V (@WARMA007) header
V (@WARMA007) profile picture
Joined November 2016
Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)Photo by V (@WARMA007)
🇱🇸 " సంసారం ఒక చదరంగం" 🇱🇸
51
1,559
69
3,279
నకిలీ ఉద్యోగాల పేరుతో ₹7 కోట్ల కుంభకోణం చేసిన ధరణీ కృష్ణ వ్యవహారంపై, @YSRCParty మరియు, వైసీపీ అధికార ప్రతినిధి @ImYanamala జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి రుక్మిణి కోట గారి వ్యక్తిత్వ భంగం కలిగేలా చేసిన ఆరోపణలపై అలాగే వీరిపై న్యాయపరంగా తీసుకోనున్న చర్యలపై మీడియా సమావేశం ద్వారా వివరాలు వెల్లడిస్తున్న శ్రీమతి రుక్మిణి కోట గారి లీగల్ బృందం youtube.com/live/mKwJIB4Pg80…
16
229
4
495
16,333
నకిలీ జాబ్ స్కాం కు పాల్పడి, పరారీలో ఉన్న ముద్దాయి బోడపాటి ధరణి కృష్ణ కోసం ఒకవైపు పోలీసులు గాలిస్తుంటే, అలాంటి వారి ఆచూకీ తెలిసినప్పుడు పట్టించాల్సింది పోయి, లైవ్ పెడుతున్నాను అని చెప్పడం ఏ రకమైన జర్నలిజం @ashuvemulapalli గారు? నిందితుల ఆరోపణల ఆధారంగా కథనాలు ప్రసారం చేయడం మాత్రమే కాకుండా, ఇప్పుడు నిందితులను పోలీస్ వారికి పట్టించడం మానేసి మీ వ్యూస్ కోసం, మీ కొత్త యూట్యూబ్ ఛానల్ కోసం ఇంతకీ దిగజారుతారా? @police_guntur వారు అశోక్ వేములపల్లి గారి ద్వారా ముద్దాయి ధరణి కృష్ణ ఆచూకీ కనిపెట్టి కేసు విచారణ చేయవలసిందిగా కోరుతున్నాము. #BewareOfOriginalScamsters
23
256
7
571
16,040
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ వీరమహిళల ఆధ్వర్యంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లోని జ్యోతిరావు పూలే పార్క్‌లో ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకులతో వీరోచితంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్యసాహసాలు, త్యాగనిరతి నేటి మహిళలకు ఆదర్శమని పేర్కొంటూ, ఆమె పోరాట స్ఫూర్తితో మహిళలు అన్యాయాలపై ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళలు చిట్టి మణిత రెడ్డి, రాగుల శిరీష, కానుగంటి మంగ, గుండేటి లావణ్య, గుండ శకుంతల, తోదేటి భారతి పాల్గొన్నారు. #RaniLakshmiBai
31
121
1,542
కాకినాడ, శ్రీకాకుళం నగర పాలక సంస్థల ఎన్నికలకు జనసేన సమన్వయ కమిటీలు రెండో దశలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్లలో మేయర్ స్థానాలకు కూటమిలో భాగంగా జనసేన పార్టీ పోటీ చేస్తున్న సంగతి విదితమే. ఈ మేరకు ఎన్నికల సమన్వయ కమిటీలను జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ఎన్నికల్లో స్థానికంగా జనసేన పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి, కూటమి పార్టీలతో నిరంతర సమన్వయం చేసుకునేందుకు ఈ కమిటీలు పనిచేస్తాయి. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోటా గెలుపు సాధించేలా ఆయా ప్రాంత నాయకుల సమన్వయంతో కమిటీలు కృషి చేస్తాయి. *కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమన్వయకర్తలు 1. శ్రీ కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి 2. శ్రీ కొణతాల రామకృష్ణ, అనకాపల్లి శాసనసభ్యులు 3. శ్రీ పిడుగు హరిప్రసాద్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ 4. శ్రీ బొమ్మిడి నాయకర్, ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే 5. శ్రీ బత్తుల బలరామకృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే 6. శ్రీ గిడ్డి సత్యనారాయణ, పి. గన్నవరం ఎమ్మెల్యే 7. శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, APMSIDC చైర్మన్ 8. శ్రీ సామినేని ఉదయభాను, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు 9. శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ 10. ⁠ శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, వడ్డీల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ *శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల సమన్వయకర్తలు 1. శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ దక్షిణ నియోజక వర్గ శాసన సభ్యులు 2. శ్రీ సుందరపు విజయ్ కుమార్ , యలమంచిలి ఎమ్మెల్యే 3. శ్రీమతి లోకం మాధవి, నెల్లిమర్ల ఎమ్మెల్యే 4. శ్రీ నిమ్మక జయకృష్ణ, పాలకొండ ఎమ్మెల్యే 5. శ్రీ టి. శివశంకర్, ఏపీ ఎంఎస్ఎంఈ, చైర్మన్ 6. శ్రీ కొరికాన రవికుమార్, సుడా ఛైర్మన్ 7. శ్రీ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు మేయర్ 8. శ్రీమతి పాలవలస యశస్వి, రాష్ట్ర తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ 9. శ్రీ పెనుగొండ సుబ్బారాయుడు 10. శ్రీ దుగ్గిశెట్టి సుజయ్ బాబు
