్స్ చదివాను. ప్రతి బుక్ నుంచి ఏదో ఒక సారాంశం అర్థం చేసుకుంటాను నా పర్స్పెక్టివ్ లో. కొన్ని పుస్తకాలు చదివాక నవ్వాను, కొన్నింటికి ఏడ్చాను. కానీ ఈ కథ చదవడం పూర్తయ్యాక ఒక పది నిమిషాలు మాత్రం ఏం చేయకుండా అలానే కూర్చుండిపోయాను.
లవ్, డిప్రెషన్, విరహం, ఏం చేయాలో తేలకపోవడం, ఏమీ చేయలేకపోవడం ఇంకా ఎన్నో భావాలు చాలా రియలిస్టిక్‌గా చెప్పారు.
కథానికం నాకు చాలా నచ్చింది. అన్ని కథలు సుఖాంతం అవ్వవు, చాలాసార్లు చాలా కథలు సుఖాంతం అవ్వవేమో కదా అనిపించింది.
పుస్తకం మొత్తంలో నాకు బాగా నచ్చిన లైన్ -
“నీతో పంచుకోడానికి కాకపోతే ఇంత ప్రకృతిని నాలో నింపుకొని ఏం చేస్తాను?”
Thank you for writing this book. అంతకంటే ఇంకేం చెప్పలేనేమో అనిపించింది.
ప్రేమలు పుస్తకాలు retweeted
'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవల చదివి, "అర్థమైనట్టే ఉంది గానీ, ఏమో ఇంకోసారి చదవాలి" అన్నవాళ్ళు ఉన్నారు; "అర్థమైతే అయ్యింది గానీ, నచ్చిందో లేదో తేల్చుకోలేకపోతున్నా" అన్నవాళ్ళూ ఉన్నారు. తమను ఈ పుస్తకం చాలారోజులు వెంటాడిందన్నారు కొందరు.
పుస్తకం చదివి ఏదో ఒకటి రెండు మాటల్లో కాక, పేరాలకు పేరాలు రాసి పంపించారు చాలాంది పాఠకులు. అందులో దాదాపు అన్నింటినీ ఇలా ఇన్స్టాగ్రాం స్టోరీ హైలైట్స్‌లో చేర్చా. ఒక హైలైట్‌లో వంద స్టోరీలు మాత్రమే పెట్టగలమట. ఎవరికైనా చదవాలనిపిస్తే నా ఇన్‌స్టా ప్రొఫైల్లోకి వెళ్ళి చదువుకోవచ్చు.
ఇంకా పుస్తకం చదవకపోయి ఉంటే మాత్రం వీటిల్లో చాలా స్పాయిలర్స్ ఉంటాయి, చూస్కోండి!
Thank you everyone for all your love for OEM (Oka Endakalapu Madhyahnam) 💙🤗
🤖 Made with AI






































