YS జగన్మోహన్ రెడ్డి మాస్ లీడర్..
దేశంలో అత్యధిక మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత YS జగన్మోహన్ రెడ్డి..
2024 ఓటమి తరువాత జగన్ సైన్యం సైలెంట్ మోడ్‌లోకి వెళ్లింది..
YS జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు మాత్రమే ..
అభిమానులు బయటకు వస్తూ అభిమానాన్ని చాటుకున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ..కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు..
టీడీపీ, జనసేనతో పోల్చుకుంటే YSRCP అభిమానుల్లో, నేతల్లో, కార్యకర్తల్లో డెమొక్రటిక్ థింకింగ్ ఎక్కువుగా ఉంటుంది.
2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఏపీలో దాడులు , దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన ఏ హామీని కూడా సరిగా నెరవేర్చలేదు. చంద్రబాబు తన దృష్టి అంతా అమరావతి మీదనే పెట్టారు. రాష్ట్రంలో రెడ్ బుక్ కరళా నృత్యం చేస్తోంది.విపక్షాలపై కర్కశంగా రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారు పాలకులు. గ్రామాల్లో YSRCPలో యాక్టివ్‌గా ఉండేవారిపై దాడులు చేశారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ప్రాణాలు తీశారు.అయినా.. YSRCP ఎక్కడా కూడా అన్ డెమొక్రటిక్‌గా వెళ్లలేదు. ప్రజాస్వామ్యయుతంగానే న్యాయ పోరాటం చేశారు. కోర్టులు తలుపులు తట్టి న్యాయం పోరాటం చేశారు.
స్థానిక ఎన్నికల్లో కూటమి పాలకులు, అధికారులు, పోలీసులు కలిసి సాగించిన ధమనకాండను దేశం మొత్తం చూసింది. ఏపీని దక్షిణ బిహార్‌తో పోలుస్తూ నేషనల్ మీడియా ప్రచారం చేసింది.
రిగ్గింగ్, సైక్లింగ్, దాడులు, దౌర్జన్యం, నామినేషన్ పత్రాలు చించేయడం, బీ ఫాంలు చించేయడం.. మహిళలు అని కూడా చూడకుండా దాడులు చేశారు. మహిళలను రోడ్ల మీద పరిగెత్తించి కొట్టారు. ఉగ్రవాదుల మీద ఎక్కు పెట్టాల్సిన AK-47లను పులివెందుల రోడ్ల మీద ఎక్కు పెట్టారు. ఇంతకంటే దారుణం ఉంటుందా.? అయినా.. కార్పొరేషన్, మన్సిపల్ ఎన్నికల్లో YSRCP మెరుగైన ఫలితాలే సాధించింది. YS జగన్ సైనికులు ఎక్కడా వెనకడుగు వేయకుండా పోరాడారు.
ఇక.. పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం సహా టీడీపీ కంచు కోటలు బద్దలయ్యాయి. కృష్ణా జిల్లా, రాప్తాడు, గన్నవరంలాంటి టీడీపీ కంచుకోటలను YSRCP సైన్యం బద్దలు కొట్టింది. ఇక.. YSR జిల్లాలో ఎన్ని నిర్బంధాలు విధించినా YS జగన్ సైనికులు విరవిహారం చేశారు. దాడులు, దౌర్జన్యాలు, పోలీసుల లాఠీలపై తిరగబడ్డారు.
చివరకు గ్రామీణ మహిళలు పోలీసుల చేతుల్లోంచి లాఠీలు లాక్కోని ప్రజాస్వామ్య, గ్రామస్వరాజ్య పరిరక్షణ కోసం పోరాడారు. జగన్ బలగం దెబ్బ చూశారు. మొదటి విడతలో 1200 పంచాయతీలు YSRCP మద్దతుదారులు గెల్చుకున్నారు. మరో 500లకుపైగా స్థానాల్లో YSRCP మద్దతుదారులు గెలిచినప్పటికీ.. బలవంతంగా అధికారం అండతో కూటమి పాలకులు లాక్కున్నారు. పంచాయతీ ఫలితాలతో గ్రామాల్లో కూటమిపై స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది. పంచాయతీ ఎన్నికలు మరో 2 విడతలు ఉన్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయో సులభంగానే ఊహించుకోవచ్చు. ప్రజాస్వామ్య బద్దంగా కాకుండా.. రెడ్ బుక్ పాలన సాగిస్తే ఫలితాలు ఇలానే ఉంటాయి. జగన్ సైన్యం ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. రిజర్వ్ డు .. జగన్ బలగం పూర్తిగా రంగంలోకి దిగితే ఆ లెక్కలు వేరుగా ఉంటాయి. ఈ విషయం కూటమి పాలకులకు కూడా బాగా తెలుసు.
మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. కానీ.. గ్రామీణులు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి ఓటేశారు. లోకేష్ పెత్తనాన్ని గ్రామాల్లో సహించమని.. మా గ్రామాల్లో పక్కోడి పెత్తనాన్ని అంగీకరించమని తేల్చి చెప్పారు. ఇది జగనన్న సైన్యం, గ్రామీణుడి విజయం.
#YSRCP #YSJagan #LocalBodyElections2026 #APNews #AndhraPradeshnews @YSRCParty @ysjagan @ysrcp_usa @YSRCP_Germany @YSRCP_Italy @YSRCPWomenVoice @YSRCPLegalCell @YSRCPWWOfficial
🤖 Made with AI
డీలిమిటేషన్ కొత్త బిల్లుకు, మహిళా రిజర్వేషన్ల సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది.
మూడు కీలక మార్పులకు ఆమోద ముద్ర వేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది:
1. జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో సమానంగా లోక్ సభ సీట్లలో 50శాతం పెంపు.
2.మరో 25 ఏళ్లపాటు ఫ్రీజ్ పొడిగింపు.
3.రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్ విభజనకు 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటారు.
ప్రతిపాదిత సవరణల ప్రకారం, లోక్ సభ స్థానాలు మార్పులు లేకుండా 25 ఏళ్లపాటు, 2051 వరకు కొనసాగించనున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు ఉంది. దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం గౌరవించినట్లైంది.
లోక్ సభ స్థానాల సంఖ్యను 850కి పెంచాలనే లక్ష్యంతో రూపొందించిన బిల్లు ఏప్రిల్‌లో ఆమోదం పొందలేదు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే అవసరమైన మూడింట రెండొంతల మెజార్టీని కేంద్రం సాధించలేకపోయింది. అప్పటి నుంచి లోక్ సభలో పార్టీ బలాబలాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. సో.. లోక్ సభలో, రాజ్యసభలో ప్రస్తుత లెక్కలు NDA కూటమికి కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి.
#DelimitationBill #WomenReservationBill #Loksabha #RajyaSabha
🤖 Made with AI
38
అమరావతి పేరుతో భారీ దోపిడీకి సీఎం చంద్రబాబు స్కెచ్ వేశారు.మళ్లీ అంచనాల పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.ఎన్నికల హడావుడిలో వేల కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారు.సచివాలయం టవర్ల అంచనా రూ. 6,641 కోట్లకు పెంచేసింది చంద్రబాబు ప్రభుత్వం.ఒకేసారి సుమారు రూ.2 వేల కోట్లు పెంచేసిన చంద్రబాబు ప్రభుత్వం.2024 డిసెంబర్ 20న సచివాలయం టవర్లకు రూ.4,688 కోట్లుగా అంచనా...
ఆ మేరకు జీవో 134 జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు అవే పనుల అంచనా వ్యయం రూ.6,641 కోట్లకు పెంచారు. ఇప్పటికే అవే టవర్లకు, అద్దాల అలంకరణకు వేల కోట్లు ఖర్చు చేశారు.
అద్దాల లంకరణకు జీఏడీ టవర్‌కు రూ.1,094 కోట్లు వ్యయం చేశారు.టవర్ 1,2కి రూ.1945 కోట్లు.. 3,4 టవర్లకు రూ.1790 కోట్లు చొప్పున వ్యయం చేశారు.ఇప్పటికే సచివాలయ టవర్ల నిర్మాణానికి రూ.13,294 కోట్లు భారీ వ్యయం చేశారు.ఇప్పుడు అదనంగా మరో రూ.2 వేల కోట్లు పెంచేసిన చంద్రబాబు ప్రభుత్వం.
