
It's all about #BRSParty #JaiTelangana ✊ #KCROnceAgain
Hyderabad, India
Joined June 2014
- Tweets2.9K
- Following11
- Followers3.1K
- Likes16.2K
ఉద్యమ దళపతి కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సరిగ్గా పదిహేనేళ్ల క్రితం, 16 నవంబర్ నుండి 21 నవంబర్ 2011 వరకూ సాగిన పాదయాత్ర ఒక గొప్ప జ్ఞాపకం.
వికారాబాద్ నుండి మొదలై - నవాబ్‌పేట్ - శంకర్‌పల్లి - పటాన్‌చెరు - శేరిలింగంపల్లి - కూకట్‌పల్లి - బాలానగర్ సర్కిల్ మీదుగా కుత్బుల్లాపూర్ చేరుకున్న ఆనాటి ఆరు రోజుల పాదయాత్ర సబ్బండ వర్గాల మద్ధతుతో స్పూర్తిదాయకంగా సాగింది.
జై తెలంగాణ ✊
కాంగ్రెస్ ఓటమి భయం..
తెలంగాణకు శాపం 😢
ఓడిపోతామనే భయంతో ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు..
మిగిలిన 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించని కాంగ్రెస్ సన్నాసులు.
ఎన్నికలు జరగక.. పాలకవర్గాలు లేక..
పెండింగ్‌లో పడ్డ రూ. 1,700 కోట్ల కేంద్ర నిధులు.
దద్దమ్మ రేవంత్ చేతకానితనంతో..
తెలంగాణకు తీవ్ర నష్టం.
#CongressFailedTelangana
BRSTrending retweeted
The difference between a leader who commands the people’s mandate and a Chief Minister who depends on the Congress high command is evident in the seating arrangements at Sonia Gandhi’s book release event.
TVK chief Vijay, who won 108 seats on his own, was given a place beside Rahul Gandhi. Akhilesh Yadav, despite leading the third-largest party in the Lok Sabha with 37 MPs, was seated beside Sonia Gandhi along with his wife.
The message is loud and clear. Political stature and respect is earned and not bought by proximity to the high command.
Telangana’s self-respect, identity and pride can be safeguarded only by BRS. And the undisputed symbol of Telangana’s pride remains KCR.
Telangana’s pride. Telangana’s identity. KCR. ✊🚘
@KTRBRS
BRSTrending retweeted
No alignment approval from NHSRCL. No requisition from the Railway Ministry. Yet the Telangana Congress govt is in a tearing hurry to snatch over 1,500 acres in Shamshabad in the name of a "bullet train hub"!
Why the rush to dispossess farmers before approvals even exist? Whose real estate interests are being served?
Read the full exposé 👇
thesouthfirst.com/telangana/…
ఛలో నిర్మల్ ✊🔥
అలవికాని హామీలతో రైతన్నలను నమ్మించి గద్దెనెక్కి..
నట్టేట ముంచిన కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ సమరభేరి🔥
రైతు గర్జన సభకు వేలాదిగా తరలివద్దాం..
రైతులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం!
📅 తేదీ : 11 నవంబర్, 2026
⏰ సమయం : సాయంత్రం 4:00 గంటలకు
📍 వేదిక : ఎన్టీఆర్ స్టేడియం, నిర్మల్
LIVE: జనగామ జిల్లా, కొన్నె గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మరియు ఎమ్మెల్యే @PRR_BRS
nitter.gq/i/broadcasts/2OdXlpPjQ…
BRSTrending retweeted
కేవలం లక్ష రూపాయల ఖరీదు చేసే ఐఫోన్ 17 Pro Max వాడుతున్న ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు.
ఐఫోన్ 18 Pro Max వచ్చి రెండు నెలలు అయినా ఇంకా కొనుక్కోలేని నిరుపేద!
ఏండ్ల తరబడి ఫ్లైఓవర్లు పెండింగ్…
బీజేపీని ఆడుకున్న జెన్-జీ యువత 🔥
పెండింగ్ ఫ్లైఓవర్ల పేరిట తెలంగాణ బీజేపీని ఆపుతామంటున్న నెటిజన్లు!