5
319
3
1,240
37,525
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి, మహిళా శక్తి, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మీబాయి చూపిన తెగువ, త్యాగం, పోరాట పటిమ ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ముఖ్యంగా మహిళలు ఆమె స్ఫూర్తితో ధైర్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేశం కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆమె ఆశయాలు, ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించడమే ఆమెకు మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాస్, జాయినింగ్ కమిటీ సభ్యుడు ప్రేమ్ కుమార్ మమ్మారెడ్డి, రాష్ట్ర నాయకులు మచ్చ సుధాకర్, రాష్ట్ర మహిళా నాయకురాలు మండపాక కావ్య పాల్గొన్నారు. వీరితో పాటు వీరమహిళలు వెంకట్ లక్ష్మి ఆకుల, శ్రీదేవి, పద్మజ, తనూజ రెడ్డి, శ్రావణి ఆకుల, భావ్యా రెడ్డి, కాజా సుజాత, శ్రీవాణి, అరుంధతి, గోవిందమ్మ, ఉష శ్రావణ, పద్మావతి, దులిపాల అరుణ, అనిత, నాగలక్ష్మి, అనుపమ తదితర వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు. #RaniLakshmiBai
2
55
206
2,860
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ జనసేన వీర మహిళ డాక్టర్ సాయి కృష్ణ ప్రియ ఆధ్వర్యంలో మహిళల చేరికల కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు, శ్రీ @PawanKalyan గారి నాయకత్వం పట్ల ఆకర్షితులైన పలువురు మహిళలు పార్టీలో చేరారు. నూతనంగా చేరిన మహిళలకు డాక్టర్ సాయి కృష్ణ ప్రియ స్వాగతం పలికారు. #JSPForNewAgePolitics #JanaSenaTelangana #JSPForTelangana
40
192
1,662
జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థుల ఖరారు •వైస్ ఛైర్మన్ అభ్యర్థులు ఖరారు నాలుగు జిల్లాలకు సంబంధించి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. అయిదురు జిల్లాలకు సంబంధించిన వైస్ ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేశారు. కూటమిలో భాగంగా జనసేన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు పొందింది. శ్రీకాకుళం: శ్రీమతి కొరికాన భవాని (ఎల్.ఎన్.పేట జడ్పీటీసీ) పార్వతీపురం మన్యం: శ్రీమతి నిమ్మల నీలిమ (భామిని జడ్పీటీసీ) అనకాపల్లి: శ్రీమతి మోటూరు నాగమణి (పరవాడ జడ్పీటీసీ) కాకినాడ: శ్రీమతి బుర్రా దివ్య సునీత రాజ్ (పెద్దాపురం) •అయిదు జిల్లాల్లో వైస్ చైర్మన్లు తూర్పు గోదావరి: శ్రీమతి పల్నాటి రజని (నిడదవోలు) డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ: శ్రీ ఎలిశెట్టి రామకృష్ణ (కొత్తపేట) బాపట్ల: శ్రీమతి కలవకూరి పిచ్చమ్మ (పర్చూరు) ప్రకాశం: శ్రీ వరికూటి లక్ష్మీ తాయారు (దర్శి) శ్రీ సత్యసాయి: శ్రీమతి దాసరి సునేత్ర (గోరంట్ల) -జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
10
308
3
996
31,738
పల్లె పండుగ కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గం, KD రోడ్ నుండి ఎల్లనూరు మండలం చింతకాయమండ గ్రామం వరకు రూ.35 లక్షల ఖర్చుతో నిర్మితమైన నూతన రోడ్లు. #AndhraPradesh #IdhiManchiPrabhutvam #PawanKalyanMarkGovernance #CheppaamChestunnaam
1
121
315
4,055
అక్వాన్ తుపాన్ పట్ల అత్యంత అప్రమత్తత అవసరం •గత రెండు తుపాన్లతో పోలిస్తే అక్వాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం •రేపటి నుంచి తీర ప్రాంత జిల్లాలపై తుపాను ప్రభావం •నెల్లూరు - తుని మధ్య తీరం తాకనుందని వాతావరణ శాఖ చెబుతోంది •భారీ వర్షాలు, వరదలపై ముందస్తు హెచ్చరికలతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి •ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదు.. గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీరు,ఆహారం అందుబాటులో ఉంచాలి •అక్వాన్ తుపాను నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు సమీక్ష అక్వాన్ తుపాను రూపంలో రాష్ట్రంపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న మరో విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్.డబ్ల్యూ.