ఇప్పటికే చదరపు అడుగుకి రూ.25,466 చొప్పున వ్యయం చేస్తున్నారు.. మళ్లీ ఇప్పుడు రూ.2వేల కోట్లు పెంచడంతో..చదరపు అడుగు వ్యయం రూ.29,297కి పెరిగినట్లైంది.ప్రపంచంలో ఏ భవనానికి లేనంత వ్యయం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుకు అమరావతి ATMల ఉపయోగపడుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఒక్క అమరావతిలో వేల కోట్లు ఖర్చు చేయడంపై ఇప్పటికే మేధావులు, YSRCP నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
#Amaravati #APNews #AndhraPradeshNews @YSRCParty @ysjagan @we_ysrcp @YSRCPLegalCell @YSRCPCommanders @ysrcp_usa @YSRCP_Italy @YSRCP_Germany @VizagYSRCP
🤖 Made with AI
చంద్రబాబు కోటకు బీటలు పడ్డాయి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. దాడులు, దౌర్జన్యాలు చేసినా కుప్పంలో ఫ్యాన్ స్పీడ్‌ను అడ్డుకోలేకపోయారు. కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ YSRCP విజయ ఢంకా మోగించింది. కుప్పంలో ప్రజలు ఓటు ద్వారా తమ తీర్పును చాలా స్పష్గంగా చెప్పారు. 2029 ఎన్నికల్లో మార్పుకు ఈ ఫలితాలు సూచిక అని చెప్పక తప్పదు. కుప్పం నియోజకవర్గంలో 18 పంచాయతీల్లో YSRCP మద్దతుదారులు విజయం సాధించారు. ఫోన్లలో బెదిరించినా.. నామినేషన్ పత్రాలను అడ్డుకున్న YSRCP మద్దతుదారులు మొక్కువోని ధైర్యంతో పొరాడి విజయం సాధించారు.
#Kuppam #LocalBodyElections2026 #CBN #TDP #YSRCP #YSJagan #APNews #AndhraPradeshNews @YSRCParty @we_ysrcp @ysrcp_usa @YSRCPEurope @YSRCPLegalCell @YSRCP_Italy @YSRCPCommanders
🤖 Made with AI
5
198
జగన్ 2.0 loading……
గ్రౌండ్ లెవల్లో దమ్ము చూపించిన YSRCP సైనికులు
11 కాదు 1111....
11 అని హేళన చేశారు…
అది కసిగా మారింది..
తొలివిడతలోనే 1111 సర్పంచ్ లు YSRCP కైవసం
పంచాయతీ ఎన్నికల్లో పవర్ చూపించిన YSRCP మద్దతు దారులు
టీడీపీ కుట్రలు, దాడులు, రిగ్గింగ్ చేసినా పోరాడిన YSRCP మద్దతుదారులు
గణనీయంగా విజయాలు సాధించిన YSRCP మద్దతు దారులు
1111పంచాయతీ ల సర్పంచ్ లు కైవసం చేసుకున్న YSRCP మద్దతు దారులు
తొలివిడత లోనే 1111 లు గెలవడం తో YSRCP లో జోష్
అన్ని అవరోధాలను అధిగమించి 1110 ససర్పంచ్ స్థానాలు దక్కించుకున్న YSRCP మద్దతుదారులు
గ్రామాల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత కళ్లకు కట్టింది
ఇంకా .. ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగి ఉంటే..
ఫ్యాన్ గాలి ముందు కూటమి కుదెలు అయ్యేదని ఫలితాలు చూస్తే అర్థమవుతుంది.
#LocalBodyElections2026 #APNews #APPanchayathiElections #AndhraPradeshNews #YSJagan #YSRCP @ysrcp_usa @we_ysrcp @YSRCPLegalCell @ysjagan @YSRCPCommanders @YSRCPEurope @YSRCP_Germany @YSRCP_Italy @YsrcpRe51288 @WeYSRCP_SKLM @VizagYsr @YSRCPWomenVoice
🤖 Made with AI
పార్లమెంట్ ఉభయ సభలను తిరిగి సమావేశపర్చాలని కేంద్రం నిర్ణయం
నవంబర్ 30 నుంచి లోక్ సభ, డిసెంబర్ 2 నుంచి రాజ్యసభ సమావేశాలు నిర్వహించాలని కోరుతూ
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ కు కేంద్రం విజ్ఞప్తి
అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాల కోసం అంటూ కేంద్రం ప్రకటన
ఈ సమావేశాలపై సామాజిక మాద్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు.
ప్రభుత్వ కార్యకలాపాల అవసరాన్ని బట్టి డిసెంబర్ 3 నాటికి ఉభయ సభల సమావేశాలు ముగిసే అవకాశం
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. లోక్ సభ రెండు రోజులపాటు.. ఆ తరువాత రాజ్యసభ మరో రెండు రోజులపాటు సమావేశమయ్యే అవకాశం
మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకురానుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత
లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయించే రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయడంతోపాటు .. నియోజకవర్గాల పునర్ విభజన విధానం మార్పులు చేయాలనే ప్రతిపాదనపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు గతంలో వార్తలు..
లోక్ సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం 2023లో పార్లమెంట్‌లోనే ఆమోదం పొందింది. అయితే.. జనగణన , నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తరువాతనే.. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలనే నిబంధన ఉంది.ఈ నేపథ్యంలో లోక్ సభ స్థానాల సంఖ్యను గణనీయంగా పెంచడంతోపాటు మహిళల రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగుమం చేసేలా.. కేంద్రం గతంలో పునర్ విభజన చట్టాన్ని ప్రతిపాదించింది.
ఈ ప్రాతిపదనల్లో భాగంగా తీసుకొచ్చిన రాజ్యాంగం 131 సవరణ బిల్లు -2026 .. ఏప్రిల్‌లో వీగిపోయింది.రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజార్టీని ప్రభుత్వం సాధించలేకపోయింది. దీంతో.. దానికి అనుబంధంగా ఉన్న నియోజకవర్గాల పునర్ విభజన బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను సభ ముందుకు తీసుకురావొద్దని ప్రభుత్వం స్పీకర్‌ను కోరింది.
మరోవైపు.. ఆగస్టు 13న వర్షకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇప్పటి వరకూ అధికారికంగా ముగింపు పలకలేదు. 100 రోజులకుపైగా ఈ పరిస్థితి కొనసాగడం కూడా పార్లమెంట్‌ను తిరిగి ఎప్పుడైనా తిరిగి సమావేశపర్చే అవకాశముందని చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
అయితే.. నవంబర్ 30 సమావేశాల్లో ఏఏ బిల్లులు ప్రవేశపెడతారుఅనేది కేంద్రం స్పష్టం చేయలేదు. ప్రభుత్వ కార్యకలాపాల కోసమే సభను తిరిగి సమావేశ పరుస్తున్నట్లు కిరణ్ రిజిజు చెప్పారు. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్ విభజన అంశాలపై ప్రభుత్వం తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.
#Loksabha #RajyaSabha #Parliament #PMModi #WomenReservation #Delimitation #delimitationbill #WomenReservationBill #India #IndianConstitution
🤖 Made with AI
1
211
ఏపీ లో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఇప్పటివరకు 915 సర్పంచ్ స్థానాలు వైసీపీ మద్దతుదారులు కైవసం
#LocalBodyElections2026 #AndhraPradesh #AndhraPradesNews #YSRCP #YSJagan @YSRCParty @ysjagan @ysrcp_usa @YSRCPEurope @YSRCP_Germany @YSRCP_Italy @shekar69 @VizagYSRCP
ఢిల్లీలో విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ తరువాత క్లారిటీ వచ్చింది. ఆయన పైకి రాష్ట్రాన్ని రెండు కుటుంబాలే పాలించాలా..? అంటున్నారు. కానీ.. ఆయన దాడి మొత్తం YS జగన్మోహన్ రెడ్డి మీదనే ఉంది. YS జగన్మోహన్ రెడ్డి కుటుంబ పాలన అని ఆయన ఎలా చెబుతున్నారు..?. YS జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఆయనకు తప్ప పదవులు ఎవరికున్నాయి..? YS భారతి రెడ్డికి ఏ పదవి లేదు కదా..?. షర్మిల YSRCPలో లేదు.. ఆమె AP కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. అన్న మీద షర్మిల తీవ్ర రాజకీయ దాడి చేస్తున్నారు. ఇవన్నీ తెలిసీ, చూస్తూ కూడా YS జగన్మోహన్ రెడ్డి కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి ఎలా చెప్పగలరు. నిన్న విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ తరువాత ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది. ఆయన పెట్టిన రాజకీయ పార్టీ YS జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే పెట్టారు. దీనిలో ఏమాత్రం సందేహం లేదు.