ఏమీ లేని ఆకు.. ఎగిరెగిరి పడినట్లు.. తెలంగాణకు అమిత్ షా వచ్చి వెళ్ళగానే, ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ పోస్ట్ చేసిన తెలంగాణ బీజేపీ.
దీంతో తెలంగాణలో కేంద్రం నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు, పదుల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న పలు ఇతర ప్రాజెక్టుల పేర్లతో జెన్-జీ నెటిజన్లు అకౌంట్లను క్రియేట్ చేసి.. బీజేపీని కిందామీద పడేసి ఆడుకున్నారు.
ఒక్క రూపాయి పని చేయకుండా..
తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ సన్నాసులకు గట్టి షాక్ ఇచ్చిన తెలంగాణ యువత!
తుగ్లక్ రేవంత్ మార్క్ పాలనతో హైదరాబాద్‌లో నీటి కటకట
నదుల్లో వెయ్యి టీఎంసీల నీళ్లు సముద్రం పాలు.. హైదరాబాద్ నగరంలో మాత్రం గుక్కెడు నీళ్లకు తండ్లాట
ప్రత్యామ్నాయం చూపకుండా ట్యాంకర్లను సీజ్ చేస్తూ జనం గొంతు ఎండిపోయేలా చేస్తున్న తుగ్లక్ రేవంత్
ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ మార్క్ అసమర్థత తెచ్చిన కరువు.
#CongressFailedTelangana
పదవుల కోసం ఢిల్లీ నాయకుల వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ - బీజేపీ దద్దమ్మలు!
కేంద్రమంత్రి బండి సంజయ్
అమిత్ షా దగ్గర బౌన్సర్‌లా మారిండు!
ప్రియాంక గాంధీ దగ్గర సీఎం అని కూడా చూడకుండా
రేవంత్ రెడ్డిని నెట్టేసిండ్రు!
అమిత్ షా వచ్చి చేతులు ఊపి వెళ్లడం తప్ప తెలంగాణకు ఇచ్చిందేమిటి?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లావఝ్జల సదాశివుడు స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్నాను.
పురస్కారాలు అందుకున్న చమన్ సింగ్, సంగిశెట్టి శ్రీనివాస్, తిరునగరి దేవకీదేవి, కవ్వంపల్లి స్వామి గార్లకు శుభాకాంక్షలు.
గోదావరి గొంతుక, ప్రజా కవి మల్లావఝ్జల సదాశివుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దుస్థితిని ఎత్తిచూపేందుకు రాసిన 'తలాపున పారుతుంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి' అనే పాట నేటి తెలంగాణ పరిస్థితికి కూడా అద్దంపడుతుంది.
ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఎమ్మెల్సీ @TheDeshapathi గారికి, వికాస సమితి బృందానికి, మల్లావఝ్జల సదాశివుడు గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.
🔸 మేడిగడ్డ బ్యారేజ్ చెక్కుచెదరలేదు.. కాంగ్రెస్ అబద్ధాల ప్రచారం బట్టబయలైంది
🔸 వృథాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోసి SRSP, నిజాంసాగర్ ప్రాజెక్టులను నింపాలి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS డిమాండ్
🔸 రైతుల పంటలను కాపాడటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం
🔸 మేడిగడ్డ వద్ద 85 పిల్లర్లు నిటారుగా ఉన్నాయి.. కూలిపోయిందన్న ప్రచారం పచ్చి అబద్ధం
🔸 కేసీఆర్ పేరు రాకూడదనే దుర్బుద్ధితోనే నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారా?
🔸 రెండు టీఎంసీల ప్రవాహం ఉన్నా ఎత్తిపోయరా? పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వ మొద్దు నిద్ర
🔸 సాగునీరు విడుదల చేయకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో రైతు పోరుబాట తప్పదు
మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోయిందని, కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చేస్తోన్న ప్రచారం పచ్చి అబద్ధమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను, రైతుల గోసను స్వయంగా చూసిన ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మొదట కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాణహిత-గోదావరి సంగమ ప్రాంతాన్ని, సిరోంచ, కాళేశ్వరం మధ్య గోదావరి బ్రిడ్జ్ వద్ద ఉన్న నీటి ప్రవాహాన్ని, కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించి తదనంతరం నేరుగా మేడిగడ్డ బ్యారేజీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం బ్యారేజ్ పైకి వాహనాలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు వారితో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు.