ఎస్. సిబ్బంది సర్వ సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గత రెండు తుపానులతో పోలిస్తే అక్వాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా గ్రామాల్లో, ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం క్యాంపు కార్యాలయంలో తన పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్నబ్, మురసు తుపానుల కారణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టం, ప్రస్తుత తుపాను తీవ్రత హెచ్చరికలు తదితర అంశాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. అక్వాన్ తుపాను ఈ నెల 20వ తేదీన నెల్లూరు- తుని మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని, వాతావరణ శాఖ అంచనాల మేరకు తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 120నుంచి145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలు తెలిపారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ నెల19,20 తేదీల్లో తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో అత్యంత అప్రమత్తత అవసరమని, అందుకు తగిన విధంగా పంచాయతీరాజ్ సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్టు స్పష్టం చేశారు. తీవ్ర తుపాను సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,నష్ట నివారణ చర్యలపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తదితర విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ“నెల రోజుల వ్యవధిలో అర్నబ్, మురసు రూపంలో రెండు తుపాన్లు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. కూటమి ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణనష్టం లేనప్పటికీ, పంట నష్టం,ఆస్తి నష్టం తప్పలేదు. తుపానుల కారణంగా దాదాపు 520 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు ధ్వంసమయ్యాయి. అందుకు సంబంధించిన నివేదిక తెప్పించుకుని, ధ్వంసమైన రోడ్లు వెంటనే పునరుద్ధరించేలా ఆదేశాలిచ్చాం. గత రెండు తుపానులకు స్పందించిన విధంగానే అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు పూర్తి యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకోవాలి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతింటే, మొదట ఉపరితల భాగం దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. రోడ్లకు అడ్డంగా చెట్లు కూలితే తక్షణం వాటిని తొలగించే ఏర్పాట్లు చేయాలి. అక్వాన్ తుపాను గమనంపై స్పష్టత లోపించినందున,తీవ్ర తుపాను తీరం తాకే అవకాశాలున్న అన్ని జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం,వాతావరణ శాఖ నుంచి వచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలి. గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు తగ్గిన వెంటనే నీరు వెళ్లిపోయేలా ఏర్పాటు చేయాలి. పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. రైతుల్ని అప్రమత్తం చేయండి గ్రామీణ ప్రాంతాల్లో వరిపంట చేతికి వస్తుందనగా అక్వాన్ తుపాను రూపంలో విపత్తు సంభవించడం దురదృష్టకరం. రైతులకు పంట నష్టం తగ్గించేందుకు కూడా పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది తగిన సహకారం అందించాలి. కోతకు వచ్చిన పంటను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.దీంతో పాటు విద్యుత్ స్తంభాలు పెద్ద ఎత్తున నేలకొరిగే అవకాశాలు ఉన్నందున,వాటి తక్షణ పునరుద్ధరణకు విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలి.భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల వివరాలు తక్షణం సేకరించి, పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభం కావాలి
6
283
4
1,048
34,211
పల్లె పండుగ కార్యక్రమం ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో రూ.2.99 కోట్ల ఖర్చుతో నిర్మితమైన కొత్తపేట మెయిన్ రోడ్డు. #AndhraPradesh #IdhiManchiPrabhutvam #PawanKalyanMarkGovernance #CheppaamChestunnaam
1
126
317
3,775
అగ్ని ప్రమాదంలో వలలు కోల్పోయిన మత్స్యకారులకు అండగా నిలవండి •పరిహారం చెల్లించే ఏర్పాటు చేయండి •ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె. పల్లెపాలెంలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులు షెడ్లలో ఉంచిన వలలు దగ్ధమైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులంతా వలలు షెడ్లలో ఉంచుకోగా , అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించినట్టు కలెక్టర్ వివరించారు. మొత్తం 250 నుంచి 300 వరకు వలలు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఉప ముఖ్యమంత్రివర్యులు దిశా నిర్దేశం చేశారు. తుపాను కారణంగా వేట విరామం ఉండడం, వలలు కాలిపోవడంతో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా బాధిత కుటుంబాలకు తక్షణమే నిత్యావసర సరుకులు అందజేయాలని కలెక్టర్‌ ను ఆదేశించారు. నష్టపరిహారం అందించాలని, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2.O పథకం కింద నష్టపోయిన వలలను తిరిగి అందించే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వలలు నష్టపోయిన మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. @PIB_India @IPR_AP @pibvijayawada