ఈ మధ్య కాలంలో షర్మిల రాజకీయ దాడి. విజయ సాయి రెడ్డి ప్రెస్ మీట్.. ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన తీరు తరువాత YSRCP రాజకీయ వ్యూహాన్ని మార్చుకోవడంతోపాటు, దూకుడు కూడా పెంచాలి. YSRCP ప్లీనరీ జులై 2027లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అక్టోబర్, నవంబర్ 2027లో YS జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తారని చెబుతున్నారు. నిన్న విజయసాయి రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ.. ఉగాది తరువాత తన ప్రెస్ మీట్ ఉంటుందని ప్రకటించారు. నా అంచనా ప్రకారం ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల ఉన్నా, లేకపోయినా ఆమె కూడా జూన్ , 2027 తరువాత ఏదో ఒక రూపంలో YS జగన్ు ఇబ్బంది పెట్టే రాజకీయ ప్రోగ్రాం రూపొందించుకనే అవకాశముంది.ఇప్పుడు YSRCPకి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తోపాటు విజయసాయి రెడ్డి, షర్మిల రూపంలో రాజకీయ ప్రత్యర్ధులు తయారయ్యారు. స్థానిక ఎన్నికల సరళి చూసిన తరువాత ఏపీలో కొంత మంది అధికారులు, పోలీసులు కూడా YSRCPకి ప్రత్యర్ధులుగా చూడాల్సి ఉంటుంది. వీరందర్నీ ఎదుర్కోవడానికి YSRCP ఒక పకడ్బందీ వ్యూహాన్ని రచించాల్సి ఉంటుంది.
APలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. అయితే.. ఈ వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి తెచ్చుకోని తమకు పడేలా చేసుకోవడంలోనే YSRCP విజయం ఆధారపడి ఉంటుంది. స్థానిక ఎన్నికల సరళి చూసిన తరువాత.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అధికారులను, పోలీసులను పెట్టుకుని ఎన్నికలు అత్యంత దౌర్జన్యంతో నిర్వహించినా YSRCPకి 36 శాతం నుంచి 38 శాతం ఓట్లు పడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా YSRCPకి 40 శాతం ఓట్లు పడ్డాయి. అంటే.. YSRCP ఓటు బ్యాంక్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. రాబోయే రోజుల్లో YSRCP అనుసరించే వ్యూహాల మీదనే ఈ ఓటు బ్యాంక్ పెరిగే అవకాశముంటుంది.
తాడేపల్లి వ్యూహకర్తలు ప్రజాస్వామ్యంగా ఆలోచిస్తూనే రాజకీయంగా కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 4న విజయసాయి రెడ్డి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తానని చెబుతున్నారు. పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం తరువాత YSRCP మీద ఆయన దూకుడు మరింత పెంచే అవకాశముంది. తన కుమార్తె పెళ్లి తరువాత షర్మిల కూడా YS జగన్మోహన్ రెడ్డి మీద తన దూకుడు పెంచే అవకాశం లేకపోలేదు. ముందుగా వీరిద్దర్నీ YSRCP రాజకీయంగానే ఎదుర్కోవాలి. వీరిద్దరి విషయంలో వాస్తవాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా YSRCP ప్రణాళికలు రచించాలి. ప్రెస్ మీట్ల ద్వారా వీరిద్దరికీ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ YSRCP అలర్ట్‌గా ఉండాలి. ఏముందులే అని లైట్‌గా ఉండకూడదు.
ఢిల్లీలో విజయసాయి రెడ్డికి విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు ద్వారా ఆయన నేషనల్ మీడియాను కూడా ఉపయోగించుకునే అవకాశముంది. ఎందుకంటే.. ఆయన నిన్నటి ఢిల్లీ ప్రెస్ మీట్‌కు ANI చాలా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. విజయసాయి రెడ్డి ప్రెస్ మీట అయిపోయేలోపే YSRCP, YS జగన్మోహన్ రెడ్డి మీద రెండు రకాల వార్తలను ANI పోస్ట్ చేసింది.
ఆయన జెండా, ఆయన అజెండా, ఆయన మాటలు చూసి, విన్న తరువాత పరివర్తన రాజకీయ పార్టీ హిందూత్వానికి దగ్గరగా ఉండే అవకాశముంది. విజయసాయి రెడ్డి ఎక్కువుగా జెన్ జీ గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయంలో YSRCP అలర్ట్ కావాలి. ఎందుకంటే..ప్రస్తుతం APలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జెన్ జీ YSRCPకి దగ్గరవుతుంది. YSRCPకి దగ్గరవుతున్న జెన్ జీని దూరం చేసే ఎత్తుగడతోనే విజయసాయి రెడ్డి జెన్ జీ రాగం అందుకున్నారని అనిపిస్తోంది.
YSRCP ఢిల్లీ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఢిల్లీలో పాత పరిచయాలను తాడేపల్లి వ్యూహకర్తలు పునరుద్దరించుకోవాలి. ఎందుకంటే... ఢిల్లీలో ముఖ్యంగా బీజేపీలో చాలా మందికి విశ్వసనీయ మిత్రుడు YS జగన్మోహన్ రెడ్డి. గత్యంతరంలేకనే బీజేపీ అగ్రనేతలు చంద్రబాబును దగ్గరకు రానించారనే చెప్పాలి. విశ్వసనీయతలో, స్నేహంలో, రాజకీయ సిద్దాంతాల్లో, ప్రజాస్వామ్య ఆలోచన ధోరణిలో, రాజ్యాంగ నిబంధనలను పాటించడంలో, అభివృద్ది, సంక్షేమం పట్ల చిత్తశుద్ధిలో, జాతీయ వాదంలో చంద్రబాబు కంటే లక్ష రెట్లు YS జగన్మోహన్ రెడ్డి చాలా బెటర్. ఈ విషయం ఢిల్లీ నేతలకు కూడా తెలుసు. అంతేకాదు.. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత గూడు కట్టుకుంటుంది. ఈ మధ్యకాలంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కేంద్రం తెప్పించుకుందనే వార్తలు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతుందనే విషయం ఢిల్లీ నేతల దృష్టికి కూడా వెళ్లింది. ఈ సమయంలోనే YSRCP ఢిల్లీ వ్యూహం మార్చుకుని దూకుడుగా ముందుకు వెళ్లాలి. తాడేపల్లి వ్యూహకర్తలు తమ వ్యూహం మార్చుకోవడం ద్వారా.. అధికారుల్లో, పోలీసుల ఆలోచనా ధోరణిలో కూడా మార్పు వచ్చే అవకాశముంది. ఢిల్లీలో ఏదో జరుగుతుందనే భ్రమను YSRCP క్రియేట్ చేయాలి. దీని వలన అధికారులు, పోలీసులు కూటమి ప్రభుత్వానికి సహకరించే విషయంలో పునరాలోచన చేయొచ్చు. చంద్రబాబు అప్రజాస్వామ్యక, రాజ్యాంగ విరుద్ధ విధానాలను అడ్డుకోవడానికి YSRCP తన పొలిటికల్ ఆపరేషన్‌ను ఢిల్లీ నుంచే ప్రారంభించాలి. కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ.. ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. ఏపీ బీజేపీలో, స్వాముల్లో, సాధుల్లో YS జగన్మోహన్ రెడ్డిని అభిమానించేవారు చాలా మంది ఉన్నారు. వీరందర్నీ దగ్గరకు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
YSRCP సెక్యులర్ పార్టీ. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విధానాలను తూచా తప్పకుండా పాటించే నాయకుడు YS జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే.. YS జగన్మోహన్ రెడ్డి ప్రతి అడుగులో, ప్రతి మాటలో ప్రజాస్వామ్య వాసనలు ఉంటాయి.సెక్యులర్ భావజాలం ఉంటుంది. బీజేపీతో స్నేహంగా ఉంటే.. ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు దూరమవుతాయనేది కేవలం భ్రమ మాత్రమే. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు వేయడం లేదా.?. ముస్లింలు, క్రిస్టియన్లు టీడీపీలో లేరా..? ఇక్కడ పార్టీ సిద్ధాంతాలు, నాయకుడి విశ్వసనీయత ముఖ్యం. YSRCP సిద్ధాంతాలు, YS జగన్ మోహన్ రెడ్డి విశ్వసనీయత చాలా క్లియర్. విశ్వసనీయత విషయంలో YS జగన్మోహన్ రెడ్డి దరిదాపుల్లోకి కూడా చంద్రబాబు రాలేరు.