ఈ సందర్భంగా శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... 👇🏻
మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 85 పిల్లర్లతో నిటారుగా చెక్కు చెదరకుండా నిలబడి ఉన్న వాస్తవాన్ని స్వయంగా మీడియా కెమెరాల సాక్షిగా ప్రజలందరూ గమనించవచ్చని పేర్కొన్నారు. గత మూడు వర్షాకాలాల్లో సంభవించిన భారీ వరదలు, లక్షలాది క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకొని నిలబడిన ఈ బ్యారేజిలో ఒక్క పిల్లర్ కూడా కొట్టుకుపోలేదని స్పష్టం చేశారు. కేవలం రెండు మూడు పిల్లర్లకు చిన్నపాటి మరమ్మతులు అవసరమైతే, వాటిని మూడేళ్లుగా బాగుచేయడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుత కరువు పరిస్థితుల్లోనూ మేడిగడ్డ వద్ద దాదాపు 22,000 క్యూసెక్కుల ప్రవాహం (రోజుకు సుమారు 2 టీఎంసీల మేర నీరు) వృథాగా దిగువకు తరలిపోతోందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కన్నెపల్లి పంపులను ఆన్ చేసి ఆ నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ (SRSP), నిజాంసాగర్ సహా మిడ్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ వంటి రిజర్వాయర్లన్నింటినీ నింపవచ్చని వివరించారు.
రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 రోజులు నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ ప్రాజెక్టును పూర్తిగా నింపవచ్చని, రోజుకు అర టీఎంసీ చొప్పున నెలన్నర రోజులు పంపింగ్ చేస్తే 18 టీఎంసీల సామర్థ్యం గల నిజాంసాగర్‌ను పూర్తిగా నింపే అవకాశముందని గుర్తుచేశారు.
నీరు లేక గుత్ప, అలీసాగర్, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి, నవాబు, వేంపల్లి, సారంగాపూర్, మెంట్రాజ్‌పల్లి లిఫ్టుల కింద, నిజాంసాగర్ ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల పంటలు ఎండుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
గోదావరి జలాలను ఎత్తిపోసి చెరువులు, రిజర్వాయర్లు నింపితే కేసీఆర్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ద్వేషపూరితమైన దుర్బుద్ధితోనే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తోందని ఆరోపించారు. ఇక్కడ నీటిని దిగువకు వదిలేస్తుంటే, చంద్రబాబు ఆ నీటిని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం వరకు తరలించుకుపోతున్నారని, కానీ తెలంగాణలో పక్కనే ఉన్న ప్రాజెక్టులకు మాత్రం ఈ ప్రభుత్వం నీరివ్వడం లేదని దుయ్యబట్టారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రస్తుతం కేవలం 4,000 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉండగా, మేడిగడ్డ వద్ద 22,000 క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, అక్కడ ప్రాజెక్టు కడతామని చెప్పడం ప్రజలను మోసగించే సరికొత్త డ్రామా అని కొట్టిపారేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన రాక్షస వైఖరిని, దుర్బుద్ధిని విడనాడి, ఇప్పటికైనా తక్షణమే మోటార్లు ఆన్ చేసి వృథాగా పోతున్న నీటిని ప్రాజెక్టులకు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించి సాగునీరు అందించకపోతే తెలంగాణ రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని ఏకం చేసి పెద్దఎత్తున 'రైతు పోరుబాట' ఉద్యమాన్ని చేపడతామని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.
ఈ పర్యటనలో వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు @GovardhanBRS, గంప గోవర్ధన్, @JeevanReddyBRS, @GaneshBigalaMLA, @surender_jajala, @Hanmanth_Shinde, విఠల్ రావు, షేక్ ముజీబుద్దీన్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
📢 బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం 🆘
🤑 వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో❗
♦️ 41 బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల కోసం 82 ఎకరాలు కేటాయించిన కేసీఆర్ ప్రభుత్వం
🚨 వాటిని దక్కించుకోవాలని కాంగ్రెస్ సర్కార్ ప్లాన్
⛔ కుల సంఘాలను తప్పించి, ట్రస్టుల రద్దుకు నిర్ణయం. వాటి స్థానంలో భవన నిర్వహణ కమిటీల ఏర్పాటు!