6
174
2
764
21,778
అగ్ని ప్రమాదంలో వలలు కోల్పోయిన మత్స్యకారులకు అండగా నిలవండి •పరిహారం చెల్లించే ఏర్పాటు చేయండి •ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె. పల్లెపాలెంలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులు షెడ్లలో ఉంచిన వలలు దగ్ధమైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులంతా వలలు షెడ్లలో ఉంచుకోగా , అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించినట్టు కలెక్టర్ వివరించారు. మొత్తం 250 నుంచి 300 వరకు వలలు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఉప ముఖ్యమంత్రివర్యులు దిశా నిర్దేశం చేశారు. తుపాను కారణంగా వేట విరామం ఉండడం, వలలు కాలిపోవడంతో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా బాధిత కుటుంబాలకు తక్షణమే నిత్యావసర సరుకులు అందజేయాలని కలెక్టర్‌ ను ఆదేశించారు. నష్టపరిహారం అందించాలని, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2.O పథకం కింద నష్టపోయిన వలలను తిరిగి అందించే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వలలు నష్టపోయిన మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.
6
328
1,182
33,828
కాంగ్రెస్ పార్టీ ఎంపీ బలరాం నాయక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. “కాంగ్రెస్ పార్టీని నమ్ముకోండి.. మొగుళ్ల అవసరం లేదు. బిల్లులు, పెన్షన్లు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని, కుటుంబ వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం ఏ ప్రభుత్వానికైనా బాధ్యతే తప్ప, అది ఎవరో నాయకులు చేస్తున్న వ్యక్తిగత ఉపకారం కాదు! ప్రజా సమస్యలు, అభివృద్ధి, ఉద్యోగాలు, హామీల అమలుపై సమాధానం చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజాసేవ పేరుతో వ్యక్తిగత సంబంధాలను రాజకీయాలకు ముడిపెట్టడం కాంగ్రెస్ నాయకుల బాధ్యతాయుత రాజకీయాలకు నిదర్శనమా? ప్రజల ఆత్మగౌరవం కంటే రాజకీయ ప్రచారమే ముఖ్యమా? @revanth_anumula @seethakkaMLA #CongressFailedTelangana
1
46
160
2,558
హోటల్ లో టిఫిన్ తిని బిల్లు కట్టకుండా పారిపోతుండగా యజమానికి దొరికిపోయి తరచూ తన్నులు తినే నాగార్జున, సూట్కేసు కంపెనీలతో ప్రారంభమైన వైసీపీ పార్టీ ఆఫీసులో కూర్చుని జనసేన పార్టీ నేతలు, సిబ్బంది మీద చిల్లర విమర్శలు చెయ్యడం హాస్యాస్పదం.
9
613
6
2,035
68,327
రాబోయే 23 మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజలు కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలి * స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మరింత బాధ్యత పెరిగింది * శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశంతో జనసేన పార్టీ నాయకులు కూటమి స్ఫూర్తిని నిలిపేలా పనిచేస్తున్నారు * యువతకు కూటమి పార్టీలు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నాయి * ⁠తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కూటమి పార్టీల విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రతి చోటా కూటమి పార్టీల అభ్యర్థులను ప్రజలు గెలిపించడం, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి స్పష్టం చేసింది అని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. ప్రజలు ప్రభుత్వంపై, పాలనపై పెట్టుకున్న నమ్మకాన్ని అది మరోసారి తెలియజేయడమే కాకుండా, మాపై మరింత బాధ్యతలను పెంచింది అని అన్నారు. 2024 సాధారణ ఎన్నికల మాదిరే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు కూటమి పార్టీల పక్షాన నిలిచారని ఆయన పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కూటమి పార్టీల నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ "రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీలు ఐక్యంగా కలిసి పనిచేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సవాళ్లను అంతా కూర్చుని మాట్లాడుకుని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. దీనిని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ప్రజా సంక్షేమంతోపాటు గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూసే ప్రజలు కూటమి పార్టీలను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. *వైసీపీతో ప్రజలు విసిగిపోయారు* కూటమి పార్టీలు కొనసాగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన విధ్వంసం, అవినీతి పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మెజారిటీ నేడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించడం శుభపరిణామం. తర్వలో జరగనున్న 23 మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజల ఆశీర్వాదం ఇలాగే కొనసాగాలి. *కూటమి స్ఫూర్తి కి అనుగుణంగా జనసేన పని చేస్తుంది.* ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం చాలా నష్టపోయింది. ప్రజలు ఆయన పరిపాలనపై విసుగు చెందారు. వాటిన్నంటిని అధిగమించి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్దంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాల్గొన్నారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ప్రకారం ఎన్డీయే పార్టీల అభ్యర్థులు ఎక్కడ నిలబడిన వారి గెలుపు కోసం జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి చేస్తున్నారు. కూటమి స్ఫూర్తిని నిలిపేలా జనసేన పార్టీ పని చేస్తుంది. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసికట్టుగా యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇచ్చాం. కొత్త ఆలోచనలతో వస్తున్న యువతకు సీట్లు ఇచ్చి అవకాశం కల్పిస్తున్నాం. ప్రజలు కూడా యువనాయకత్వానికి మద్దతుగా నిలవాలి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సమష్టిగా పనిచేస్తున్న కూటమి పార్టీలకు ప్రజలు ఆశీర్వాదం కావాలి. త్వరలో జరగబోయే 23 మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజా ఆశీర్వాదం కొనసాగాలి" అని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. Link: youtu.be/MnB1JQAD7V4?si=ps0u…
9
222
928
34,150
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు విజయమే లక్ష్యంగా చేపట్టిన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ ప్రచార వాహనం వైరా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించింది. గొల్లెనపాడు , అష్టగుర్తి, గొల్లపూడి పాలడుగు, రెబ్బవరం,గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పట్టభద్రులను కలిసి జనసేన అభ్యర్థికి మద్దతుగా ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు షేక్ అమీర్ పాషా,గోపి,శివ, శ్రీరామ్, లక్ష్మణ్,పాల్గొన్నారు. #MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
4
40
163
1,823
The complete backstory..
5
335
4
1,036
21,816
Over the years, I have learnt from my leader, inspiration and mentor, Sri.Pawan Kalyan garu, that challenges and obstacles are inevitable on the path of Dharma. His indomitable spirit, resilience and patience have taught me to remain steadfast in my principles and values, stand with courage in the face of adversity and never allow any challenge to weaken my resolve. I am, and shall forever remain, a deeply committed Janasainik. Jai Hind. #SatyamevaJayate
118
976
98
2,652
244,364
ఈ బూటకపు భాగోతం పవన్ కళ్యాణ్ గారికే కాదు, ఆయనతో పాటు మాకు, మా సిబ్బందికి, మా నాయకులకు కూడా తెలీదు.. ఎందుకంటే ఇది జనసేన పార్టీ, పార్టీకి సంబంధించిన వ్యక్తుల ప్రమేయం లేకుండా జరిగింది కాబట్టి, జరిగే వరకు తెలిసే అవకాశమే లేదు కాబట్టి. అయినా నిజంగా మీలాగా అవినీతి, అక్రమాలు చేయదలిస్తే 7 కోట్ల కోసం నిరుద్యోగులకు ఉద్యోగాల వల వేయాలా ? మీ అధినేత తండ్రి అధికారంలో ఉన్నప్పుడే వేల కోట్లు వెనకేసుకున్న మీకు ఇలాంటివి తెలీకుండా ఉంటాయా ? లేక మీకున్న దోపిడి బుద్ధే అందరికీ ఉంటుంది అనుకుంటున్నారా ? మీ జగన్ పీఏ 1000 కోట్ల యవ్వారం పైన వివరణ ఇవ్వలేక, ఇలాంటి కాకమ్మ కథలు చెప్పుకుంటూ తిరగడానికి సిగ్గు అనిపించట్లేదా ?
నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఎరవేసి.. కోట్లలో వసూలు చేసిన జనసేన నేతలు ఆఖరికి గుట్టు రట్టవడంతో దళిత ఉద్యోగిని బలిచేసి బడా నేతలు ఎస్కేప్ పోలీసులు బాధితురాలిని టార్చర్ చేయడంతో.. హైకోర్టు జోక్యం. దెబ్బకి హడలిపోయి స్టేషన్‌లో రాజీ కోసం జనసేన నేతలు ప్రయత్నాలు నీకు తెలియకుండానే ఈ భాగోతం జరుగుతోందా @PawanKalyan ? #SeizeTheLiarPK #CBNFailedCM
16
299
5
726
24,739