ఏపీలో కమ్యూనిస్టులు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వామపక్షాలతో YSRCP స్నేహంగా ఉంటే చాలా మంచిది. వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఓట్లు చంద్రబాబు కూటమికి వెళ్లకుండా YSRCP వ్యూహకర్తలు జాగ్రత్త పడాలి. గత ఎన్నికల్లో మాలల YSRCPకి ఓటు వేస్తే.. మాదిగలు చంద్రబాబుకు అండగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో మాదిగల ఓట్ల మీద కూడా YSRCP దృష్టి పెట్టాలి. మాదిగల ఓట్లు సాధించడంలో YSRCP వ్యూహరచన చాలా క్లియర్‌గా ఉండాలి.APలో BSP కూడా ఉంది. BSPలో మాదిగలే ఉంటారు. AP BSP నేతలను దగ్గరకు తీసుకోవడం ద్వారా చంద్రబాబు- మందకృష్ణ వ్యూహాలకు YSRCP చెక్ పెట్టే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో ఏ చిన్న అవకాశాన్ని కూడా YSRCP వదులుకోకూడదు.
APలో ఆలయాల విధ్వంసం కొనసాగుతోంది.YSRCP అధికారంలో ఉన్నప్పుడు హిందూత్వానికి YS జగన్మోహన్ రెడ్డి చేసిన సేవలను విస్తృతంగా ప్రజల్లోకి, హిందూ ధార్మిక సంస్థల్లోకి, స్వాములు, సాధుల్లోకి తీసుకెళ్లాలి. YSRCP హయాంలో కట్టిన గుడులు, శ్రీవాణి ట్రస్ట్ సేవలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దీని కోసం YSRCPలో హిందూత్వానికి సంబంధించి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అదే సమయంలో సెక్యులర్ సిద్దాంతాలకు YSRCP కట్టుబడి ఉంటుందని ముస్లింలకు, క్రిస్టియన్లకు తెలిసేలా ప్రచారం చేయాలి. దీని కోసం సోషల్ మీడియా, డిజిటల్ మీడియాను పరిణీతితో వాడుకోవాలి.
YSRCP ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎన్ని ప్రణాళికలు రచించినా ఓటర్లను బూతు దగ్గరకు తీసుకొచ్చేది YSRCP, YS జగన్మోహన్ రెడ్డి అభిమాని అంటే క్షేత్రస్థాయిలో ప్రాణాలు ఫణంగా పెట్టే కార్యకర్తలు. వీర్నీ దగ్గరకు తీసుకోవాలి. YSRCP కోసం ప్రాణమిచ్చే కార్యకర్తలను గ్రామస్థాయిలో గుర్తించి.. వారిని అన్ని విధాలుగా సిద్ధం చేయాలి. YSRCP ఆఫీస్‌లో అనుభవజ్ఞులతో ప్రత్యేక క్లాస్‌లు నిర్వహించి 2029 యుద్దానికి గ్రౌండ్ లెవల్లో పని చేసే కార్యకర్తలను సిద్ధం చేయాలి. YSRCP కార్యకర్తల పార్టీ అనే నమ్మకాన్ని కిందిస్థాయి కార్యకర్తలకు కల్పించాలి. YSRCP అధిష్టానం గ్రౌండ్ లెవల్లో పని చేస వారితో టచ్‌లోకి వెళ్లాలి. మండల, గ్రామ స్థాయి నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమన్వయం చేసుకోవాలి. ఇప్పటికీ ప్రధాని మోదీ, అమిత్ షా వంటి నేతలు గ్రామస్థాయి నేతలతో టచ్‌లో ఉంటారు. వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతోపాటు రియల్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ఉంటారు.
దీనిలో .. కార్యకర్తను పార్టీ గుర్తిస్తుంది.. మీ వల్లనే మేం ఢిల్లీలో అధికార పీఠం మీద కూర్చున్నాం అనే మెస్సేజ్‌ను మోదీ, అమిత్ షా పంపిస్తున్నారు. సగటు కార్యకర్త కోరుకునేది కూడా ఇదే.
YSRCP హయాంలో రాష్ట్రానికి జరిగిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్లే సమయం వచ్చింది. సంక్షేమం, అభివృద్దికి YS జగన్ కొత్త నిర్వచనం చెప్పారు. ఇవన్నీ మళ్లీ ప్రజలకు గుర్తు చేయాలి. అదే సమయంలో చంద్రబాబు హామీల ఉల్లంఘనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఎన్నికలకు ముందు ఇష్టమొచ్చిన్లు చంద్రబాబు హమీ ఇచ్చారు. ఇవన్నీ తుంగలో తొక్కారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, కొత్త ఓటు హక్కు పొందే వారిపై YSRCP ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలి. మహిళా ఓటు బ్యాంక్‌పై YSRCP ప్రత్యేక దృష్టి పెట్టాలి. వచ్చే YSRCP మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, జెన్ జీ, ప్రభుత్వ ఉద్యోగులపై ప్రత్యేక కసరత్తు ఉండాలి.
YS జగన్ హయాంలో వచ్చిన పెట్టుబడులు, చంద్రబాబు హయాంలో వస్తున్న పెట్టుబడులు.. విశాఖలో YS జగన్ హయాంలో జరిగిన పారిశ్రామిక వేత్త సదస్సు, బాబు హయాంలో జరిగిన సదస్సుకు తేడాను పారిశ్రామిక, ఇన్వెస్టర్లలోకి బలంగా తీసుకెళ్లాలి. చంద్రబాబు వచ్చిన రెండున్నరేళ్లలోనే రూ.4లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ అప్పులు, రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎక్కడికి పోతుందని YSRCP ప్రశ్నించాలి. చంద్రబాబు అప్పులు, దుబారా రాష్ట్రాన్ని మరో ఉగాండా చేస్తాయని ప్రచారం చేయాలి. ఈ ప్రచారంలో వ్యూహాత్మకంగా మేధావులు, విద్యావంతులను భాగస్వామ్యం చేయాలి.
ఇక.. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న YSRCP, YS జగన్ అభిమానుల సేవలను కూడా విస్తృతంగా వాడుకోవాలి. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో వీరిని యాక్టివ్ చేయాలి. రాష్ట్రంలో జరిగే విషయాలు వీరికి చేరవేస్తూ కౌంటర్ ఇప్పించాలి. YS జగన్ - చంద్రబాబు పాలనకు మధ్య తేడాను వీరితో చెప్పించాలి.
ఇక.. సమర్ధులైన టెక్నీషియన్లను, వీడియో, గ్రాఫిక్స్ నిపుణులను వాడుకోవాలి. స్క్రిప్ట్ రైటర్లను నియమించుకోవాలి. YSRCP భావజాలం ఉన్నవారు ఇక్కడ చాలా ముఖ్యం. YS జగన్మోహన రెడ్డిని మళ్లీ సీఎంగా చూసుకోవాలని తపిస్తుంటారు, పోరాడుతుంటారు వీరిని గుర్తించి వాడుకోవాలి. ఈ ప్రక్రియ కింద స్థాయి నుంచి పైస్థాయి వరకు ఉండాలి.
ఇప్పటి నుంచి YSRCP వేసే ప్రతి అడుగు ఎంతో కీలకం.. YS జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలయ్యేలోపే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, కింది స్థాయి కార్యకర్తలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలి. అప్పుడే APలో YS జగన్మహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజాస్వామ్య, రాజ్యంగ బద్దపాలన తిరిగి వస్తుంది. YS జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, పాలనలోనే మళ్లీ APలో పాలన గాడిన పడుతుందనే నమ్మకాన్ని YSRCP వ్యూహకర్తలు ప్రజల్లో బలంగా కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది.
#YSRCP #YSJagan #APNews #AndhraPradeshNews #AndhraPradesh @YSRCParty @ysjagan @we_ysrcp @YSRCPLegalCell @YSRCPCommanders @ysrcp_usa @YSRCP_Italy @YSRCP_Germany @YSRCPAmerica @YSRCPEurope @ukysrcp @YSRCPWomenVoice @YSRCPWWOfficial @Ysrcp_womens @VizagYSRCP @UttarAndhraYCP @gudurysrcp @ysrcpvizag @VizianagaramYCP @ysrcpvizag @ysrcpvja @KurnoolYSRCP @YsrcpNandyala
🤖 Made with AI
చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోలేక ఓడిపోయాం!
ప్రజల కోసం చేసిన పనులు ఎన్నో ఉన్నా,వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయాం!
మనం చేసిన మంచిని వివరించడంలో విఫలమయ్యాం!
పని చేశాం…కానీ చెప్పుకోలేకపోయాం!
అభివృద్ధి చేశాం…కానీ ప్రజలకు చేరువ చేయలేకపోయాం!
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ ప్రజల మధ్యకు వెళ్దాం!✊ #YSJagan #YSRCP #AndhraPradesh @YSRCParty @YSRCPEurope
చుట్టూ సింహాల గుంపు..