📣 పేరుకే కమిటీలు.. పెత్తనం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే
భూముల వేలం తప్ప మరేదీ ఆలోచించని కాంగ్రెస్ సర్కార్.. బీసీ భవనాలను మాత్రం వదిలిపెడుతుందా? ఆత్మగౌరవ సౌధాల నుంచి, విలువైన భూముల నుంచి కులసంఘాలను వెళ్లగొట్టి, ట్రస్టుల్ని రద్దు చేసి ఆ ఆస్తుల్ని చేజిక్కించుకోవాలని రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందుకోసం భవన నిర్వహణ కమిటీల ముసుగులో పెత్తనం తన చేతిలోకి తీసుకోబోతున్నది. ఇందుకోసం బీసీ సంఘాలతో సంప్రదించకుండా, గుట్టుచప్పుడు కాకుండా జీవో-14 జారీ చేసింది.
ఇప్పుడున్న కులసంఘాలను నామమాత్రం చేసి.. అధికారాలన్నీ సొంతం చేసుకునేలా ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. గతంలో ఖరారు చేసిన ట్రస్ట్‌లన్నింటినీ రద్దు చేసి, మళ్లీ సర్కార్ ముందు మోకరిల్లేలా నిబంధనలు రూపొందించింది. తద్వారా ఆయా భవనాలను, బీసీ కులాలకు గతంలో ప్రభుత్వం కేటాయించిన భూములను కొట్టేసేందుకు పక్కా ప్లాన్ వేసి, అమలు చేస్తున్నది. ఇందుకు సంబంధించి అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. నిబంధనలు మార్చి గుట్టుగా జీవో 14 తెచ్చింది. దీంతో వేల కోట్ల విలువైన భూములు, ఆత్మగౌరవ భవనాల నిర్వహణ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నది.
Happy to see Lakshmi Garu back home with her family 😊
"KTR Anna kept his promise and brought me home": Telangana woman rescued from Muscat thanks to BRS leader's intervention
Read @ANI Story |
aninews.in/news/national/gen…
#KTR #muscat #rescue
మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుట్ర.
ప్రాజెక్ట్ చుట్టుపక్కల పేలుళ్లు నిషేధం ఉన్నప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించి బ్లాస్టింగ్ చేస్తున్నారు. రాత్రి పూట జరుగుతున్న ఈ జిలెటిన్ బ్లాస్టింగ్ వల్ల పక్కనే ఉన్న తిప్పారం గ్రామంలోని ఇళ్లకు బీటలు వారుతున్నాయి.
మల్లన్న సాగర్ కట్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసి, కుంగదీసి మళ్లీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నింద వేయాలనేదే కాంగ్రెస్ దుష్ట పన్నాగం.
రాజకీయ కక్షతో ప్రజల జీవనాధారమైన తెలంగాణ ప్రాజెక్టులను నాశనం చేయకండి 😡
#MallannaSagar
కేసీఆర్ పాలన.. పవర్‌ఫుల్ జమానా⚡ 🔥
కోతలకు చెక్.. కరెంట్ కష్టాలకు ఫుల్‌స్టాప్!
🔹 సంస్కరణలతో విద్యుత్తు రంగానికి నయా లుక్
🔹 జెన్‌కో ఆధ్వర్యంలో భారీగా విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు
🔹 మెరుపు వేగంతో పెండింగ్ విద్యుత్తు ప్లాంట్ల పూర్తి
🔹 2014లో 7,778 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం
🔹 2023 నాటికి ఏకంగా 18,567 మెగావాట్లకు పెంపు
💡 చీకట్లను చీల్చి.. తెలంగాణను వెలుగుబాటలో నడిపించిన నాయకుడు కేసీఆర్! ⚡🌟
ఉమ్మడి రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో మగ్గింది తెలంగాణ. కరెంటు ఎప్పుడొస్తుందో, రాదో తెల్వని దుస్థితి. పొలాల దగ్గరే పడుకునే రైతులు.. అర్ధరాత్రి పాముకాట్లు.. లోవోల్టేజీ కష్టాలు.. గంటలతరబడి పవర్‌కట్. ఆ దశాబ్దాల గోసను ఒక్కసారిగా తుడిచేసిండు కేసీఆర్. సాధించిన తెలంగాణను వెలుగుజిలుగుల రాష్ట్రంగా మలిచాడు. విద్యుదుత్పత్తిని పెంచాడు. అవసరమైన సంస్కరణలను తీసుకొచ్చాడు. కన్వర్టర్లు, ఇన్వర్టర్లు, జనరేటర్లు లేని రాష్ట్రంగా మలిచాడు. రెప్పపాటైనా కరెంటుపోని స్థాయికి తెలంగాణను నిలిపాడు.