కానీ.. ఆ అడవి గేదె బెదర లేదు.. అదరలేదు..
తన బిడ్డ కోసం ఆ సింహాల గుంపునే ఎదిరించింది..
ఆ తల్లి పోరాటం చూసి..
మరికొన్ని గేదెలు సహాయంగా వచ్చాయి..
ఆ సింహాల గుంపు మాత్రం..
ఆ చిన్నారి లేగ దూడను టచ్ చేయలేకపోయాయి..
అమ్మ ప్రేమ ముందు..
ఎంత బలవంతులైన బలాదూరే..!!
#Lion #Forest #Buffalo #BaffaloWildWing
పాకిస్థాన్ ముక్కలు కాబోతుందా..? బెలుచిస్థాన్, సింధు ఉద్యమాలు ఎక్కడికి దారి తీస్తాయి..? ఇస్లామాబాద్‌పై అంతర్గత సవాళ్లు పెరుగుతు న్నాయా..? వనరులపై ఆధిపత్య పోరు పాకిస్థాన్ మనుగడను ప్రశ్నార్ధకం చేస్తుందా..? ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు.. పాకిస్థాన్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి.
పాకిస్థాన్‌లో మరోసారి అంతర్గత రాజకీయ సంక్షోభాలు చర్చల్లోకి వచ్చాయి. దేశంలో రెండు ప్రధాన ఫ్రావిన్స్ల్లో ఉద్యమాలు లేచాయి.బెలూచిస్థాన్, సింధు ఫ్రావిన్స్ల్లో ప్రాంతీయ అస్తిత్వం, స్వయం ప్రతిపత్తి, సహజ వనరులపై హక్కుల అంశాలపై చర్చలు ఉద్యమాలకు దారి తీస్తున్నాయి.
ఒకవైపు బెలూచిస్థాన్లో దశాబ్దాలుగా పోరాటం నడుస్తోంది. మరోవైపు సింథీయులు తమ చారిత్రక, సాంస్కృతి వారసత్వాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నారు. ఇవన్నీ ఇస్లామాబాద్‌కు రాజకీయ సవాళ్లుగా మారుతున్నాయి.
అయితే.. ఈ పరిణామాలన్నీ పాకిస్థాన్ త్వరలోనే ముక్కలవుతుందనే సంకేతాలా..? లేకపోతే ఇస్లామాబాద్‌పై రాజకీయ ఒత్తిళ్లా..? ఈ రెండంటిని విడివిడిగా చూడాల్సి ఉంటుంది.
బెలూచిస్థాన్:పాకిస్థాన్‌కు అతిపెద్ద సవాళ్లలో ఇదొకటి..!
పాకిస్థాన్ భూభాగంలో విస్తీర్ణపరంగా అతి పెద్ద ఫ్రావిన్స్ బెలూచిస్థాన్. కానీ జనాభాపరంగా చిన్నది.సహజ వనరులు, ఖనిజ సంపద, సహజ వాయువు, వ్యూహాత్మకంగా కీలకమైన గ్వాదర్ నౌకాశ్రయం ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యతను కల్పిస్తున్నాయి.
అయితే ... ఈ సంపద తమ ప్రాంతంలో ఉన్నప్పటికీ స్థానిక ప్రజలకు తగిన ప్రయోజనాలు అందడం లేదనే అసంతృప్తి దశాబ్దాలుగా ఉంది.
బెలూచ్ ఉద్యమకారుల ప్రధాన ఆరోపణలు:
- స్థానిక వనరులపై కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం.
- రాజకీయ స్వయం ప్రతిపత్తికి పరిమితులు.
- బలవంతపు అదృశ్యాల ఆరోపణలు, మానవ హక్కుల ఉల్లంఘనలు.
- స్థానిక ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందకపోవడం.
- చైనా–పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (CPEC) ప్రాజెక్టుల్లో స్థానిక ప్రయోజనాలకు ప్రాధాన్యం లేకపోవడం.
ఈ అసంతృప్తులు రాజకీయ ఉద్యమాలకే పరిమితం కాకుండా సాయుధ తిరుగుబాటుకు కూడా దారితీశాయి. బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), బెలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) వంటి సంస్థలు పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి.
కంబాటింగ్ టెర్రరిజం సెంటర్ 2025 అధ్యయనం ప్రకారం, ఈ తిరుగుబాటు గతంలో కంటే సంక్లిష్టంగా మారింది. 2025 మార్చిలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాకింగ్ ఘటన ఈ సమస్య తీవ్రతను మరోసారి బయటపెట్టింది.
బెలూచిస్థాన్ ఉద్యమం స్వాతంత్ర్యం దిశగా వెళ్తుందా?
బెలూచ్ వేర్పాటువాద సంస్థల్లో కొన్ని పాకిస్థాన్ నుంచి పూర్తిస్థాయి స్వాతంత్ర్యాన్ని కోరుతున్నాయి. మరికొన్ని వర్గాలు రాజకీయ హక్కులు, స్వయం ప్రతిపత్తి, వనరులపై స్థానిక నియంత్రణను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది.ఏమంటే...బెలూచిస్థాన్లో అసంతృప్తి కేవలం ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత కాదు. పాకిస్థాన్‌లో విలీనం జరిగిన 1948 నాటి పరిణామాల నుంచి ఈ వివాదానికి చారిత్రక నేపథ్యం ఉంది.
అందువల్ల ప్రభుత్వం కేవలం సైనిక చర్యలతో ఉద్యమాన్ని అణచివేయగలిగినా, దాని వెనుక ఉన్న రాజకీయ, ఆర్థిక, మానవ హక్కుల సమస్యలను పరిష్కరించకుండా శాశ్వత శాంతిని సాధించడం కష్టం.
సింధ్: సింధుదేశ్ నినాదం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి?
పాకిస్థాన్‌లో మరో కీలకమైన ప్రాంతం సింధ్. కరాచీ వంటి ఆర్థిక కేంద్రం ఈ ప్రావిన్స్‌లోనే ఉంది. సింధు నది నాగరికతకు నిలయమైన ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన భాష, సంస్కృతి, చరిత్ర ఉన్నాయి.
సింధ్‌లో ప్రధానంగా మూడు రకాల రాజకీయ ఆలోచనలు కనిపిస్తాయి.
1. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి: పాకిస్థాన్ సమాఖ్యలోనే కొనసాగుతూ సింధ్‌కు ఎక్కువ అధికారాలు, వనరులపై నియంత్రణ కావాలనే డిమాండ్.
2. సింధ్ అస్తిత్వ పరిరక్షణ: సింధీ భాష, సంస్కృతి, భూమి, స్థానిక ప్రజల రాజకీయ హక్కులను కాపాడుకోవాలనే ఉద్యమం.
3. సింధుదేశ్ వేర్పాటువాదం: సింధ్‌ను పాకిస్థాన్ నుంచి విడదీసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలనే భావజాలం.
జియే సింధ్ ఉద్యమంలోని కొన్ని వర్గాలు ఈ మూడో ఆలోచనకు మద్దతు ఇస్తున్నాయి. అయితే సింధ్‌లోని అన్ని ప్రాంతీయ పార్టీలూ స్వాతంత్ర్యాన్ని కోరుకోవడం లేదు.
ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఉంది. సింధ్‌లో ఉర్దూ మాట్లాడే ప్రజలు, సింధీలు, ఇతర భాషా సమూహాల మధ్య రాజకీయ, సామాజిక సమీకరణాలు కూడా కీలకంగా ఉన్నాయి.
నవంబర్ 2026లో ఏం జరిగింది?
2026 నవంబర్ 23న కరాచీలో జియే సింధ్ రహ్బర్ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. సింధ్‌ను విభజించి కొత్త ప్రావిన్సులు లేదా పరిపాలనా యూనిట్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను నిరసనకారులు వ్యతిరేకించారు.
సింధ్ చారిత్రక, సాంస్కృతిక ఐక్యతను కాపాడాలని నేతలు డిమాండ్ చేశారు. ఉర్దూ మాట్లాడే ప్రజలు కూడా సింధ్ సమాజంలో అంతర్భాగమేనని స్పష్టం చేశారు.
ఇది ముఖ్యమైన పరిణామం. ఎందుకంటే సింధ్‌లోని జాతీయవాద శక్తులు కేవలం వేర్పాటువాదాన్నే కాకుండా, పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకునే పరిపాలనా నిర్ణయాలనూ తమ అస్తిత్వానికి సంబంధించిన అంశంగా చూస్తున్నాయి.
వివాదానికి కారణం.. కొత్త ఫ్రావిన్స్లా ప్రతిపాదనతోనేనా..?