ఉమ్మడి రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో మగ్గిన తెలంగాణ బిడ్డలు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెల్వని కరెంటు కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. వెలుగు దారులు చూపే నాథుడు లేక కుమిలిపోయారు. అప్రకటిత విద్యుత్తు కోతలు.. రాత్రిపూట కరెంటుతో అరిగోస పడ్డారు. పరిశ్రమలకు వారంలో రెండు మూడు రోజుల పవర్ హాలిడేలు ప్రకటించిన దుస్థితి. వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంట్.. ఆ వచ్చీరాని కరెంటు కోసం కటిక చీకట్లలో రైతుల పడిగాపులు! షాపులు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్లల్లో డీజిల్ జనరేటర్ల మోతలు! లోవోల్జేజీ సమస్యలు, వ్యవసాయ మోటర్లు కాలిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం, కరెంట్ అందక.. పంటలకు నీరు పారక కండ్ల ముందు పంట ఎండుతుంటే కలతతో రైతుల ఆత్మహత్యలు..ఇవీ నాటి సమైక్య పాలనలో తెలంగాణ చవిచూసిన విద్యుత్తు కష్టాలు!
గ్రామాల్లో ఉదయం మూడు, సాయంత్రం మూడు గంటలు మాత్రమే త్రీ ఫేజ్ కరెంట్ వచ్చేది. రాత్రంతా సింగిల్ ఫేజ్ కరెంట్ అందిన రోజులవి. చివరికి అంత్యక్రియలకు స్నానాలు చేయలేని దుస్థితిని తెలంగాణ అనుభవించింది. ఇవే కాదు, బొగ్గు ఉండి కూడా థర్మల్ ప్లాంట్లు నిర్మించని.. విద్యుత్తు డిమాండ్‌కు తగినట్లు సబ్‌స్టేషన్లు, విద్యుత్తు లైన్ల నిర్మాణాలు చేపట్టని ఆనాటి ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నకలుగా ఈ ప్రాంతం నిలిచింది. ఇవన్నీ స్వరాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదాయి. మన రాష్ట్రాన్ని మనం సాధించుకుంటేనే బాగుపడగలమన్న ఆలోచనను రేకెత్తించాయి.
కేసీఆర్ పాలనలో అసామాన్య విజయాలు
ఎట్టకేలకు స్వరాష్ట్రం సిద్ధించి ఉద్యమ నేత కేసీఆర్ సీఎం అయ్యాక ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాలని, విద్యుత్తు కష్టాల నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలని, అన్ని రంగాలకు నిరంతర విద్యుత్తునందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ టార్గెట్‌ను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేసింది. విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేసింది. ప్లాంట్ల నిర్మాణం, ఉత్పత్తి సామర్థ్యం పెంపు, విద్యుత్తు పంపిణీ సరఫరా వ్యవస్థల విస్తరణ, సోలార్ విద్యుత్తు అభివృద్ధి దిశగా చకచకా అడుగులు వేసింది. స్వరాష్ట్ర ప్రదాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ క్రమక్రమంగా అద్భుత పురోగతి సాధించింది. కొద్ది కాలంలోనే జనరేటర్లు, ఇన్వర్టర్లు మాయమయ్యాయి. డీజిల్ జనరేటర్లు మూలనపడ్డాయి.