2026 నవంబర్ 17న అల్ జజీరా ప్రచురించిన కథనం ప్రకారం, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కొత్త సంవత్సరం నాటికి కొత్త ప్రావిన్సుల ఏర్పాటు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
అయితే ..ఆయన ఇది తన వ్యక్తిగత అంచనా మాత్రమేనని, ప్రభుత్వంలో అధికారిక నిర్ణయం తీసుకున్నట్లు తనకు సమాచారం లేదని కూడా స్పష్టం చేశారు.
పాకిస్థాన్‌లో ప్రస్తుతం నాలుగు ఫ్రావిన్స్లు ఉన్నాయి
1. పంజాబ్ 2.సింధ్ 3.ఖైబర్ పఖ్తున్వా 4. బెలూచిస్థాన్
కొత్త ప్రావిన్సుల ఏర్పాటు అంశం పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి కారణాలతో చర్చకు వస్తోంది.కానీ సింధ్‌లోని జాతీయవాదులు దీన్ని తమ ప్రాంతీయ అస్తిత్వానికి ముప్పుగా చూస్తున్నారు.
**ఇక్కడ ఒక కీలకమైన తేడా గుర్తించాలి:** కొత్త ప్రావిన్సుల ఏర్పాటు అంటే పాకిస్థాన్ నుంచి విడిపోవడం కాదు. అది దేశ సరిహద్దుల్లో జరిగే పరిపాలనా పునర్వ్యవస్థీకరణ మాత్రమే.
బెలూచిస్థాన్, సింధ్ ఉద్యమాల మధ్య సంబంధం ఉందా?
ఈ రెండు ప్రాంతాల్లోని ఉద్యమాలకు కొన్ని ఉమ్మడి అంశాలు ఉన్నాయి.
| అంశం | బెలూచిస్థాన్ | సింధ్ |
| -------------- | ---------------------------------------- | ----------------------------------------------------------------- |
| ప్రధాన ఆందోళన | రాజకీయ, ఆర్థిక అణచివేత ఆరోపణలు | ప్రాంతీయ అస్తిత్వం, అధికారాలు |
| వనరుల సమస్య | సహజ వనరులపై నియంత్రణ | భూమి, నీరు, వనరులపై హక్కులు |
| ఉద్యమ స్వరూపం | సాయుధ, రాజకీయ ఉద్యమాలు | ప్రధానంగా రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాలు; కొన్ని వేర్పాటువాద వర్గాలు |
| ప్రధాన డిమాండ్ | స్వాతంత్ర్యం నుంచి స్వయం ప్రతిపత్తి వరకు | స్వయం ప్రతిపత్తి నుంచి సింధుదేశ్ వరకు |
బెలూచ్, సింధీ జాతీయవాద సంస్థల్లో కొన్ని పరస్పర సహకారం కోసం ప్రయత్నిస్తున్నాయి. బెలూచ్, సింధీ సాయుధ సంస్థల మధ్య సమన్వయానికి సంబంధించిన నివేదికలు కూడా ఉన్నాయి.
అయితే రెండు ఉద్యమాలూ ఒకే నాయకత్వం కింద పనిచేస్తున్నాయని లేదా ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాయని చెప్పడానికి ఆధారాలు లేవు. యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఫర్ అసైలమ్ నివేదికల్లోనూ ఈ వర్గాల మధ్య సంస్థాగత సంబంధాలు, వాటి కార్యకలాపాల గురించి ప్రస్తావన ఉంది.
పాకిస్థాన్‌ను బలహీనపరిచే మూడు ప్రధాన పరిణామాలు
మొదటిది – సైనిక, ఆర్థిక ఒత్తిడి
బెలూచిస్థాన్లో తిరుగుబాటును అణచడానికి పాకిస్థాన్ సైన్యం నిరంతరం వనరులు ఖర్చు చేయాల్సి వస్తోంది. అదే సమయంలో ఆర్థిక సంక్షోభం, విదేశీ అప్పులు, రాజకీయ అస్థిరత దేశంపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
రెండోది – చైనా ప్రయోజనాలకు సవాలు
చైనా–పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) పాకిస్థాన్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకం.
గ్వాదర్ పోర్టు, బెలూచిస్థాన్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చైనా పెట్టుబడులకు కీలకమైనవి. అయితే స్థానిక ప్రజల అసంతృప్తి, సాయుధ దాడులు ఈ ప్రాజెక్టులకు భద్రతాపరమైన సవాళ్లు సృష్టిస్తున్నాయి.
చైనా తన పెట్టుబడులు, వాణిజ్య మార్గాల భద్రతపై ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడుతోంది.
మూడోది – ప్రాంతీయ జాతీయవాదం విస్తరణ
ఒక ప్రాంతంలో ప్రారంభమైన ఉద్యమం మరొక ప్రాంతంలోని అసంతృప్తి వర్గాలకు స్ఫూర్తిగా మారితే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరుగుతుంది.
అయితే బెలూచ్, సింధీ ఉద్యమాలు పరస్పరం మద్దతు ఇచ్చినంత మాత్రాన దేశ విభజన అనివార్యం కాదు.
పాకిస్థాన్ ముక్కలయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి?
ఇది అత్యంత కీలకమైన ప్రశ్న.
పాకిస్థాన్ విభజనను పూర్తిగా తోసిపుచ్చలేం. కానీ సమీప భవిష్యత్తులో దేశం రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలుగా విడిపోతుందని చెప్పడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు.
దీనికి కొన్ని కారణాలున్నాయి.
1. పాకిస్థాన్ సైన్యం దేశ సమగ్రత విషయంలో అత్యంత కీలకమైన శక్తి.
2. బెలూచ్ వేర్పాటువాద సంస్థల మధ్య కూడా నాయకత్వ, వ్యూహాత్మక విభేదాలు ఉన్నాయి.
3. సింధ్‌లో వేర్పాటువాద భావజాలానికి మద్దతు ఉందని చెప్పినా, అది మొత్తం ప్రజల అభిప్రాయం కాదు.
4. పాకిస్థాన్ ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో కేంద్ర ప్రభుత్వానికి ఇంకా గణనీయమైన అధికారాలు ఉన్నాయి.
5. అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్థాన్ భౌగోళిక సమగ్రతను మార్చే విషయంలో తక్షణ మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు.
అయితే రాజకీయ పరిష్కారం లేకుండా సైనిక చర్యలకే ప్రాధాన్యత ఇస్తే అంతర్గత సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
భారత్‌కు దీని వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి?
పాకిస్థాన్‌లో అంతర్గత అస్థిరత పెరిగితే భారత్‌పై కూడా కొన్ని ప్రభావాలు ఉండవచ్చు.
- పశ్చిమ సరిహద్దుల్లో భద్రతాపరమైన పరిణామాలు.
- అరేబియా సముద్రంలో వ్యూహాత్మక సమీకరణాల్లో మార్పులు.
- చైనా పెట్టుబడులు, గ్వాదర్ పోర్టు భవిష్యత్తుపై ప్రభావం.
- పాకిస్థాన్ సైనిక, రాజకీయ వ్యవస్థలో మార్పుల వల్ల ప్రాంతీయ భద్రతపై ప్రభావం.
అయితే పాకిస్థాన్‌లో సంక్షోభం పెరగడం భారత్‌కు తప్పనిసరిగా ప్రయోజనం చేకూరుస్తుందని భావించడం సరైన విశ్లేషణ కాదు.
ముఖ్యంగా అణ్వాయుధాలు కలిగిన దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత ఏర్పడటం దక్షిణాసియా మొత్తానికి భద్రతాపరమైన ఆందోళన కలిగిస్తుంది.
రాబోయే రోజుల్లో మూడు అవకాశాలు**
| పరిణామం | సాధ్యమైన ప్రభావం |
| --------------------------------------- | -------------------------------------- |
| సైనిక అణచివేత కొనసాగింపు | తిరుగుబాటు మరింత తీవ్రమయ్యే ప్రమాదం |
| రాజకీయ చర్చలు, అధికారాల వికేంద్రీకరణ | ఉద్రిక్తతలు తగ్గే అవకాశం |
| ప్రాంతీయ ఉద్యమాలకు ప్రజా మద్దతు విస్తరణ | పాకిస్థాన్ సమగ్రతపై దీర్ఘకాలిక ఒత్తిడి |
ముగింపు: పాకిస్థాన్‌కు అసలైన ప్రమాదం బయట నుంచి కాదు.. లోపల నుంచేనా?
పాకిస్థాన్ ఇప్పుడున్న పరిస్థితిని కేవలం బెలూచిస్థాన్ లేదా సింధ్ సమస్యగా చూడలేం. ఇది ఆ దేశ సమాఖ్య వ్యవస్థ, ప్రాంతీయ హక్కులు, వనరుల పంపిణీ, సైనిక ఆధిపత్యం, ప్రజాస్వామ్య పాలనకు సంబంధించిన విస్తృతమైన సంక్షోభం.
1971లో తూర్పు పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్‌గా అవతరించడం పాకిస్థాన్ చరిత్రలో అతిపెద్ద విభజన. అప్పటి రాజకీయ, భాషా, ఆర్థిక అసమానతలు, సైనిక చర్యలు కలసి దేశ విభజనకు దారితీశాయి.
నేటి బెలూచిస్థాన్, సింధ్ పరిణామాలను 1971తో పూర్తిగా పోల్చలేం. చారిత్రక పరిస్థితులు, రాజకీయ శక్తులు, అంతర్జాతీయ సమీకరణాలు వేర్వేరుగా ఉన్నాయి.
కానీ ఒక విషయం స్పష్టం.ఒక దేశాన్ని సైనిక బలంతో ఐక్యంగా ఉంచవచ్చు. కానీ ప్రజల ప్రాంతీయ అస్తిత్వాన్ని, రాజకీయ హక్కులను, ఆర్థిక ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తూ శాశ్వత ఐక్యతను సాధించడం సాధ్యం కాదు.
బెలూచిస్థాన్లో తిరుగుబాటు, సింధ్‌లో ప్రాంతీయ జాతీయవాదం, కేంద్ర ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి.. ఇవన్నీ పాకిస్థాన్ పాలకులకు హెచ్చరికలే.
పాకిస్థాన్ భవిష్యత్తును నిర్ణయించేది దాని సైనిక శక్తి మాత్రమే కాదు.. ప్రజల విశ్వాసాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటుందన్న దాని మీదనే పాకిస్థాన్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
#Pakistan #Punjab #balochistan #Sindh
🤖 Made with AI
ఆసియా కప్ రైజింగ్ స్టార్ టోర్నీలో భారత్ చిచ్చర పిడుగు, బేబీ బాస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడు సినిమాలో తణికెళ్ల భరణి ఒక డైలాగ్ చెబుతాడు... "వాడు మగాడ్రా బుజ్జా.. ఆ కొట్టుడు ఏంట్రా.. మొక్కకు అంటు కట్టినట్లు ఒక పద్ధతిగా కొట్టాడు" . ఈ డైలాగ్ వైభవ్‌కు కరక్ట్‌గా సరిపోతుంది. వైభవ్ విధ్వంసంతో 214 బాల్స్ మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. వైభవ్ కొట్టిన 204 పరుగులు కేవలం 53 బంతుల్లోనే వచ్చాయి. 28 సిక్స్‌లు, 7 ఫోర్లతో వైభవ్ విశ్వరూపం చూపించాడు.వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 250 పరుగుల లక్ష్యాన్ని భారత్ -ఏ కేవలం 14.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ దూకుడుతో UAE బౌలర్లు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు.
వైభవ్ దూకుడుతో రికార్డులు అతని ముందు మోకరిల్లాయి..!
ఫాస్టెస్ట్ సెంచరీ:
28 బంతుల్లో సెంచరీ మార్కు అందుకు్న వైభవ్ లిస్ట్ -ఎ క్రికెట్లో అత్యంత వేగంగా శతకం బాదిన బ్యాటర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఇంతకు ముందు జేక్ ఫ్రేజర్ ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో 29 బంతుల్లో సెంచరీ కొట్టాడు.
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ:
కేవలం 52 బంతుల్లోనే 200 పరుగులు సాధించాడు వైభవ్. ఏ ఫార్మాట్ క్రికెట్లోనైనా ఇదే వేగవంతమైన ద్విశతకం.
ఫాస్టెస్ట్ 150:
కేవలం 40 అంటే 40 బంతుల్లోనే 150 పరుగులు సాధించాడు వైభవ్. గతంలో AB డివిలియర్స్ వెస్టిండీస్‌పై 64 బంతుల్లో 150 రన్స్ చేశాడు.
ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు:
ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ 28 సిక్సర్లు బాదేశాడు. ప్రొఫెషనల్ క్రికెట్లో ఇదే అత్యధికం. హైదరాబాద్ బ్యాటర తన్మయ్ అగర్వాల్ 2024 రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై 26 సిక్స్‌లు బాదాడు.
తొలి 10 ఓవర్లలో 183 పరుగులు:
ఈ మ్యాచ్‌లో భారత్ -ఎ జట్టు 10 ఓవర్లకే 183/2 స్కోర్ చేసింది లిస్ట్ -ఎ క్రికెట్లో ఇదే అత్యధికం.
ఐదు ఓవర్లకే 100 పరుగులు:
లిస్ట్ -ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ -ఎ నిలిచింది. 2015లో శ్రీలంకపై న్యూజిలాండ్ 6.3 ఓవర్లలో 100 రన్స్ చేసింది.
వేగంగా 200+ ఛేదించిన టీమ్: లిస్ట్ - ఎ క్రికెట్లో 200+ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా (14.2 ఓవర్స్‌లో) ఛేదించిన జట్టుగా భారత్ - ఎ రికార్డ్ సృష్టించింది.
ఇన్ని రికార్డ్‌లు ఒక్కసారిగా భారత్ ఖాతాలో వచ్చి పడ్డాయంటే కారణం.. వైభవ్ విధ్వంసం.. బాల్ కూడా బిత్తరపోయేలా.. బౌలర్లు వామ్మె వైభవ్అనేలా.. తన బలాన్ని,తన బ్యాటింగ్‌ను నమ్ముకుని UAEపై విరుచుకుపడ్డాడు. ఆల్ ది బెస్ట్ వైభవ్.
#28Sixes #VaibhavDoubleCentury #BabyBoss #AsiaCupRisingStars #TeamIndia
🤖 Made with AI
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భద్రత తొలగింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆయనకు ప్రాణాలకు హాని జరగాలనే.. గతంలో ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీని తొలగించారని ఆరోపించారు. బిహార్ పర్యటనలో రాళ్లదాడి జరిగినా, అప్పటి ప్రభుత్వం తన తండ్రికి భద్రత పెంచలేదని.. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆయన ప్రాణాలు కోల్పోయారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ తల్లి సోనియా, చెల్లెలు ప్రియాంక వాద్రాలతో జరిపిన సంభాషణను ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు.
#RajivGandhi #RahulGandhi #SoniaGandhi #PriyankaGandhi #PriyankaVadhra
బాబు 'చీకటి గెలుపు' బట్టబయలు
2024 ఎన్నికల్లో కూటమి బండారాన్ని బయట పెట్టిన 'రిపోర్టర్స్ కలెక్టివ్' సంస్థ
బయటపడ్డ చంద్రబాబు సిస్టమాటిక్ రిగ్గింగ్
చిత్తూరు లోక్ సభ స్థానంలో ఓటింగ్‌పై పరిశోధన చేసిన జాతీయ స్థాయి జర్నలిస్ట్‌లు
పోలింగ్ రోజు సాయంత్రం 6 తరువాత పోలైన ఓట్లలో 31,471 ఓట్లు మాయమైనట్లు వెల్లడి
ఈలోక్ సభ స్థానంలో సాయంత్రం 6 తరువాత క్యూలో 56,067 మంది ఉన్నట్లు రికార్డుల్లో వెల్లడి
చిత్తూరు లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 6 తరువాత పోలైన ఓట్లు 24,596గా లెక్క
మిగతా 31,471 ఓట్లు మాయమైపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న మేధావులు, నెటిజన్లు
పార్లమెంట్‌కు, అసెంబ్లీకి ఏక కాలంలో ఎన్నికలు జరిగినప్పుడు తేడా ఎందుకు వస్తుందని ప్రశ్న
చంద్రబాబు సహా మిగతా వారు అక్రమంగా గెలిచారన్న అనుమానాలు
ఇప్పటికే ఏపీలో జరిగిన ఎన్నికలపై పరకాల ప్రభాకర్ అనేక సందేహాలు
రిగ్గింగ్ అనడానికి ఇదే నిదర్శనం:
.........................................