మోటర్ రీపేర్ సెంటర్లు మూతపడ్డాయి. విద్యుత్తులో కేసీఆర్ సృష్టించిన విప్లవం.. తెలంగాణకు వెలుగుల వైభవాన్ని అద్దింది. ఒకప్పుడు యంత్రాలు నడువాలంటే కరెంటు కోసం పక్కచూపులు చూసే స్థితి నుంచి కోతల్లేని స్థితికి తెలంగాణ విద్యుత్తు రంగం పురోగ మించింది. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో కరెంట్ కోతలు దూరమయ్యాయి. పవర్ హాలిడేలు మాయమయ్యా యి. పరిశ్రమలకు భరోసా దొరికింది. పెట్టుబడిదారుల్లో దిలాసా నిండింది. మొ త్తంగా తెలంగాణను విద్యుత్తు ధగధగల్లో వెలిగించి ప్రపంచ పటంలో కేసీఆర్ జమానా ప్రకాశింపజేసింది. విద్యుత్తు కటకట స్థితి నుంచి స్వయంసమృద్ధిని సాధించడమే కాకుండా.. మిగులు విద్యుత్తు దిశగా ముందుకు సాగింది. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇక్కడి విద్యుత్తు విజయాలు మొన్నటివరకూ అనేక రాష్ర్టాలకు కేస్ స్టడీస్‌గా మారాయి.
తెలంగాణ రాక ముందు కరెంటు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో భగవంతునికెరుక! ఇయ్యాల ఇన్వర్టర్లు లెవ్వు.. స్టెబిలైజర్లు లెవ్వు..కన్వర్టర్లు లెవ్వు.. జనరేటర్లు మాయమైపోయినయ్. మోటర్ వైండింగ్ వర్క్‌షాపులన్నీ దివాలా తీసినయ్.. ఇయ్యాల మోటరు కాలది.. ట్రాన్స్‌ఫార్మర్ కాలది.. ఎవల ఇంట్ల బుగ్గ కాలది.. 24 గంటలు ప్రతి ఒక్క రంగానికీ అత్యంత నాణ్యమైన కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణనే. కరెంట్ వాడేదాంట్లో.. తలసరి విద్యుత్తు వినియోగంలో ఒకనాడు భారత దేశంలో కటకటపడ్డ తెలంగాణ.. ఇయ్యాల దేశంలోనే నవంబర్ వన్ రాష్ట్రమని గర్వంగా మీకు తెలియజేస్త ఉన్న..
-నాడు ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
కొత్తవి ప్రారంభించి.. కోతలను అధిగమించి
కరెంట్ కష్టాలను అధిగమించడం.. లోటును పూడ్చడంలో భాగంగా కేసీఆర్ సర్కార్ మిషన్‌మోడ్‌తో పని చేసింది. గత ప్రభుత్వాలు పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ ప్రైవేట్ రంగంలో విద్యుత్తు ఉత్పాదకతను ప్రోత్సహిస్తే కేసీఆర్ హయాంలో ప్రభుత్వ రంగంలో తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో ప్లాంట్లను పెద్ద ఎత్తున వినియోగంలోకి తెచ్చింది. అనేక పెండింగ్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను మెరుపు వేగంతో పూర్తిచేసింది. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లో 600 మెగావాట్లు, దిగువ జూరాలలో 240 మెగావాట్లు, పులిచింతలలో 120 మెగావాట్ల ప్లాంట్లను వినియోగంలోకి తెచ్చింది. ఇక దేశంలోనే తొలిసారిగా రికార్డు సమయంలో 48 నెలల్లోనే పాల్వంచ-కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (స్టేజ్-7)లో 800 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను వినియోగంలోకి తెచ్చింది.
ఇదో రికార్డుగా చెప్పవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను మెరుపువేగంతో పూర్తిచేసింది. ఒకోటి 270 మెగావాట్ల సామర్థ్యం గల 4 యూనిట్లను ప్రారంభించింది. నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్ జెన్‌కో ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల యాదాద్రి ఆల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పుడు ఈ నాలుగు వేల మెగావాట్ల ప్లాంటే రాష్ర్టానికి వరప్రదాయినిగా మారింది. భద్రాద్రి ప్లాంటు కూడా ఆపదలో ఆదుకుంటున్నది. బీటీపీఎస్, వైటీపీఎస్‌లే నేడు రాష్ర్టానికి విద్యుత్తు వెలుగులందిస్తున్నాయి. జెన్‌కో రోజుకు సగటున 100 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తుండగా, భద్రాద్రి నుంచి 17 మిలియన్ యూని ట్లు, యాదాద్రి నుంచి 30 మిలియన్ యూనిట్ల విద్యుత్తు రాష్ర్టానికి అందుతున్నది. అంటే దాదాపు సగం విద్యుత్తును ఈ రెండు ప్లాంట్లే అందిస్తున్నాయి.