ఈ సంచలనాత్మక దర్యాప్తు నివేదిక 2024 ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని సూచిస్తోంది. ఈ నివేదికలోని మొదటి రెండు భాగాలు దర్యాప్తులో ఈసీఐ రికార్డుల నిర్వహణలో ఉన్న తీవ్రమైన లోపాలను,పొరపాట్లను బట్టబయలు చేశాయి. మూడో కథనం రిగ్గింగ్ జరిగిందనే సంకేతాలు ఇస్తోంది. ఏపీలో ఒకేసారి జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల తరువాత పోలింగ్ గణాంకాల మధ్య ఇంత భారీ వ్యత్యాసం అసాధారణం. ఏపీలో పోలింగ్ మోసాలను పరకాల ప్రభాకర్ ఎప్పటి నుంచో అందరి దృష్టికి తీసుకు వస్తూ ఉన్నారు. రిపోర్టర్స్ కలెక్టివ్ ఇచ్చిన తాజా నివేదిక ఆయనను వాదనలు నిజమని చెబుతుంది.
- యోగేంద్ర యాదవ్, సామాజిక వేత్త
భారీ తేడాను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు..?
..........................................
సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు పార్లమెంటరీ స్థానంలో సాయంత్రం 6 గంటల సమయానికి 56,067 మంది ఓటర్లు క్యూలో ఉన్నట్లు ఈసీఐ అంతర్గత రికార్డులు నిర్దారిస్తున్నాయి. చిత్తూరు పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు 24,596 మందిని మాత్రమే లెక్కించారు. హింసాత్మక ఘటనలతో అట్టుడికిన ఈ ఎన్నికల్లో 31 వేలకు పైగా ఉన్న ఈ వ్యత్యాన్ని ఎన్నికల కమిషన్ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. దీనిపై విచారణ ఎందుకు జరపలేదు.
- ప్రశాంత్ భూషణ్, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి
చంద్రబాబు సహా వారంతా ఎలా గెలిచినట్లు..?
..........................................
రిపోర్టర్స్ కలెక్టివ్ సంస్థ చేసిన పరిశోధన ఏకంగా సీఎం చంద్రబాబుతో సహా చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిదిలోని ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేల గెలుపునే ప్రశ్నిస్తుంది. 2024 జూన్ 4న ఓట్లు లెక్కించారు. కుప్పంలో జరిగిన లెక్కింపు చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించింది. తొలి నాలుగు రౌండ్లలో YSRCP కుప్పం అభ్యర్ధి భరత్, ఎంపీ అభ్యర్ధి రెడ్డప్పకు.. టీడీపీ అభ్యర్థులకు వంద ఓట్ల తేడానే ఉంది.
ఆధిక్యం ఇలా ఉంటే చంద్రబాబుకు ఓటమి తప్పదని అందరూ భావించారు. కానీ.. ఆ తరువాత ఓట్లలో టీడీపీకి అనూహ్యాంగా ఓట్లు పెరిగాయి. దీంతో చంద్రబాబు విజయం సాధించారు. ఇలా ఓట్లు అనూహ్యారీతిలో పెరగడం అనుమానాలకు తావిచ్చింది. మిగతా నియోజకవర్గాల్లోనూ ఓట్ల సరళి ఇలానే ఉంది. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వీరంతా విజయం సాధించడానికి లెక్కల్లో మాయమైన ఓట్లే కారణమన్న వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వినిపిస్తున్నాయి.
రిపోర్టర్స్ కలెక్టివ్ తొలి ఆడిటింగ్లోనే రెండు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 స్థానాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు వున్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపింది. 2024 ఎన్నికల్లో అవకతవకలపై మరింత పరిశోధనకు సాయం అడుగుతుంది రిపోర్టర్ప్ కలెక్టివ్.
#2024GeneralElections #ReportersCollective #AndhraPradesh #AndhraPradeshNews #ParakalaPrabhakar #YSjagan #CBN @YSRCParty @ysjagan @ysrcp_usa @we_ysrcp @YSRCPEurope @YSRCPLegalCell @YSRCP_Italy @YSRCP_Germany @ukysrcp @YSRCPCommanders @ysrcp_usa @ysrcpaus @YsrcpKuwait @GunturYSRCP @UttarAndhraYCP @YSRCPWWOfficial @YSRCPWomenVoice @Ysrcp_womens
🤖 Made with AI
హే రామ్... ఆలయాలను రక్షించండి..
ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి అంటూ YS జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్ధితులు చాలా అన్యాయంగా ఉన్నాయంటూ YS జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో శతాబ్దాల నాటి అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చి వేయించింది.
ఈ మహపచారంపై YS జగన్ X వేదికగ స్పందించారు.
శతాబ్దాల చరిత్ర కలిగిన ఆంజనేయపురం అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు YS జగన్. కోట్లాది మంది భక్తుల మనోభావాలపై కూటమి ప్రభుత్వం దాడి చేసిందన్నారు.
తిరుమలలో చారిత్రక వేయి కాళ్ల మండపం కూల్చివేతతో మొదలైన విధ్వంసం.. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 40 దేవాలయాలు కూల్చారని మండిపడ్డారు YS జగన్.
బద్వేలులోని కాశీనాయన క్షేత్రంలోనూ సత్రాలను కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయాలను అన్వేషించకుండా పవిత్ర ఆలయాలపై బుల్డోజర్లు నడపడమేనా మీ పాలన అంటే అని చంద్రబాబు సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు YS జగన్.
దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం YSRCP ప్రభుత్వం శ్రీవాణి ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆలయాలను కూలుస్తుందన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పే చంద్రబాబు.. ఆలయాల కూల్చివేతను ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటే ఇదేనా చంద్రబాబూ అంటూ ఘటుగా ప్రశ్నించారు YS జగన్. ఆలయాలను కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వానికి లేదా..? అని X వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు YS జగన్.
అసలు... YS జగన్ కంటే ముందు బీజేపీ నేతలు స్పందించాలి.. బీజేపీ నేతల కంటే ముందు సనాతన ధర్మ పరిరక్షకుడని అని చెప్పుకునే పవన్ కల్యాణ్ స్పందించాలి. హిందూ ధర్మపరిరక్షులమని చెప్పుకునే బీజేపీ, పవన్ ఎందుకు ఆలయాల కూల్చివేతపై స్పందించడం లేదు. మీ ప్రభుత్వంలో జరుగుతోన్న ప్రశ్నించాల్సిన బాధ్యత మీకు లేదా..? మీరు చంద్రబాబును ప్రశ్నించకపోతే.. ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు.
#YSJagan #AbhayanjaneyaSwamyTemple #tirupathi #Renigunta #SrivaniTrust @YSRCParty @ysjagan @we_ysrcp @YSRCPLegalCell @YSRCPCommanders @YSRCPAmerica @ysrcp_usa @ysrcp_usa @YSRCPEurope @YSRCP_Italy @YSRCP_Germany @YSRCPResurgence @VizagYSRCP @VizianagaramYCP @GunturYSRCP @Ysrcp_Tirupathi @Ysrcp_Tirupathi
🤖 Made with AI
ఎన్విడియా సీఈవోగా మళ్లీ జాన్సన్ హువాంగ్
హువాంగ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న బోర్డు సభ్యులు
తక్షణమే సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న హువాంగ్
నవంబర్ 11న రాజీనామా చేసిన జాన్సన్.
#NVidia #JensenHuang #HuangReturns #HuangBack
5
264
32 లక్షల కోట్ల పెట్టుబడులు
-ఈనాడు Nov 14 2026
వాస్తవాలు :
రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.6,962 కోట్లే.!
-లోక్ సభలో వెల్లడించిన కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ
(జూలై 21, 2026)
బాబు వచ్చాక వెళ్లిపోయిన (విరమించిన)
9 కంపెనీల పెట్టుబడుల విలువ -రూ.31,428 కోట్లు
1.కోకా కోలా : 1,200 కోట్లు
2.అజాద్ మొబిలిటీ : 1,046 కోట్లు
3.జూపిటర్ : 2,700 కోట్లు
4.జిన్ ప్రా : 1,150 కోట్లు
5.ఐస్పేస్ సాఫ్ట్ వేర్ : 119 కోట్లు
6.టాటా పవర్ : 6,675 కోట్లు
7.వెబ్ సోల్ : 3,538 కోట్లు
8.ఆర్ వీర్ పవర్ : 4,700 కోట్లు
9.మెఘా పంప్డ్ స్టోరేజ్ : 10,300 కోట్లు
మొత్తం : 31,428కోట్లు
2 ఏళ్లలో
ఏపీలో 4,520 MSMEలు మూత
48,777 ఉద్యోగాలు హుష్‌కాకి
-పార్లమెంటులో 2026 జులై 21, 22 న
MP మిథున్‌రెడ్డి ప్రశ్నలకు కేంద్ర మంత్రుల సమాధానాలు
#APNews #ANdhraPradeshNews #CBN #YSJagan