తలసరి వినియోగమే తార్కాణం
ప్రగతి సూచికల్లో తలసరి విద్యుత్తు వినియోగం కూడా ఒకటి. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే. 2021-22 నాటికి అది 2,140 యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటును పరిశీలిస్తే 1,255 యూనిట్లు మాత్రమే. అంటే తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం, జాతీయ తలసరి వినియోగం కన్నా 70 శాతం ఎకువ. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే 944 యూనిట్లు ఎక్కువ. జాతీయ వినియోగంతో పోల్చితే 871 యూనిట్లు అధికం. అంతలా తెలంగాణ విద్యుత్తు రంగం ఎగబాకింది. విద్యుత్తు రంగంలో కేసీఆర్ సర్కార్ సృష్టించిన విప్లవానికి ఇదే నిదర్శనం. 60 ఏండ్ల సమైక్యపాలనలో సాధ్యంకాని ఉత్పత్తి కేంద్రాలు, సబ్‌స్టేషన్లు, లైన్లు నిర్మించిన ఫలితంగా తలసరి విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది.
నెట్‌వర్క్ విస్తరణ కేసీఆర్ చలవే
ఈ రోజు 19వేల మెగావాట్ల పీక్ డిమాండ్ ను అధిగమిస్తూ 340 మిలియన్ యూనిట్ల వి ద్యుత్తును రాష్ట్రం సరఫరా చేయడం కేసీఆర్ చలవే. లోడ్ పెరిగినా పీక్ డిమాండ్ రికార్డుల మోత మోగినా సరఫరా చేస్తున్నారంటే కేసీఆర్ వేసిన పునాదులపైనే. విద్యుత్తు రంగం బలోపేతం, కరెంట్ సరఫరా, పంపిణీ వ్యవస్థల మె రుగుకు నాటి ప్రభుత్వం రూ.39,321 కోట్లు ఖర్చుచేసింది. ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ బలోపేతానికి రూ.18,874 కోట్లు వెచ్చించింది. పంపిణీ నెట్‌వర్క్‌ను పెంచడమే లక్ష్యంగా పనిచేసింది. పల్లెప్రగతిలో రూ.506 కోట్లు, పట్టణ ప్రగతిలో రూ.249 కోట్లను కేవలం గ్రామీణ, అర్బన్ విద్యుత్తు వ్యవస్థలను మెరుగుపరిచేందుకు వెచ్చించింది. 2023లో పీక్ డిమాండ్ 15,497 మెగావాట్లు మాత్రమే. 2025లో 15,906 మెగావాట్లు మాత్రమే. 2026కు వచ్చేసరికి 19,892 మెగావాట్లకు చేరింది. కాంగ్రెస్ సర్కార్ ఒక్క కొత్త సబ్‌స్టేషన్‌ను కూడా నిర్మించలేదు. కొత్త లైన్లను విస్తరించలేదు. కేసీఆర్ నిర్మించిన వ్యవస్థలనే వాడుకుని విద్యుత్తును సరఫరా చేస్తున్నది... ntnews.com/telangana/telanga…
#PowerFullTelangana
LIVE: ఈఆర్సీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS nitter.gq/i/broadcasts/2AMXALjmR…
BRSTrending retweeted
తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ప్రముఖ కవి, గీత రచయిత, గోదావరి గొంతుక "మల్లావఝుల సదాశివుడు" స్మారక పురస్కార ప్రదానోత్సవం
🗓️ తేదీ: 03.11.2026, సాయంత్రం 5:00 గంటలకు
📍 వేదిక: మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీయర్స్ ఆడిటోరియం), ఖైరతాబాద్, హైదరాబాద్
ముఖ్య అతిథిగా శ్రీ @KTRBRS గారు హాజరుకానున్నారు.
సాహితీ ప్రియులందరికీ ఇదే సాదర ఆహ్వానం! 💐























